ఓలా, ఉబర్ సంస్థలకు కేంద్రం నోటీసులు ఎందుకంటే?
ఓలా, ఉబర్ లకు కేంద్ర ప్రభుత్వం ఇవాళ నోటీసులు ఇచ్చింది
క్యాబ్ అగ్రిటర్ సంస్థలైన ఓలా, ఉబర్ లకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. క్యాబ్ బుక్ చేసుకునేవారికి మొబైల్ ఫోన్ల ఆధారంగా ఛార్జ్ వేస్తున్నారనే ఫిర్యాదులపై కేంద్రం చర్యలకు దిగింది. ఓకే రకమైన సేవకు వేర్వేరు ఛార్జీలు వసూలు చేయడంపై స్పందించాలని కోరింది. ఐఫోన్‌లో రైడ్ బుక్ చేస్తే ఒకలా, ఆండ్రాయిడ్ ఫోన్‌లో బుక్ చేస్తే ఇంకొకలా ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఇటీవల ఢిల్లీకి చెందిన రిషభ్ సింగ్ అనే వ్యక్తి ఎక్స్ లో పెట్టిన ఓ పోస్టు బాగా వైరల్ అయింది. క్యాబ్ సర్వీసులు అందించే ఉబర్ సంస్థ ఫోన్ మోడల్ ను బట్టే కాదు అందులో ఉన్న బ్యాటరీ పర్సంటేజీని బట్టి కూడా చార్జీల్లో వ్యత్యాసం చూపిస్తోందని ఆయన ఆరోపించారు. ఈ ఇష్యుపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లవెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం రంగంలోకి దింగిది.