Telugu Global
CRIME

వారానికి కేవలం రూ.200 ఫైనాన్స్ కట్టలేక దంపతులు ఆత్మహత్య

వారానికి రూ.200 ఫైనాన్స్ కిస్తీలు కట్టలేక ఇద్దరు పిల్లలను అనాధలు చేసి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు.

వారానికి కేవలం రూ.200 ఫైనాన్స్ కట్టలేక దంపతులు ఆత్మహత్య
X

వారానికి కేవలం రూ.200 ఫైనాన్స్ కిస్తీలు కట్టలేక దంపతులు సుసైడ్ చేసుకున్నారు. ఈ ఘటన భూపాలపల్లి మండలం కమలాపూర్‌లో జరిగింది. ఈ గ్రామానికి చెందిన బానోతు దేవేందర్, చందన భార్య భర్తలు వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. గ్రామాల్లో కొంత మంది మహిళలను గ్రూపుగా ఏర్పరిచి ప్రైవేటు ఫైనాన్స్ వ్యాపారులు రుణాలిస్తుంటారు. కొద్ది నెలల కిందట చందన సభ్యురాలిగా ఉన్న సంఘం సభ్యులంతా కలిసి రూ.2.50 లక్షల వరకు అప్పు తీసుకున్నారు.

దీనికి ప్రతి వారం రూ.200 కిస్తీ కట్టాల్సి ఉంది.కొన్నాళ్లు సక్రమంగానే చెల్లించినా.. భర్త, పిల్లలు అనారోగ్యాల బారిన పడడంతో కొన్నాళ్లుగా చందన కిస్తీలు కట్టలేకపోయింది. ఫైనాన్స్ యజమాని ఒత్తిడి చేయడంతో భార్యాభర్తలు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. దీంతో చందన డిసెంబరు 6న గడ్డి మందు తాగగా.. ఇరుగుపొరుగు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితిపై ఆందోళనతో దేవేందర్ అదే నెల 20న ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భర్త మరణాంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చందన సైతం మంగళవారం మృతి చెందడటంతో పిల్లలిద్దరూ అనాధలుగా మిగిలారు.

First Published:  1 Jan 2025 3:25 PM IST
Next Story