హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
హైదరాబాద్‌లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.
హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మాదపూర్‌లోని 100 ఫీట్స్ రోడ్డులో పర్వత్ నగర్ చౌరస్తా సమీపంలో వీరి బుల్లెట్ బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. బైక్ నడిపిన యువకుడు మద్యం మత్తులో ఉన్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.సీసీటీవీ కెమెరాల్లో దృశ్యాలు నమోదయ్యాయి. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. మృతులు బోరబండ ప్రాంతంలోని నివాసులుగా పోలీసులు గుర్తించారు.కేసు నమోదు చేసుకొని మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. యువకుల మృతితో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.