సోషల్ మీడియాని వాడుకోవడంలో మోదీ కింగ్ అని బీజేపీ నేతల అభిప్రాయం. రెండు దఫాలు కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి రావడానికి.. సోషల్ మీడియాను బీజేపీ సమర్థంగా వినియోగించుకోవడం కూడా ఓ కారణం అంటారు. కానీ మోదీకే సోషల్ మీడియా విషయంలో షాకిచ్చాయి టీఆర్ఎస్ శ్రేణులు. సోషల్ మీడియా కింగ్ ని కాస్తా.. అదే సోషల్ మీడియాలో జుమ్లా కింగ్ అంటూ ర్యాగింగ్ చేసి వదిలిపెట్టాయి. #jumlakingmodi సోషల్ మీడియాలో ఆదివారం ట్రెండింగ్ లో ఉన్న హ్యాష్ ట్యాగ్ […]
Author: Sarvi
నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏర్పడిన ప్రత్యేక తెలంగాణలో.. నీళ్లు లేవు, నిధులు లేవు, నియామకాలు కూడా లేవంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. విజయ సంకల్ప సభలో మాట్లాడిన ఆయన.. నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ ఆయన తెలుగు పదాలు మాట్లాడి అందర్నీ ఉత్తేజపరిచారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడి ఎనిమిదేళ్లవుతున్నా.. అభివృద్ధి శూన్యం అని విమర్శించారు. దేశం పురోగమిస్తుంటే.. తెలంగాణ తిరోగమనంలో ఉందన్నారు అమిత్ షా. కాంగ్రెస్ చేసిన తప్పు.. గతంలో […]
హైదరాబాద్ లోని కేపీహెచ్బీ (KPHB) కాలనీ రోడ్డు నంబర్ 1లో నివాసముండే నారాయణరెడ్డి అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఓ యువతిని ప్రేమించి ఏడాది క్రితం పెళ్ళి చేసుకున్నారు. ఆ పెళ్ళిని యువతి కుటుంబం వ్యతిరేకించింది. కొంత కాలం వారిద్దరూ కాపురం చేసిన తర్వాత యువతి కుటుంబ సభ్యులు యువతిని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్ళారు. అయితే ఆ తర్వాత కూడా ఆ యువతి నారాయణరెడ్డితో ఫోన్ లో మాట్లాడటం చూసిన కుటుంబం, బందువులు నారాయణ రెడ్డిని ఎలాగైనా […]
మద్యంతో వైసీపీ నేతలకు నెలకు వచ్చే ఆదాయం 250 కోట్ల రూపాయలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మద్య నిషేధం అని చెప్పిన వ్యక్తే నేడు మద్యం అమ్ముతున్నారని, ఈ మద్యం ద్వారానే వారు నెలకు వ్యక్తిగతంగా ఇన్ని కోట్లు సంపాదిస్తున్నారని ఆయన చెప్పారు. అడ్డగోలుగా లంచాలు తింటున్న వ్యక్తులే అవినీతి నిర్మూలనకు ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్లు పెట్టడం హాస్యాస్పదమని, అలాంటివారికి ఉద్యోగులను శిక్షించే అర్హత ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు. శనివారం మంగళగిరిలోని తమ […]
దేశ సరిహద్దు అనగానే ముళ్ల కంచెలు, భారీగా పహారా కాసే సైన్యం, ఇటు మనిషి అటు పోకుండా కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. ఇండియాకు ఆనుకొని ఉన్న పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా వద్ద ఇలాంటి సరిహద్దు దృశ్యాలే ఉంటాయి. కానీ ఇప్పుడు మీరు చూడబోయే సరిహద్దులు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఇవి పలు దేశాల మధ్య సరిహద్దులు అంటే మీరు నమ్మడం కూడా కష్టమే. అలాంటివి కొన్ని చూసేయండి. 1. పోలాండ్-ఉక్రెయిన్ సరిహద్దు యూరోప్ దేశాలైన పోలాండ్-ఉక్రెయిన్‌ల మధ్య 535 […]
ఏపీలోని గ్రామ, వార్డు వలంటీర్లకు ప్రభుత్వం ఇచ్చే గౌరవ వేతనం నెలకు 5వేల రూపాయలు. అది తమకు ఏమాత్రం సరిపోదని, దాన్ని పెంచాలంటూ గతంలో వలంటీర్లంతా రోడ్డెక్కారు, ఆందోళనకు సిద్ధపడ్డారు. కానీ ప్రభుత్వం మాత్రం వేతనం పెంచలేదు. వలంటీర్ పోస్ట్ అనేది ఉద్యోగం కాదని, కేవలం ప్రజలకు చేసే సేవ అని, అందుకు గౌరవ వేతనంగా 5వేల రూపాయలు ఇస్తున్నామని చెప్పింది. ఆ తర్వాత వలంటీర్లలో ఉన్న అసంతృప్తి చల్లార్చేందుకు వారికి ప్రతి ఏటా పురస్కారాలు అందిస్తున్నట్టు […]
హైదరాబాద్ లో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ప్రధాని మోదీ హాజరైన వేళ ‘మోదీ మస్ట్ ఆన్సర్’ అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండింగ్ లో నెంబర్ వన్ గా నిల్చింది. శనివారం నాడు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ వచ్చిన సందర్భంగా జరిగిన సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మోదీకి అనేక ప్రశ్నలు సంధించారు. వీటికి మోదీ సమాధానాలు చెప్పాలంటూ ఆయన డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ సంధించిన ప్రశ్నలకు […]
కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి ఖమ్మం జిల్లా ఒక కంచుకోట లాంటిది. కానీ, ఇప్పుడు మాత్రం ముఖ్య నాయకులంతా వేరే పార్టీల్లోకి వెళ్లిపోయారు. వైఎస్ఆర్ సీపీ ఏర్పడిన తర్వాత ఎక్కువ మంది కాంగ్రెస్ నేతలు ఆ పార్టీలో జాయిన్ అయ్యారు. కానీ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ బలంగా ఎదగడంతో.. వీళ్లంతా కారెక్కారు. అయితే రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ అయ్యాక.. మళ్లీ ఖమ్మంలో కాంగ్రెస్ తన ఉనికిని చాటుకుంటోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి బలమైన […]
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తుండటంతో వలసల హడావిడి మొదలైంది. గత మున్సిపల్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లోకి వచ్చిన చాలా మంది నాయకులు తిరిగి సొంత గూటికి చేరాలని భావిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డితో టచ్‌లో ఉన్న ఈ నాయకులు కారు దిగి.. గాంధీభవన్ బాట పట్టనున్నారు. ఆరుగురు కార్పొరేటర్లు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. బడంగ్‌పేట్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత టీఆర్ఎస్ పార్టీని వీడనున్నారు. భర్త నర్సింహారెడ్డితో కలసి ఆమె […]
మహిళలంటే తనకు అపారమైన గౌరవమని, మగవారిని మహిళలే ముందుండి నడిపించాలని అన్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. సైద్ధాంతిక బలం ఉన్న ఆడపడుచులను వెతికి, వెలికి తీయాలనే బలమైన సంకల్పంతో రాజకీయ శిక్షణ తరగతులను ప్రారంభించామని ఆయన చెప్పారు. శనివారం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన వీర మహిళల తొలి విడత రాజకీయ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. సమాజం బాగుపడాలంటే కచ్చితంగా మహిళలంతా చైతన్యవంతులు కావాలన్నారు. అప్పుడే మార్పు సాధ్యం.. ఇందుకోసమే ఈ […]