మిగిలిపోయిన ఫుడ్ కోసం స్విగ్గీ సర్వ్స్
మిగిలిపోయిన ఆహారం వృథా కాకుండాపేదలకు అందించాలన్న సదుద్దేశంతో స్విగ్గీ సర్వ్స్ కార్యక్రమాన్ని ప్రారంభించింది
హోటల్స్, రెస్టారెంట్లలో నిత్యం ఎంతో ఫుడ్ మిగిలిపోతుంటుంది. అలా మిగిలిపోయిన ఆహారం వేస్ట్ కాకుండా... పేదలకు అందించాలన్న సదుద్దేశంతో స్విగ్గీ నేడు సరి కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం కోసం స్విగ్గీ... రాబిన్ హుడ్ ఆర్మీ అనే సామాజిక సేవా సంస్థతో చేతులు కలిపింది. దీనిపై స్విగ్గీ సీఈవో రోహిత్ కపూర్ స్పందించారు. స్విగ్గీ సర్వ్స్ కార్యక్రమాన్ని దేశంలోని 33 నగరాల్లో చేపడుతున్నామని చెప్పారు. దీన్ని మరిన్ని నగరాలకు విస్తరిస్తామని తెలిపారు. తమ కార్యాచరణ వల్ల ఆహారం వృథా అవడం అనే సమస్యే ఉండదని, అటు పేదలకు కూడా ప్రయోజనం కలుగుతుందని రోహిత్ కపూర్ అన్నారు.
స్విగ్గీ మరో యాప్ తీసుకొచ్చేందుకు సన్నద్ధమవుతోంది. క్విక్ కామర్స్ విభాగం ఇన్‌స్టామార్ట్ కోసం నూతన అప్లికేషన్‌ను త్వరలో తీసుకురానుంది. ఈ విషయాన్ని కంపెనీ సీఈఓ శ్రీహర్ష మజేటీ ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌కు వెల్లడించారు. వినియోగదారులను ఆకర్షించేందుకు అన్ని సంస్థలు ప్రత్యేక యాప్‌లతో ముందుకొస్తున్న నేపథ్యంలో స్విగ్గీ కూడా కొత్త యాప్ పరిచయం చేస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.