Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Monday, May 19
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»Health & Lifestyle

    సమ్మర్‌‌లో వ్యాయామం.. ఈ మిస్టేక్స్‌ చేయొద్దు!

    By Telugu GlobalMarch 10, 2024Updated:March 29, 20251 Min Read
    సమ్మర్‌‌లో వ్యాయామం.. ఈ మిస్టేక్స్‌ చేయొద్దు!
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    సమ్మర్‌‌లో శరీర ఉష్ణోగ్రతలు, బయటి ఉష్ణోగ్రతల్లో వచ్చే మార్పుల కారణంగా రోజువారీ వ్యాయామం చేసేవాళ్లు కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. సమ్మర్‌‌లో వ్యాయామం చేసేటప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవాలంటే..

    వేసవిలో వ్యాయామాలు చేసేటప్పుడు కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవడం అవసరం ఎందుకంటే.. సమ్మర్‌‌లో వేడి కారణంగా మామూలుగానే ఎక్కువ చెమట పడుతుంటుంది. దీనికితోడు వ్యాయామం కూడా చేయడం మూలంగా చెమట పట్టే ప్రక్రియ మరింత ఎక్కువవుతుంది. చెమట ఎక్కువగా బయటకు పోవడం వల్ల శరీరంలోని మలినాలతో పాటు నీరు, మినరల్స్ కూడా లాస్ అవుతారు. కాబట్టి సమ్మర్‌‌లో చెమట మరీ ఎక్కువ పట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

    వేసవిలో ఎండ మొదలవ్వక ముందే వ్యాయామాన్ని ముగించాలి. అంటే ఉదయం 10 గంటల లోపే వ్యాయామం చేసేయాలి. అలాగే ఈవెనింగ్ వర్కవుట్స్ చేసేవాళ్లు సాయత్రం 5 గంటల తర్వాత ప్లాన్ చేసుకోవాలి.

    సమ్మర్‌‌లో వ్యాయామం చేసేటప్పుడు చెమటను పీల్చే కాటన్ బట్టలు ధరిస్తే మంచిది. వ్యాయామానికి అరగంట ముందు మంచి నీళ్లు లేదా నిమ్మరసం వంటివి తీసుకోవాలి. అలాగే వ్యాయామం తర్వాత కూడా నీళ్లు లేదా ఇతర ద్రవ పదార్థాలు తీసుకోవాలి.

    మిగతా సీజన్లతో పోలిస్తే సమ్మర్‌‌లో శరీరం నుంచి ఎక్కువ నీరు బయటకు వెళ్తుంది. కాబట్టి సమ్మర్‌‌లో మరింత త్వరగా డీహైడ్రేట్ అయ్యే అవకాశం ఉంది. అందుకే వ్యాయామాలు చేసేవాళ్లు రోజు మొత్తం హైడ్రేటెడ్‌గా ఉంటున్నారో లేదో చెక్ చేసుకోవాలి. ముఖ్యంగా జిమ్ వర్కవుట్లు చేసేవాళ్లు ఈ సీజన్‌లో మరింత హైడ్రేటెడ్‌గా ఉండాలి. శరీరంలో ఎలక్రొలైట్స్ భర్తీ అయ్యేలా నిమ్మరసం, కొబ్బరి నీళ్లు వంటివి కూడా తరచూ తాగుతుండాలి.

    సమ్మర్‌‌లో వ్యాయామం చేసేముందు వాతావరణం ఎలా ఉందో చూసుకోవాలి. బయట వేడిగా ఉంటే వ్యాయామాన్ని చల్లటి వేళకు వాయిదా వేసుకోవడం మంచిది. అలాగే వ్యాయామం చేస్తున్నప్పుడు తలనొప్పి, కళ్లుతిరిగినట్లు అనిపిస్తే వెంటనే వ్యాయామాన్ని ఆపి విశ్రాంతి తీసుకోవాలి.

    Exercise Summer
    Previous ArticleMaruti Suzuki Fronx | మారుతి ఫ్రాంక్స్ వర్సెస్‌ హ్యుండాయ్ ఎక్స్‌ట‌ర్‌.. బెస్ట్ ఎస్‌యూవీ కారేదంటే..?!
    Next Article నేటినుంచే రంజీ ఫైనల్స్, ముంబైకి 42వ టైటిల్ చిక్కేనా?
    Telugu Global

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..

    మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.