వచ్చే ఎన్నికల్లో నరసాపురం పార్లమెంటు సీటులో వైసీపీ తరఫున పోటీ చేయాలని మెగాస్టార్ చిరంజీవికి వైఎస్ జగన్ ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహావిష్కరణ సభలో పాల్గొనేందుకు ప్రధాని కార్యాలయం నుంచి చిరంజీవికి ఆహ్వానపత్రం అందింది. దీంతో మెగాస్టార్ మోదీతో పాటు ఈ సభకు హాజరయ్యారు. ఈ సభలోనే జగన్, చిరంజీవిలు ఆలింగనం చేసుకుని వారిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని ప్రజలంతా చూసేలా చేశారు. అంతకుముందు సినిమా టికెట్ రేట్లు పెంచుకునే విషయంలో […]
Author: Sarvi
ఢిల్లీ నుంచి దుబాయ్‌కి వెళ్తున్న స్పైస్ జెట్ విమానం పాకిస్తాన్‌లోని కరాచిలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. మంగళవారం ఢిల్లీ విమానాశ్రయం నుంచి దుబాయ్‌కి బయలు దేరిన విమానం, మరి కొంతమంది ప్యాసింజర్స్‌ను ఎక్కించుకోవడానికి ముంబై చేరుకున్నది. అనంతరం దుబాయ్ వెళ్లడానికి టేకాఫ్ తీసుకుంది. అయితే గాల్లోకి ఎగిరిన కొంతసేపటి తర్వాత ఇంధన వ్యవస్థలో సమస్య ఉన్నట్లు గుర్తించారు. దుబాయ్‌కి వెళ్తున్న బోయింగ్ 737-8 మ్యాక్స్ (వీటీ-ఎంఎక్స్‌జీ) రకం విమానాన్ని ఢిల్లీ – దుబాయ్ మధ్య ఎస్‌జీ-011 నెంబర్‌తో […]
ఏపీలోని విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చామని, పిల్లల చదువుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం వెనక్కు తగ్గదని సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. 2022-23 విద్యా సంవత్సరానికి గాను ఏపీలో పాఠశాలలు ఈరోజు (జూలై 5) నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయన జగనన్న విద్యా కానుక కిట్లను విద్యార్థులకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఆదోనిలో ప్రారంభించారు. వరుసగా మూడో ఏడాది కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూల్స్‌లో ఒకటి […]
భారత దేశంలో కరోనా వైరస్ కు చెందిన సరికొత్త వేరియంట్ ను నిపుణులు గుర్తించారు.ఇజ్రాయెల్, టెల్ హాషోమర్ షెబా మెడికల్ సెంటర్‌లోని సెంట్రల్ వైరాలజీ లాబొరేటరీకి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ షే ఫ్లీషాన్ ఈ విషయాన్ని వెల్లడించారు. భారత్ లోని తెలంగాణ రాష్ట్రం సహా పది రాష్ట్రాల్లో ఈ వేరియంట్ ను గుర్తించినట్టు షే ఫ్లీషాన్ చెప్పారు. దీనిని BA.2.75 సబ్ వేరియంట్ గా గుర్తించినట్టు ఆయన పేర్కొన్నారు. జులై రెండో తేదీ నాటికి భారత దేశంలో […]
ఏపీలో అధికార వైసీపీ పార్టీ జూలై 8,9 తేదీల్లో పార్టీ ప్లీనరీని నిర్వహించనున్నది. పార్టీ ఆవిర్భావం తర్వాత ప్లీనరీ నిర్వహించడం ఇది మూడో సారి మాత్రమే. 2011లో ఇడుపులపాయలో, 2017లో గుంటూరులో ప్లీనరీలు నిర్వహించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహిస్తున్న తొలి ప్లీనరీ కావడంతోభారీ ఏర్పాట్లు చేస్తున్నారు. జూలై 8న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ప్లీనరీ ప్రారంభం కానున్నది. మరో రెండేళ్లలోపు ఎన్నికలు కూడా ఉండటంతో కార్యకర్తలు, నాయకుల్లో ఉత్సాహం తీసుకొని రావడానికి ఈ ప్లీనరీ ఉపయోగపడుతుందని […]
ఎన్నికల రాజకీయాల్లో సినిమాల పాత్ర గణనీయమైనదే. ఎన్టీ రామారావు రాజకీయ రంగ ప్రవేశానికి మరింత స్ఫూర్తి కలిగించినవి అప్పట్లో ఆయన నటించిన సినిమాలే. ఆ ఉత్సాహంతోనే తెలుగుదేశం పార్టీ స్థాపించారు. సినిమా రంగానికి చెందిన వ్యక్తిగానే కాక ఆ పార్టీకి తెలుగు సినిమా రంగం ఆసరాగా ఉంటూనే ఉంది. చంద్రబాబు హయాంలో కూడా పార్టీకి సినిమా రంగం అండదండలు అందించింది. తెర వెనక ఆ పార్టీకి ప్రచార ప్రకటనలు రూపొందించడం, వీడియోలు తయారు చేయడం వంటవి జరిగేవి. […]
ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టుంది చంద్రబాబు, పవన్ కల్యాణ్ పరిస్థితి. ఏపీలో అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలకు ఒకరికి ఆహ్వానం లేదు, ఇంకొకరికి వెళ్లడానికి మొహం చెల్లలేదు. ఈ దశలో వీరిద్దర్నీ టార్గెట్ చేసి సెటైర్లు పేల్చారు మంత్రి రోజా. జయంతి ఉత్సవాల్లో ప్రధాని మోదీతో కలసి వేదికను పంచుకున్న ఆమె సెల్ఫీ దిగి సందడి చేశారు, ఆ తర్వాత బాబు, పవన్ కి చాకిరేవు పెట్టారు. విచిత్రం ఏంటంటే.. పవన్ కల్యాణ్ గత ఎన్నికల్లో […]
హైదరాబాద్‌లో జరిగిన ప్రధాని నరేంద్ర మోడీ సభలో నిరసన తెలుపుతున్న దళిత ఆందోళనకారులపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బీజేపీ కార్యకర్తలు ఆందోళనకారులను తరుముతూ వెంటపడి కొట్టడం కనిపించింది. రాష్ట్రంలో ఎస్సీలు, ఇతర వర్గాల చిరకాల డిమాండ్ అయిన షెడ్యూల్డ్ కులాల వర్గీకరణపై ప్రధాని మోడీ ఇచ్చిన హామీలను గుర్తుచేస్తూ ఎంఆర్పీఎస్ సభ్యులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ ప్రదర్శనపై కొందరు బీజేపీ కార్యకర్తలు విరుచుకుపడి ఆందోళనకారులపై […]
తెలుగుదేశం మొదటి నుంచి భారీగా నిధులు ఉన్న పార్టీ అని అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ తర్వాత ఆ పార్టీ పగ్గాలు చేపట్టిన చంద్రబాబు.. తమ వర్గపు పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, ఎన్ఆర్ఐల దగ్గర నుంచి భారీగానే నిధులు రాబట్టారు. ఇప్పటికీ తెలుగుదేశానికి నిధుల కొరత పెద్దగా లేదనే ఆ పార్టీ నేతలు చెప్తుంటారు. అయితే గత మూడేళ్లుగా పార్టీ అధికారంలో లేకపోవడం. పార్టీకి ఆసరాగా ఉండే చాలా మంది వ్యాపారవేత్తలు, ఎన్ఐఆర్‌లు కరోనా కారణంగా వెనకడుగు వేయడంతో కొంచెం […]
బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధానమంత్రి మోడీ ప్రసంగం ఉసూరుమనిపించిందనీ, కేసీఆర్ పేరేత్తనందుకు బీజేపీ శ్రేణులు నిరాశలో ఉన్నాయంటూ కథనాలు వస్తున్నాయి. ఇది పాక్షిక సత్యమే! వ్యూహాత్మకంగానే మోడీ అభివృద్ధి సబ్జెక్టును ఎంపిక చేసుకొని ఉంది ఉంటారు. ఒకసారి అమిత్ షా, నడ్డా, పీయూష్ గోయల్ ప్రసంగాలు వినండి. అందులో వాడి, వేడి పుష్కలంగా ఉంది. తెలంగాణలో పార్టీ జాతీయ సమావేశాలను నిర్వహించడం, భారీ బహిరంగసభ, కేసీఆర్ ను గద్దె దింపుతామంటూ పార్టీ నాయకుల ప్రతిజ్ఞలు.. అన్నీ […]