Telugu Global
Business

Maruti Suzuki Fronx | మారుతి ఫ్రాంక్స్ వర్సెస్‌ హ్యుండాయ్ ఎక్స్‌ట‌ర్‌.. బెస్ట్ ఎస్‌యూవీ కారేదంటే..?!

Maruti Suzuki Fronx | దేశంలోనే అతిపెద్ద కార్ల త‌యారీ సంస్థ మారుతి సుజుకి. ప్ర‌స్తుతం అత్యాధునిక టెక్నాల‌జీ అందుబాటులోకి రావ‌డంతో ఇత‌ర ఆటోమొబైల్ సంస్థ‌లు సైతం ఆక‌ర్ష‌ణీయ ఫీచ‌ర్ల‌తో కార్ల త‌యారీలో దూసుకెళ్తున్నాయి.

Maruti Suzuki Fronx | మారుతి ఫ్రాంక్స్ వర్సెస్‌ హ్యుండాయ్ ఎక్స్‌ట‌ర్‌.. బెస్ట్ ఎస్‌యూవీ కారేదంటే..?!
X

Maruti Suzuki Fronx | దేశంలోనే అతిపెద్ద కార్ల త‌యారీ సంస్థ మారుతి సుజుకి. ప్ర‌స్తుతం అత్యాధునిక టెక్నాల‌జీ అందుబాటులోకి రావ‌డంతో ఇత‌ర ఆటోమొబైల్ సంస్థ‌లు సైతం ఆక‌ర్ష‌ణీయ ఫీచ‌ర్ల‌తో కార్ల త‌యారీలో దూసుకెళ్తున్నాయి. గ‌తంతో పోలిస్తే ప్ర‌స్తుతం ప్ర‌తి ఒక్క‌రూ ప‌ర్స‌న‌ల్ మొబిలిటీకి ప్రాధాన్యం ఇవ్వ‌డంతోపాటు స్పోర్ట్ యుటిలిటీ వెహిక‌ల్ (ఎస్‌యూవీ) కార్ల‌పై మోజు పెంచుకుంటున్నారు. రోజురోజుకి ఎస్‌యూవీ కార్ల విక్ర‌యాలు పెరుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఎస్‌యూవీ కార్ల సెగ్మెంట్‌లో త‌న ప‌ట్టును కాపాడుకునేందుకు మారుతి సుజుకి గ‌త ఏప్రిల్‌లో స‌బ్‌-4 మీట‌ర్ కంపాక్ట్ ఎస్‌యూవీ ఫ్రాంక్స్ కారును మార్కెట్లో ఆవిష్క‌రించింది.

అత్యాధునిక‌, ఆక‌ర్షణీయ ఫీచ‌ర్ల‌తో అందుబాటులోకి వ‌చ్చిన ఫ్రాంక్స్ అంచ‌నాల‌కు అనుగుణంగానే ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రం (2023-24)లో అత్య‌ధికంగా అమ్ముడ‌వుతున్న ఎస్‌యూవీ కారుగా నిలిచింది. 2023 ఏప్రిల్ నుంచి ఫిబ్ర‌వ‌రి వ‌ర‌కూ 1,22,204 ఫ్రాంక్స్ కార్లు అమ్ముడ‌య్యాయి. ప్ర‌తి నెలా స‌గ‌టున 11,109 యూనిట్ల ఫ్రాంక్స్ కార్లు సేల్ అయ్యాయి.

మారుతి ఫ్రాంక్స్‌కు పోటీగా హ్యుండాయ్ మోటార్ ఇండియా గ‌త జూలైలో ఎక్స్‌ట‌ర్ ఎస్‌యూవీ కారును ఆవిష్క‌రించింది. 2023 జూలై నుంచి 2024 ఫిబ్ర‌వ‌రి వ‌ర‌కూ హ్యుండాయ్ ఎక్స్‌ట‌ర్ 62,824 యూనిట్లు అమ్ముడ‌య్యాయి. అంటే స‌గ‌టున నెల‌కు 7,853 ఎక్స్‌ట‌ర్ కార్లు అమ్ముడు పోయాయి. మారుతి సుజుకి ఫ్రాంక్స్ కంటే ఇది త‌క్కువ‌.

హ్యుండాయ్ ఎక్స్‌ట‌ర్‌తో పోలిస్తే గ‌త ప‌ది నెల‌ల్లో ల‌క్ష‌ల యూనిట్ల మార్క్‌కు చేరుకున్న‌ది. దేశీయ మార్కెట్లో శ‌ర‌వేగంగా అత్య‌ధికంగా అమ్ముడైన కారు ఫ్రాంక్స్‌. కార్ల విక్ర‌యాల‌తో పోలిస్తే 2023-24 ఆర్థిక సంవ‌త్స‌రంలో ఆవిష్క‌రించిన కొత్త కార్ల‌లో బెస్ట్ మోడ‌ల్ ఫ్రాంక్స్‌ అని అంటున్నారు.

మారుతి సుజుకి ఫ్రాంక్స్ 1.2- లీట‌ర్ల డ్యుయ‌ల్ జెట్ డ్యుయ‌ల్ వీవీటీ పెట్రోల్ ఇంజిన్‌తో వ‌స్తుంది. ఈ ఇంజిన్ గ‌రిష్టంగా 89.73 పీఎస్ విద్యుత్‌, 113 ఎన్ఎం టార్క్ వెలువ‌రిస్తుంది. 1.0-లీట‌ర్ల ట‌ర్బో బూస్ట‌ర్ జెట్ పెట్రోల్ ఇంజిన్ ఆప్ష‌న్ కూడా అందుబాటులో ఉంది. ఈ ట‌ర్బో బూస్ట‌ర్ జెట్ పెట్రోల్ ఇంజిన్ గ‌రిష్టంగా 100.06 పీఎస్ విద్యుత్‌, 147.6 ఎన్ఎం టార్క్ వెలువ‌రిస్తుంది. 1.2 లీట‌ర్ల పెట్రోల్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువ‌ల్ ట్రాన్స్‌మిష‌న్ లేదా 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిష‌న్ ఆప్ష‌న్‌తో వ‌స్తుంది. 1.0 లీట‌ర్ల ట‌ర్బో బూస్ట‌ర్ జెట్ పెట్రోల్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువ‌ల్ ట్రాన్స్‌మిష‌న్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిష‌న్ ఆప్ష‌న్ల‌లో అందుబాటులో ఉంటుంది.

మారుతి సుజుకి ఫ్రాంక్స్ సీఎన్జీ ఆప్ష‌న్ కారు 5-స్పీడ్ మాన్యువ‌ల్ ట్రాన్స్‌మిష‌న్ ఆప్ష‌న్‌తో 1.2-లీట‌ర్ల డ్యుయ‌ల్ జెట్ డ్యుయ‌ల్ వీవీటీ పెట్రోల్ ఇంజిన్ (గ‌రిష్టంగా 77.5 పీఎస్ విద్యుత్‌, 98.5 ఎన్ఎం టార్క్‌) వ‌స్తుంది. 1.2 లీట‌ర్ల పెట్రోల్ ఇంజిన్ లీట‌ర్ పెట్రోల్‌పై 21.79 కిమీ, 1.2 ఏఎంటీ ఆప్ష‌న్ ఇంజిన్ 22.89 కి.మీ, 1.0 లీట‌ర్ల ట‌ర్బో బూస్ట‌ర్ జెట్ పెట్రోల్ ఇంజిన్ 21.5 కి.మీ, 1.0 ఏటీ ఆప్ష‌న్ ఇంజిన్ 20.01 కి.మీ, 1.2 ఎంటీ సీఎన్జీ వేరియంట్ కిలో సీఎన్జీపై 28.51 కి.మీ మైలేజీ ఇస్తుంది.

మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఎల్ఈడీ మ‌ల్టీ రిఫ్లెక్ట‌ర్ హెడ్ ల్యాంప్స్ విత్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్‌, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్‌, ఎల్ఈడీ రేర్ కాంబినేష‌న్ ల్యాంప్స్‌, షార్క్ ఫిన్ యాంటీనా, 16-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉంటాయి. ఇంకా 9-అంగుళాల హెచ్‌డీ స్మార్ట్ ప్లే ప్రో+ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్ట‌మ్‌, వైర్‌లెస్ యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో క‌నెక్టివిటీ ఉంటుంది. ఆర్కామిస్ స‌రౌండ్ సౌండ్ సిస్ట‌మ్‌, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌, ట‌ర్న్‌బై ట‌ర్న్ నేవిగేష‌న్‌తో హెడ్ అప్ డిస్‌ప్లే, 360-డిగ్రీ వ్యూ కెమెరా, వైర్‌లెస్ చార్జ‌ర్ త‌దిత‌ర ఫీచ‌ర్లు ఉంటాయి. ఇక సేఫ్టీ కోసం 6-ఎయిర్‌బ్యాగ్స్ త్రీ పాయింట్ ఈఎల్ఆర్ సీట్‌బెల్ట్స్‌, ఈఎస్పీ విత్ హిల్ హోల్డ్ అసిస్ట్‌, రోల్ ఓవ‌ర్ మిటిగేష‌న్‌, ఏబీఎస్ విత్ ఈబీడీ, బ్రేక్ అసిస్ట్‌, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్

మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఐదు వేరియంట్లు - సిగ్మా, డెల్టా, డెల్టా+, జెటా, ఆల్ఫా వేరియంట్ల‌ల ల‌భిస్తుంది. ఆయా వేరియంట్ల ధ‌ర‌వ‌ర‌లు ఇలా..

సిగ్మా 1.2 ఎంటీ - రూ. 7.51 ల‌క్ష‌లు

సిగ్మా సీఎన్జీ ఎంటీ - రూ. 8.46 ల‌క్ష‌లు

డెల్టా 1.2 ఎంటీ - రూ. 8.37 ల‌క్ష‌లు

డెల్టా సీఎన్జీ ఎంటీ - రూ. 9.32 ల‌క్ష‌లు

డెల్టా 1.2 ఏఎంటీ - రూ. 8.87 ల‌క్ష‌లు

డెల్టా+ 1.2 ఎంటీ - రూ. 8.77 ల‌క్ష‌లు

డెల్టా+ 1.2 ఏఎంటీ - రూ. 9.27 ల‌క్ష‌లు

డెల్టా+ 1.0 ఎంటీ - రూ. 9.72 ల‌క్ష‌లు

జెటా 1.0 ఎంటీ - రూ. 10.55 ల‌క్ష‌లు

జెటా 1.0 ఏటీ - రూ. 11.95 ల‌క్ష‌లు

ఆల్ఫా 1.0 ఎంటీ - Rs 11.47 ల‌క్ష‌లు

ఆల్ఫా 1.0 ఏటీ - Rs 12.87 ల‌క్ష‌లు

ఆల్ఫా 1.0 ఎంటీ డ్యుయ‌ల్ టోన్ - రూ. 11.63 ల‌క్ష‌లు

ఆల్ఫా 1.0. ఏటీ డ్యుయ‌ల్ టోన్ - రూ. 13.03 ల‌క్ష‌లు

First Published:  10 March 2024 9:50 AM IST
Next Story