బంగారం ఆల్‌టైం గరిష్టం. చెన్నైలో రూ.70 వేల మార్క్ దాటేసిన పసిడి
తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో సోమవారం ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారట్ల బంగారం తులం ధర రూ.850 పెరిగి రూ.64,550 వద్ద నిలిస్తే, 24 క్యారట్ల బంగారం తులం ధర రూ.930 వృద్ధి చెంది రూ.70,420 వద్ద ముగిసింది.
దేశీయ బులియన్ మార్కెట్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ ధరలు ఆల్‌టైం గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. అంతర్జాతీయంగా వచ్చే జూన్‌లో కీలక వడ్డీరేట్లు తగ్గిస్తామని అమెరికా యూఎస్ ఫెడ్ రిజర్వ్ సంకేతాలు ఇవ్వడంతో బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలకు సోమవారం మరొక్కసారి రెక్కలు వచ్చాయి. దేశీయ బులియన్ మార్కెట్‌లో ఫ్యూచర్ గోల్డ్‌లో పది గ్రాముల (24 క్యారట్లు) బంగారం రూ.930 పెరిగి రూ.69,530లకు చేరుకున్నది. ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారట్ల బంగారం తులం ధర రూ.63,750 వద్దకు చేరుకున్నది. తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో సోమవారం పది గ్రాముల మేలిమి బంగారం (24 క్యారట్స్) తులం ధర రూ.70,420 వద్దకు చేరుకున్నది. బులియన్ మార్కెట్‌లో బంగారం ధర ఆల్‌టైం గరిష్ట స్థాయికి చేరుకోవడం ఇదే ఫస్ట్‌టైం.
2024లో పది గ్రాముల బంగారం ధర దాదాపు 10 శాతం పెరిగాయి. ఈ ఏడాది జనవరి ఒకటో తేదీన పది గ్రాముల బంగారం (24 క్యారట్స్) ధర రూ.63,970, ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారట్ల బంగారం ధర రూ.58,770 పలికింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 2,259.28 డాలర్లు పలుకుతున్నది. సరిగ్గా ఏడాది క్రితం 2023 ఏప్రిల్ ఒకటో తేదీన తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.61,560 పలికింది.
2024 మార్చి29న హైదరాబాద్‌లో 24 క్యారట్ల బంగారం తులం ధర ఒక్కరోజే రూ.1420 పెరిగి రూ.68,730లకు చేరుకున్నది. ఇక ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారట్ల బంగారం తులం ధర రూ.1300 పెరిగి రూ.63 వేలు పలికింది. 2023-24 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి మేలిమి బంగారం తులం ధర రూ.8370 పెరిగింది. ఈ ఏడాది చివరికల్లా అమెరికా ఫెడ్ రిజర్వ్ 0.75 శాతం వడ్డీరేట్లు తగ్గిస్తామని సంకేతాలిచ్చింది. అదే జరిగితే బంగారం ధరలు మరింత పైపైకి చేరుకుంటాయని బులియన్ మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో సోమవారం ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారట్ల బంగారం తులం ధర రూ.850 పెరిగి రూ.64,550 వద్ద నిలిస్తే, 24 క్యారట్ల బంగారం తులం ధర రూ.930 వృద్ధి చెంది రూ.70,420 వద్ద ముగిసింది. 2023 ఏప్రిల్ ఒకటో తేదీన ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారట్ల బంగారం తులం ధర రూ.56,900 వద్ద నిలిస్తే, 24 క్యారట్ల బంగారం తులం ధర రూ.62,070 వద్ద నిలిచింది.
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో 24 క్యారట్ల బంగారం తులం ధర రూ.930 పెరిగి రూ.68,450 నుంచి రూ.69,380 పలికింది. ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారట్స్ బంగారం ధర రూ.850 వృద్ధి చెంది రూ.62,750 నుంచి రూ.63,600 లకు చేరుకున్నది. కిలో వెండి ధర రూ.600 పెరిగి రూ.81,600లకు చేరుకున్నది. కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో 24 క్యారట్ల బంగారం తులం ధర రూ.930 పెరిగి రూ.69,380లకు చేరింది. ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారట్ల బంగారం తులం ధర రూ.850 వృద్ధి చెంది రూ.63,700 వద్ద స్థిర పడింది.