Telugu Global
CRIME

భైంసా నుంచి కాశీకి వెళ్తున్న బస్సుకు ఘోర ప్రమాదం.. ఒకరి సజీవ దహనం

తెలంగాణవాసుల కాశీయాత్రలో విషాదం చోటుచేసుకున్నది.

భైంసా నుంచి కాశీకి వెళ్తున్న బస్సుకు ఘోర ప్రమాదం.. ఒకరి సజీవ దహనం
X

ఆదిలాబాద్ నుంచి 50 మంది టూరిస్ట్‌లతో వెళ్తున్న బస్సు యూపీలోని బృందావన్‌లో ఘోర ప్రమాదానికి గురైంది. అకస్మాత్తుగా మంటలు అంటుకోవడంతో బస్సు కాలిబూడిదైంది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మిగతా 49 మంది సురక్షితంగా తప్పించుకున్నారు. మృతుడిని నిర్మల్‌ జిల్లా పల్సికి చెందిన పల్సీకి చెందిన శీలం ధృపత్‌గా గుర్తించారు. డిసెంబర్ 1న బస్సు ఆదిలాబాద్ నుంచి బయలుదేరింది. యాత్రికులు నిన్న సాయంత్రం బృందావన్ క్షేత్రాన్ని దర్శించుకునేందుకు వెళ్లగా అనారోగ్య కారణాలతో దురపతి బస్సులోనే ఉండిపోయారు. వారు తిరిగి వచ్చే సరికి బస్సు కాలి బూడిదై కనిపించింది. విషయం తెలిసిన కేంద్రమంత్రి బండి సంజయ్, ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ వెంటనే స్పందించారు. మథుర కలెక్టర్, ఎస్పీతో మాట్లాడి బాధితులను క్షేమంగా తిరిగి రప్పించే ఏర్పాట్లు చేశారు. ప్రమాదంలో అన్నీ కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిన యాత్రికులు ప్రస్తుతం పోలీసులు, ఆర్ఎస్ఎస్ సంరక్షణలో ఉన్నారు.

స్వస్థలాలకు వెళ్లేందుకు వారికి ఆర్థిక సాయం కూడా చేసినట్టు తెలిసింది..ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని భైంసా నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రం కాశీకి పర్యాటకులతో బస్సు బయల్దేరింది. ఈ క్రమంలో యూపీలోని బృందావనం సమీపంలో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి బస్సు మొత్తం విస్తరించడంతో అది పూర్తిగా దగ్ధమైంది. దీంతో అందులో ఉన్న వ్యక్తి సజీవ దహనమయ్యాడు. కాగా, ప్రమాద సమయంలో 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తున్నది. ప్రమాదాన్ని గుర్తించిన బస్సు డ్రైవర్‌ అప్రమత్తం చేయడంతో వారంతా అందులోనుంచి దిగిపోయారు. అయితే బస్సులో ఉండిపోయిన శీలం దుర్పత్తి మాత్రం మృతిచెందాడు. దీంతో అతని కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

First Published:  15 Jan 2025 10:34 AM IST
Next Story