నష్టాలతో మొదలైన సూచీలు
మూడు రోజుల నుంచి వరుసగా లాభాల్లో మొదలైన మార్కెట్లు అంతర్జాతీయ బలహీన సంకేతాలతో నష్టాల్లోకి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. గత మూడు రోజుల నుంచి వరుసగా లాభాల్లో మొదలైన మార్కెట్లు అంతర్జాతీయ బలహీన సంకేతాలతో నష్టాల్లోకి వెళ్లాయి. ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లలో మదుపర్లు కొనుగోళ్లకు దిగడంతో సూచీలు కుంగాయి. ఉదయం 10 గంటల సమయంలో సెన్సెక్స్ 343.32 పాయింట్ల నష్టంతో 76699.50 వద్ద ట్రేడవుతున్నది. నిఫ్టీ 109.00 పాయింట్లు కుంగి 23202.80 వద్ద కదలాడుతున్నది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 86.56 వద్ద కొనసాగుతున్నది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 81.57 డాలర్ల వద్ద, బంగారం ఔన్సు 2,746.80 వద్ద ట్రేడవుతున్నది.
సెన్సెక్స్ 30 సూచీలో యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎంఅండ్‌ఎం షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్‌అండ్‌టీ, సన్‌ఫార్మా, నెస్లే ఇండియా, అదానీ పోర్ట్స్, జొమాటో, టాటా స్టీల్ షేర్లు లాభాల్లో కదలాడుతున్నాయి.