వాట్సాప్ ద్వారా ఈజీ పేమెంట్స్!
వాట్సాప్ ద్వారా పేమెంట్స్ చేసే ఆప్షన్ ఎప్పటినుంచో అందుబాటులో ఉన్నా.. ఆ ఫీచర్ వాడకం చాలా తక్కువ. అయితే ఇప్పుడా ఫీచర్‌ను మరింత సులభతరం చేస్తూ వాట్సాప్ ఓ అప్‌డేట్‌ను తీసుకొచ్చింది.
వాట్సాప్ ద్వారా పేమెంట్స్ చేసే ఆప్షన్ ఎప్పటినుంచో అందుబాటులో ఉన్నా.. ఆ ఫీచర్ వాడకం చాలా తక్కువ. అయితే ఇప్పుడా ఫీచర్‌ను మరింత సులభతరం చేస్తూ వాట్సాప్ ఓ అప్‌డేట్‌ను తీసుకొచ్చింది. అదేంటంటే..
చాటింగ్, న్యూస్, బిజినెస్.. ఇలా రకరకాల పనులకు వాట్సాప్ వాడుతున్న ఈ రోజుల్లో పేమెంట్స్‌కు మాత్రం వాట్సాప్ వాడట్లేదు. వాట్సాప్‌లో యూపీఐ పెమెంట్స్ ఫీచర్ ఎప్పట్నుంచో అందుబాటులో ఉన్నా.. యూజర్లలో దానికి ఆదరణ తక్కువే. దీంతో యూజర్లకు మరింత యాక్సెసిబిలిటీని అందిస్తూ వాట్సాప్ పేమెంట్స్ ఫీచర్‌ను చాట్ లిస్ట్‌కు చేర్చింది. అంటే చాట్ చేస్తుండగానే సింపుల్‌గా రెండు క్లిక్స్‌లో అవతలి వారికి పేమెంట్ చేసేయొచ్చన్న మాట.
ప్రస్తుతం వాట్సాప్ ద్వారా పేమెంట్స్ చేయాలంటే మెనూలోకి వెళ్లి అక్కడ ‘పేమెంట్స్’పై క్లిక్ చేసి ఆ తర్వాత యూజర్ నేమ్ సెర్చ్ చేసి పేమెంట్ చేయాలి. అయితే ఇకపై ఆ అవసరం లేకుండా చాట్ లిస్ట్ నుంచే నేరుగా ఆ ప్రక్రియ పూర్తి చేయొచ్చు. వాట్సప్‌లో బ్యానర్, కెమెరా సింబల్స్ మధ్యలో కొత్తగా క్యూఆర్ కోడ్ స్కానర్ బటన్ రాబోతోంది. దీనిపై క్లిక్ చేయడంతో వాట్సాప్ యూపీఐకి లింక్ చేసిన ఖాతా నుంచి అవతలి వారికి పేమెంట్స్ పూర్తి చేయొచ్చు. ఈ ఫీచర్ వాడుకోవడం వల్ల యూజర్లకు మరింత టైం సేవ్ అవుతుందని వాట్సాప్ చెప్తోంది.
ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుంది. ఇకపోతే రీసెంట్ గా వాట్సాప్ ‘సెర్చ్ బై డేట్’ అనే ఆప్షన్ తెచ్చింది. డేట్‌తో మెసేజ్, ఫొటో, వీడియోలను వెతికేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. అలాగే వాట్సాప్ డీపీలను స్క్రీన్ షాట్ తీయకుండా తెచ్చిన అప్‌డేట్ కూడా కూడా ప్రస్తుతం అందుబాటులోకి వచ్చింది.