Telugu Global
Business

మార్కెట్లో రూ.10 పరేషాన్

ప్రస్తుతం మార్కెట్లో రూ.10 కరెన్సీ నోట్ల కొరత తీవ్ర సమస్యగా మారింది. ఎక్కడ రూ.20 నోటు ఇచ్చినా తిరిగి పది రూపాయలు ఇవ్వాలంటే లేదు అనే పరిస్థితి ఎదురవుతోంది.

మార్కెట్లో రూ.10 పరేషాన్
X

మార్కెట్లో రూ.10 నోటు కనిపించడం లేదు. దీంతో ప్రజలు వ్యాపారులు ఇటు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పది నోట్ల కొరత తీవ్ర సమస్యగా మారింది. ప్రస్తుతం ఎక్కడ చూసిన రూ.20 నోటు ఇచ్చినా తిరిగి పది రూపాయలు ఇచ్చే పరిస్థితి లేదు. చిరు వ్యాపారులు, ప్రజలు అనేక ఇబ్బందులకు గురివుతున్నారు. పది రుపాయల నాణేలు చెల్లవంటూ వదంతులు వ్యాపించాయి. దుకాణాలు, చిల్లర వ్యాపారులు, కూరగాయలు, ఇతర మార్కెట్లలో పది రూపాయల కాయిన్స్ తీసుకోవడం లేదు. అతి తక్కువ మంది నాణేలు తీసుకుంటుండగా.. చాలామంది తమ వద్ద ఉన్న నాణేలను బ్యాంకుల్లో అప్పగించి నోట్లతో మార్పిడి చేసుకున్నారు. ప్రస్తుతం పది రూపాయల నోట్ల చెలామణి తగ్గిందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా తరువాత డిజిటల్‌ చెల్లింపులు పెరిగాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహిస్తున్నాయి.

దీంతో అన్ని వర్గాల ప్రజలు ఆన్‌లైన్‌ చెల్లింపులకు అలవాటు పడిపోయారు. ఏ దుకాణానికి వెళ్లినా, ఏ వస్తువు కొనాలన్నా డిజిటల్‌ చెల్లింపులు పని చేస్తున్నాయా? అనే పరిస్థితి నెలకొంది. ప్రతీ కొనుగోలు కార్యకలాపాలన్నీ తక్కువ విలువైన కరెన్సీ పదితో అనుసంధానంగా ఉంటున్నాయి. దేశంలో నోట్ ప్రింటింగ్ ఆర్బీఐ నోట్ ప్రింట్ ప్రైవేట్ లిమిటెడ్ సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా జరుగుతుంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.147 కోట్ల 10 రూపాయల నోట్లను ముద్రించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 128 కోట్ల 40 లక్షలు మాత్రమే ముద్రించనున్నట్లు తెలుస్తోంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 75 కోట్ల 10 రూపాయల నోట్లను మాత్రమే ముద్రించారు. దీంతో 10 రూపాయల నోట్లను క్రమంగా తగ్గిస్తునట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కరోనా తర్వాత ఆర్బీఐ క్లీన్ మనీ పథకాన్ని చేపట్టింది. ఈ సమయంలో పాత చిరిగిన నోట్లను కూడా రద్దు చేశారు. మనీకంట్రోల్ నివేదిక ప్రకారం.. రూ.20 నోట్ల కంటే రూ.10 నోట్లను తయారు చేసేందుకు ఎక్కువ ఖర్చవుతుందని ఆర్బీఐ పేర్కొంది. కొత్త 10 రూపాయల నోట్లు మార్కెట్‌లోకి రాకపోవడానికి ఇది ఒక కారణమని నిపుణులు పేర్కొన్నారు.

First Published:  14 Oct 2024 12:28 PM GMT
Next Story