Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Tuesday, May 20
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»Health & Lifestyle

    వ్యాయామం గురించి అపోహలు.. వాస్తవాలు!

    By Telugu GlobalApril 1, 2024Updated:March 29, 20252 Mins Read
    వ్యాయామం గురించి అపోహలు.. వాస్తవాలు!
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    రకరకాల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండేందుకు యాక్టివ్ లైఫ్‌స్టైల్ ఉండడం అవసరం. రోజూ వ్యాయామం చేయడం వల్ల చాలారకాల అనారోగ్యాలను నివారించుకోవచ్చని డాక్టర్లు చెప్తుంటారు. అయితే వ్యాయామం చేయడం గురించి చాలామందిలో రకరకాల అపోహలు ఉంటాయి. వాటిలో కొన్నింటిని ఇప్పుడు క్లియర్ చేసుకుందాం.

    వ్యాయామం వల్ల ఎన్ని లాభాలున్నాయో.. సరైన అవగాహన లేకుండా చేసే వ్యాయామాల వల్ల నష్టాలూ ఉన్నాయి. అందుకే వ్యాయామం ఎవరు చేయాలి? ఎప్పుడు చేయాలి? ఎలా చేయాలి? అనే విషయాల్లో కొంత స్పష్టత అవసరం.

    వయసు ముదిరే కొద్దీ వ్యాయామం లాంటివి చేయకూడదని ఒక అపోహ ఉంది. అయితే ఇది వాస్తవం కాదు. వయసు మీద పడినవాళ్లు ఎక్కువగా రెస్ట్ తీసుకుంటుంటారు. కాబట్టి శరీరానికి ఎంతో కొంత కదలిక అవసరం. లేకపోతే కీళ్లనొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వయసు మీద పడిన వాళ్లు వాకింగ్ లాంటి తేలిక పాటి వ్యాయామాలు చేయడం మంచిది.

    వ్యాయామంతో ఎక్కువ అలసిపోతాం, పని చేసుకోలేము. అన్న మరో అపోహ కూడా ఉంది. అయితే ఇందులో కూడా నిజం లేదు. వ్యాయామం చేయడం వల్ల మెటబాలిజం పెరిగి మరింత ఉత్సాహంగా అనిపిస్తుంది. అయితే వ్యాయామం చేసేవాళ్లు ఖర్చు చేసిన క్యాలరీలను తిరిగి తీసుకోవాల్సి ఉంటుంది. వ్యాయామంతోపాటు సరైన డైట్ పాటించడం కూడా ముఖ్యమే.

    తిన్న తర్వాత వ్యాయామం చేయొచ్చా? లేదా? అన్న విషయంలో కూడా చాలామందికి అనుమానాలు ఉన్నాయి. అయితే తిన్న తర్వాత కష్టతరమైన వ్యాయామాలు చేయడం మంచిది కాదని, కేవలం వాకింగ్ మాత్రమే చేయాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

    వ్యాయామంతో టైం వేస్ట్, డైట్ సరిగ్గా ఉంటే చాలు.. అని కొంతమంది భావిస్తుంటారు. అయితే డైట్‌తో పాటు వ్యాయామం కూడా అత్యంత ముఖ్యం అని నిపుణులు చెప్తున్నారు. హెల్దీ లైఫ్ కోసం వారానికి 150 నిముషాల వ్యాయామం ఉండాలి. వ్యాయామం వల్ల టైం వేస్ట్ అవ్వడం మాట అటుంచితే.. మానసిక ఆరోగ్యం మెరుగుపడి ప్రొడక్టివిటీ పెరుగుతుంది. తద్వారా సమయం కలిసొస్తుంది.

    ఇకపోతే వ్యాయామాలను ఎంచుకునే క్రమంలో కొంతమంది పొరబడుతుంటారు. ఫిట్‌గా ఉన్నవాళ్లు అదే ఫిట్‌నెస్ మెయింటెయిన్ చేయడానికి వెయిట్ ట్రైనింగ్, కార్డియో.. రెండు రకాల వ్యాయామాలు చేయొచ్చు. అయితే బరువు తగ్గాలనుకునేవాళ్లు ముందుగా కార్డియోతో మొదలుపెట్టాలి. కీళ్లనొప్పులు ఉన్నవాళ్లు బరువులు ఎత్తే వ్యాయామాలు చేయకూడదు. ఏదేమైనా వ్యాయామాలను ఎంచుకునేటప్పుడు మీ అవసరాలను బట్టి నిపుణుల సలహా తీసుకోవడం ఎంతైనా మంచిది.

    Exercise Myths
    Previous Articleబంగారం ఆల్‌టైం గ‌రిష్టం. చెన్నైలో రూ.70 వేల మార్క్ దాటేసిన ప‌సిడి
    Next Article సరికొత్త ఛార్జర్ స్కామ్.. కేబుల్‌తో డేటా చోరీ! జాగ్రత్తలు ఇలా..
    Telugu Global

    Keep Reading

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..

    మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!

    మహిళల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లక్షణాలు

    నిద్ర లేమి సమస్య మహిళలకే ఎక్కువ.. ఎందుకంటే

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.