Telugu Global
Business

వాట్సాప్ తో కెరీర్‌‌కు నష్టం ! ఎలాగంటే..

రోజువారీ జీవితంలో వాట్సాప్ అనేది భాగమైపోయింది. పర్సనల్ పనుల నుంచి ఆఫీస్ పనుల వరకూ అన్నీ వాట్సాప్ ద్వారానే జరుగుతున్నాయి. అయితే వర్క్‌లో వాట్సాప్ ఎక్కువగా వాడడం వలన కెరీర్ పాడయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వాట్సాప్ తో కెరీర్‌‌కు నష్టం ! ఎలాగంటే..
X

రోజువారీ జీవితంలో వాట్సాప్ అనేది భాగమైపోయింది. పర్సనల్ పనుల నుంచి ఆఫీస్ పనుల వరకూ అన్నీ వాట్సాప్ ద్వారానే జరుగుతున్నాయి. అయితే వర్క్‌లో వాట్సాప్ ఎక్కువగా వాడడం వలన కెరీర్ పాడయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదెలాగంటే.

వాట్సాప్ ద్వారా యువత మేధస్సు దెబ్బతినడంతో పాటు కెరీర్ గ్రోత్ తగ్గుతుందట. జాబ్ ఇంటర్వ్యూల నుంచి ఆఫీస్ టాస్క్‌ల వరకూ కమ్యూనికేషన్ అంతా వాట్సాప్ ద్వారానే సాగుతుండడం వల్ల యూత్‌లో స్కిల్స్ పెరుగుదలకు వాట్సాప్ అడ్డుకట్ట వేస్తోందని సర్వేలు చెప్తున్నాయి.

‘ప్యూ రీసెర్చ్ సెంటర్ అండ్ కామన్ సెన్స్’ మీడియా చేసిన తాజా సర్వే ప్రకారం మెసేజింగ్ యాప్‌ల ద్వారా ఉద్యోగుల కమ్యూనికేషన్ స్కిల్స్ దెబ్బతింటున్నాయని వెల్లడైంది. అంతేకాకుండా పరధ్యానం పెరగడం, ప్రొడక్టివిటీ తగ్గడానికి కూడా వాట్సాప్ వంటి మెసేజింగ్ యాప్స్ కారణంగా ఉంటున్నాయని తేలింది.

ఆఫీసులో టీం లీడర్ టాస్క్‌ను అప్పజెప్పడం నుంచి పనిని ట్రాక్ చేయడం, రిపోర్ట్స్, ఆడిటింగ్, ప్రజెంటేషన్స్ వంటి అన్ని విషయాలు వాట్సాప్ లేదా ఇతర మెసేజింగ్ యాప్స్ ద్వారానే జరుగుతుండడం వల్ల వ్యక్తులను నేరుగా కలవడం, గ్రూప్ డిస్కషన్స్ వంటివి తగ్గిపోతున్నాయని.. తద్వారా ఉద్యోగుల సాఫ్ట్ స్కిల్స్‌పై నెగెటివ్ ఎఫెక్ట్ పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఆఫీస్ కమ్యూనికేషన్ కోసం మెసేజింగ్ యాప్స్ వాడడం ద్వారా డిజిటల్ డిస్ట్రాక్షన్.. అంటే పరధ్యానం పెరగడం, ఫోకస్ తగ్గడం, మెమరీ తగ్గడం వంటి నెగెటివ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటున్నాయి. మెసేజింగ్ యాప్‌ల నుంచి తరచూ వచ్చే నోటిఫికేషన్‌లు పనికి అంతరాయం కలిగించడంతోపాటు ప్రొడక్టివిటీని తగ్గిస్తున్నాయట. అంతేకాదు ఈ మెసేజింగ్ కల్చర్ వల్ల ఒత్తిడి కూడా పెరుగుతోందని రీసెర్చ్‌లు చెప్తున్నాయి. ఇదే అలవాటుని కొనసాగించడం ద్వారా ఉద్యోగుల్లో ఇంటెలిజెన్స్, సాఫ్ట్ స్కిల్స్ వంటివి పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.

ఆఫీస్‌లో వాట్సాప్ కల్చర్ పై నిపుణులు మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం సంస్థలన్నీ వాట్సాప్‌లోనే నడుస్తున్నాయి. కేవలం పని గురించిన వివరాలు తప్ప ఎలాంటి పర్సనల్ కమ్యూనికేషన్ జరగట్లేదు. ప్రతీ పని చాట్ ద్వారానే జరుగుతుంది. డిస్కషన్స్ లేవు. ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ ధోరణి యువకులను మేధోపరంగా బలహీనపరుస్తుంది. ఇలాంటి వ్యక్తులను ఫ్యూచర్‌‌లో ఏఐ బాట్‌లు ఈజీగా రిప్లేస్ చేయగలవు’ అంటూ అభిప్రాయపడుతున్నారు.

సొల్యూషన్ ఇదే!

ఆఫీస్ విషయాలకు వాట్సాప్ వాడడం తగ్గించాలి. టాస్క్‌లు, ఇతర విషయాల గురించి వీలైనంత వరకూ ముఖాముఖిగా కలుసుకుని మాట్లాడాలి. అది కుదరకపోతే కనీసం వీడియో కాల్స్ ద్వారా అయినా కమ్యూనికేట్ చేసుకోగలగాలి. కేవలం టెక్స్ట్ మెసేజ్ ద్వారా కమ్యూనికేట్ చేసుకోవడం అనేది రోబోటిక్ వర్క్ మోడల్ వంటిది అని గుర్తుంచుకోవాలి.

చిన్నచిన్న విషయాలను డిజిటల్‌గా కమ్యూనికేట్ చేస్తూ ముఖ్యమైన విషయాలు డైరెక్ట్‌గా కమ్యూనికేట్ చేసేలా మీ బాస్‌లతో మాట్లాడండి. వీటితోపాటు ఉద్యోగాలు వెతకడం, ఇంటర్వూలు ఇచ్చేటప్పుడు కూడా వాట్సాప్‌కు బదులు ఇతర మార్గాలు వెతకండి. మీ కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ వంటివి పెంపొందించుకునే ప్రయత్నం చేయండి.

First Published:  22 Jan 2024 7:00 PM IST
Next Story