త్వరలోనే శాంసంగ్ బడ్జెట్ ఫోన్ ‘ఎఫ్15’ రిలీజ్! ఫీచర్లివే..
మనదేశంలో మార్చి 4వ తేదీన ‘శాంసంగ్ గెలాక్సీ ఎఫ్15 5జీ’ మొబైల్ లాంఛ్ అవ్వనుంది.
సౌత్ కొరియన్ బ్రాండ్ శాంసంగ్ నుంచి ఇండియన్ మార్కెట్లోకి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్ లాంఛ్ అవ్వనుంది. మరో మూడు రోజుల్లో ఈ మొబైల్ సేల్‌కు రెడీగా ఉంటుంది. ఈ మొబైల్ ఫీచర్లు, ధర వివరాల్లోకి వెళ్తే..
మనదేశంలో మార్చి 4వ తేదీన ‘శాంసంగ్ గెలాక్సీ ఎఫ్15 5జీ’ మొబైల్ లాంఛ్ అవ్వనుంది. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ ఎంట్రీ లెవల్ ఫోన్‌కు కొనసాగింపుగా ఈ మొబైల్‌ను లాంఛ్ చేస్తున్నారు. దీని ధర రూ.15,000 లోపే ఉండొచ్చని అంచనా.
శాంసంగ్ ఎఫ్ 15 5జీ మొబైల్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ఎస్‌వోసీ ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ఇందులో 6.5 అంగుళాల ఆమోలెడ్ స్క్రీన్ ఉంటుంది. ఇది 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. కెమెరా విషయానికొస్తే.. ఇందులో వెనుకవైపు 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండనుంది. దీంతోపాటు మరో అల్ట్రావైడ్ లెన్స్, మాక్రో లెన్స్ కూడా ఉండొచ్చు. అలాగే ముందువైపు సెల్ఫీల కోసం 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది.
శాంసంగ్ ఎఫ్ 15 5జీ మొబైల్ లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25వాట్ ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీతో ఈ మొబైల్ రానుంది. యాష్ బ్లాక్, గ్రూవీ వయోలెట్, జాజీ గ్రీన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
ఇందులో శాంసంగ్ గెలాక్సీ ‘ఎ’ సిరీస్ మోడల్స్ ఉన్న వాయిస్ ఫోకస్ ఫీచర్ కూడా ఉంటుంది. ఈ ఫీచర్ ద్వారా కాల్స్ మాట్లాడే సమయంలో బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ను క్యాన్సిల్ చేయొచ్చు. ఇకపోతే ఈ మొబైల్‌కు నాలుగేళ్ల పాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, ఐదేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తామని శాంసంగ్ చెప్తోంది.