ఓయో సంచలన నిర్ణయం..వారికి నో ఎంట్రీ
కొత్త ఏడాదిలో ఓయో ఓ కొత్త రూల్ తెచ్చింది.
ఓయె నూతన చెక్-ఇన్ పాలసీని తీసుకొచ్చింది. ఇకనుంచి పెళ్లి కాని జంటలకు రూమ్స్ ఇవ్వమని పేర్కొన్నాది. ఇకపై పెళ్లి కాని యువతీ, యువకులు ఓయో రూమ్స్ లో చెక్ ఇన్ చేసేటప్పుడు వారి రిలేషన్షిప్‌కు సంబంధించిన చెల్లుబాటు అయ్యే ఐడి ప్రూఫ్స్ అడగనుంది. సరైన ఐడి ప్రూఫ్ లేకపోతే బుకింగ్స్‌ను తిరస్కరించే అధికారాన్ని పార్టనర్ హోటల్స్‌కు ఇస్తున్నట్టు ఓయో చెప్పుకొచ్చింది. మొదటగా యూపీ మీరట్‌లోని ఓయో భాగస్వామి హోటల్స్‌లో చెక్ ఇన్ పాలసీని ప్రారంభించింది.
అక్కడ నుంచి వచ్చే గ్రౌండ్ ఫీడ్ బ్యాక్ ఆధారంగా కంపెనీ ఈ కొత్త రూల్‌ని మరిన్ని నగరాలలో అమలు చేయనుంది.బుకింగ్ సమయంలోనే వివాహానికి సంబంధించి తగిన ఆధారాన్ని చూపించాలని స్పష్టం చేశారు. ఈమేరకు ఓయో చెక్ ఇన్ రూల్స్ లో మార్పులపై కంపెనీ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. సురక్షితమైన, బాధ్యతాయుతమైన ఆతిథ్య పద్ధతులను అమలు చేసేందుకు ఓయో కట్టుబడి ఉంటుందని కంపెనీ సీఈవో రితేశ్ అగర్వాల్ తెలిపారు.