Author: Sarvi

హైదరాబాద్ లో రెండు రోజులపాటు పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, 12 మంది బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల బ్రీఫింగులు, అది చాలక ప్రధాని మోడీ బహిరంగ సభ కూడా జరిగిందంటే తెలంగాణ అభివృద్ధి గురించి ఈ పార్టీ నేతలు తెలుసుకోవాలని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ మేరకు ఆయన మోడీకి బహిరంగ లేఖ రాశారు. శరవేగంగా అభివృద్ధిలో దూసుకుపోతున్న హైదరాబాద్‌లో మీ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలను నిర్వహించాలని మీరు […]

Read More

ప్రధాని మోడీ మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో గడిపారు. శనివారం మధ్యాహ్నం హైదరాబాద్‌లో దిగిన మోడీ ఇవాళ భీమవరం సభ తర్వాత ఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యారు. తెలంగాణ పర్యటన పూర్తిగా భార‌తీయ జ‌న‌తా పార్టీ వ్యవహారం. ఇక, ఏపీలో చేసిన కొన్ని గంటల పర్యటన కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగం. అయినా సరే మోడీ పర్యటనపై రెండు రాష్ట్రాలు స్పందించిన తీరు ప్రజలు దగ్గర నుంచి గమనించారు. ఈ […]

Read More

తెలంగాణ ప్రభుత్వం వరసగా అనేక పోస్టులను భర్తీ చేస్తోంది. వరస నోటిఫికేషన్ల తో నిరుద్యోగుల్లో సంతోషం నెలకొంది. ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ 25న పోలీసు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. మొత్తంగా 554 ఎస్సై పోస్టులు, 15,644 కానిస్టేబుల్‌ పోస్టులను, 614 ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు సోమవారం పరీక్షల తేదీలను ప్రకటించింది. ఆగస్టు 7న ఎస్సై పోస్టులకు, ఆగస్టు […]

Read More

ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వాల సంద‌ర్భంగా భీమ‌వ‌రంలో నిర్వ‌హించిన అల్లూరి సీతారామ‌రాజు విగ్ర‌హావిష్క‌రణ స‌భ‌కు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ హాజ‌రు కాక‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది. గ‌త కొంత‌కాలంగా బీజేపీ ప‌ట్ల మారిన ఆయ‌న వైఖ‌రి కార‌ణంగానే మోడీ స‌భ‌కు హాజ‌రుకాలేదా..? లేదా బీజేపీతో దూరం జ‌ర‌గాల‌నే ఆలోచ‌న‌తోనా..? లేక మ‌రేవైనా ఇత‌ర కారణాలు ఉన్నాయా..? అనే విష‌యాల‌పై చ‌ర్చ జ‌రుగుతోంది. నిన్న‌టి వ‌ర‌కూ విజ‌య‌వాడ‌లోనే ఉన్న ప‌వ‌న్ నేడు హైద‌రాబాద్ వెళ్ళ‌డం వెన‌క ఆయ‌న ఆంత‌ర్యం ఏమిట‌నే […]

Read More

తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరును భాగ్యనగర్ గా మారుస్తామంటూ బీజేపీ నేత, జార్ఖండ్ మాజీ సీఎం రఘువర్ దాస్ చేసిన కామెంట్ పై మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. మొదటి మీరు అహ్మదాబాద్ పేరును ‘అదానీబాద్’ గా ఎందుకు మార్చరని ఆయన ప్రశ్నించారు. అసలింతకీ ఈ ‘జుమ్లా జీవి’ ఎవరని కూడా ఆయన ట్వీట్ చేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుల సమావేశాలకు, ప్రధాని మోడీ సభకు హాజరయ్యేందుకు హైదరాబాద్ వచ్చిన రఘువర్ దాస్.. […]

Read More

తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉన్న భారతీయ జనతా పార్టీ దాని కోసం అనేక ఎత్తుగడ‌లు వేస్తోంది. ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్ లో జరిపించడం ద్వారా పార్టీ బలపడొచ్చని ఆ పార్టీ ఎత్తు వేసింది. పైగా ఆ సమావేశాల సందర్భంగా ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా సహా ఆ పార్టీ అగ్రనేతలంతా హైదరాబాద్ వచ్చారు. ఆ సందర్భంగా ఇతర పార్టీల నుంచి నాయకులను పెద్ద ఎత్తున బీజేపీ లో […]

Read More

బీజేపీ కార్యవర్గ సమావేశాలకు ప్రధాని మోడీ సహా బీజేపీ అధినాయకత్వం అంతా హైదరాబాద్ వచ్చారు. రెండు రోజుల పాటు ఇక్కడే ఉన్న మోడీ.. ఆదివారం సాయంత్రం విజయ సంకల్ప సభలో పాల్గొని ప్రసంగించారు. అంతకు ముందే రాష్ట్రానికి వస్తున్న మోడీకి సీఎం కేసీఆర్ పలు ప్రశ్నలు సంధించారు. కానీ కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం ఊసే ఎత్తకుండా మోడీ ప్రసంగాన్ని ముగించారు. కార్యవర్గ సమావేశాల్లో కూడా తెలంగాణకు సంబంధించి ఎలాంటి ప్రణాళికను వెల్లడించలేదు. కాగా, దీనిపై మంత్రి హరీష్ […]

Read More

నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు గత కొన్ని రోజుల నుంచి మాటలతో హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వం తన‌ను ఇబ్బంది పెడుతోందని ఒకవైపు కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు.. మరోవైపు కోర్టులో పిటిషన్లతో బిజీగా గడిపారు. భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణకు ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్నారు. ఈరోజు (సోమవారం) జరుగనున్న ఈ కార్యక్రమానికి తాను హాజరవుతానని, ఏపీ పోలీసులు తనను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోర్టు మెట్లు ఎక్కారు. కోర్టు కూడా […]

Read More

అదేంటి.. కేసీఆర్ ని మోదీ విమర్శించకపోవడం వల్ల బీజేపీ శ్రేణులు నిరాశపడ్డాయంటే అందులో అర్థముంది, మధ్యలో కాంగ్రెస్ కి ఏమొచ్చింది అనుకుంటున్నారా..? ఇది నిజం, మోదీ ప్రసంగంలో టీఆర్ఎస్ ని, ముఖ్యంగా కేసీఆర్ ని పల్లెత్తు మాట అనకపోవడంతో కాంగ్రెస్ హర్ట్ అయింది. ఒకరకంగా కాంగ్రెస్ రెండు వ్యూహాలను ముందుగానే సిద్ధం చేసుకుంది. ఒకవేళ మోదీ విమర్శలు సంధిస్తే.. టీఆర్ఎస్ అవినీతి జాతీయ స్థాయిలో తెలిసిపోయింది, అందుకే ఈ విమర్శలంటూ కేసీఆర్ సర్కారుని ఇరుకునపెట్టేవారు కాంగ్రెస్ నేతలు. […]

Read More

తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని ఆకాంక్షించారు మోదీ. పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన విజయ సంకల్ప సభలో ఆయన బీజేపీ తెలంగాణకు చేసిన మేళ్లను ఏకరువు పెట్టారు. ఈరోజు ఏపీ మోదీ పర్యటన ఉంది. మరి ఏపీ పర్యటనలో ఆయన ఏం మాట్లాడతారు..? డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలని చెప్పగలరా..? ఏపీకి అది చేశాం, ఇది చేశాం అని సరిపెడతారా..? లేక ఇక్కడ కూడా స్థానిక ప్రభుత్వాన్ని కాదని, బీజేపీని ఎన్నుకోండని చెప్పగలరా..? మోదీ వ్యూహం […]

Read More