గాడిద కేమి తెలుసు… అటుకుల రుచి… అన్న సామెత వినే ఉంటారు. అవును. నిజమే… అటుకులు రుచే కాదు. పోషకాలకు పెట్టింది పేరు. అటుకులు వంటిట్లో ఉండే సాధారణ తినుబండారం. దీనిని మనం ఏ రకంగా తీసుకున్నా కూడా ఆరోగ్యమే… అటుకుల పాయసం, ఉప్మా, చుడ్వా, బర్ఫీ… ఎలా చేసుకున్నా కూడా వాటిలోని పోషక విలువలు తగ్గవంటున్నారు వైద్య నిపుణులు. అటుకులకు పోహా అని, ఫ్లాటర్డ్ రైస్ (flattered rice) అని కూడా పేర్లున్నాయి. అటుకుల్లో విటమిన్ […]
Author: Sarvi
తాటి ముంజలు… ఇవి పల్లెటూర్లలో మాత్రమే దొరుకుతాయని ఓ భ్రమ. కాని ఇప్పుడు పట్టణాలలో, చిన్న చిన్న బస్తీలలో కూడా దొరుకుతున్నాయి. వీటిని ఇంగ్లీషులో ఐస్ యాపిల్ (ice apple) అని పిలుస్తారు. అరటి చెట్టు, కొబ్బరి చెట్టు మానవ జీవితానికి ఎంత ఉపయోగమో తాటి చెట్టు కూడా అంతే ఉపయోగపడుతుంది. తాటి ఆకులు, తాటి మాను, తాటి కల్లు, తాటి వేళ్లు (తేగలు) ఇలా తాటి చెట్టులోని ప్రతి భాగం ఎంతో ఉపయోగం. వీటిని గురించి […]
వెల్లుల్లి ఆహారానికి రుచిని తీసుకు వస్తుంది. వెల్లుల్లి అందానికి మెరుగులు తెస్తుంది… వెల్లుల్లి యాంటిబయోటిక్ లాగా పని చేస్తుంది…. వెల్లుల్లి కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది…. వెల్లుల్లి ఆయువు పెంచుతుంది… చూసారా వెల్లుల్లి వల్ల ఎన్ని లాభాలో. చాలా మంది వెల్లుల్లి వెగటు వాసన వస్తుందని తినడానికి ఇష్టపడరు. ఉల్లి లాగే వెల్లుల్లి కూడా తల్లిలా మేలు చేస్తుంది. వెల్లుల్లి వల్ల ఉపయోగాలు…. ప్రయోజనాలు తెలుసుకుందాం… వెల్లుల్లిలో కాల్షియం, ఐయోడిన్, ఐరన్ వంటి ఖనిజాలు ఉన్నాయి. ఇవి అనేక […]
వంటిల్లు…. కాదు… కాదు… ఔషధశాల. వంట ఇంట్లో వాడే ప్రతి వస్తువు ఆరోగ్యానికి ఏదో రకంగా మేలు చేస్తుంది. పసుపు అయితే సర్వరోగాలను నివారిస్తుంది. చిటికెడు పసుపు అటు ఆరోగ్యం… ఇటు అందం కూడా. అలాంటి పసుపు వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం. పసుపులో సహజ సిద్ద గుణాలతో పాటు యాంటీబైటిక్ గుణాలు కూడా ఉన్నాయి. ఇవి అందానికే కాదు ఆరోగ్యానికి కూడా అద్బుతంగా పనిచేస్తాయి. పసుపు ఆహారంలో ఉన్న చెడు కొలేస్ట్రాల్ తో పాటు ఇతర […]
దీనిని సొరకాయ అని కూడా పిలుస్తారు. పొట్టిగా… గుండ్రంగా ఉండే దానిని ఆనపకాయ అని, సన్నగా… పొడుగ్గా ఉంటే సొరకాయ అని పిలుస్తారు. ఇందులో ఆనపకాయ ఆంధ్రప్రాంతంలో ఎక్కువగా దొరుకుతుంది. ఇక సొరకాయను తెలంగాణలో విరివిగా పండిస్తారు. ఈ రెండూ కూడా ఒకే రకమైన గుణాలను కలిగి ఉంటాయి. దీనిలో 90 శాతం నీరు ఉండడం వల్ల తొందరగా జీర్ణం అవుతుంది. ఇందులో అధిక శాతంలో ఫైబర్… బిపీ, షుగర్ లను కంట్రోల్ చేస్తుంది. శరీరంలో ఉన్న […]
పాలకూరను పాలక్ అని, స్పినాచ్ అని పిలుస్తారు. దీనిని ఎలా వండుకుని తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. నిరంతరం ఫిట్ గా ఉండాలనుకునే వారికి పాలకూర దివ్యౌషధం… పాలకూరలో దాగి ఉన్న విటమిన్లు, ప్రోటీన్లు మానవ శరీరానికి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం. పాలకూరలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని, రక్తంలో ఉన్న హెమోగ్లోబిన్ ని పెంచుతుంది. పాలకూరలో క్యాలరీలు చాలా తక్కువ మోతాదులో ఉంటాయి. దీంతో పాలకూరను ఎంత తిన్నా […]
సగ్గుబియ్యం. పాయసం గుర్తుకొస్తోంది కదూ…! పండగ పూట నోరూరుతోంది కదా… సగ్గుబియ్యం రుచికే కాదు…. ఆరోగ్యానికి కూడా ఆయువుపట్టు వంటిది. ఇంతకీ ఈ సగ్గుబియ్యం ఎలా తయారవుతాయి… ఎక్కడ నుంచి వస్తాయి… వాటి వల్ల లాభాలు ఏంటీ అన్నది చాలా మందికి తెలియదు. ఇవి కూడా వరి, గోధుమ లాగే సాగు చేస్తారని అనుకుంటారు. కాని ఇది పరిశ్రమలోనే తయారవుతుందని చాలా మందికి తెలియదు. దీని తయారికి కర్ర పెండలమే (tapioca) ముడిసరుకు. సుమారు 500 కిలోల […]
హలో.. శుభోదయం.. వేసవి కదా.. ఈ సీజన్ లో నేను బాగా దొరుకుతాను. నేను పెరగడానికి కనీసం 80 రోజుల సమయం పడుతుంది. నన్ను తర్బూజా అని, పుచ్చకాయ అని… ఇంగ్లీషులో వాటర్ మిలన్ అని పిలుస్తారు. నా గురించి మీకు పూర్తిగా తెలియకపోవచ్చు. చాలా మంది నా గుజ్జును పంచదారతో కలిపి తినటానికి ఇష్టపడతారు. నన్ను జ్యూస్ చేసుకుని తాగుతారు అనుకోండి. అన్నట్లు నా కడుపులో ఉండే విత్తనాలను ఏం చేస్తున్నారు. కొంపతీసి పారేస్తురా..!. ఆ […]
కొద్దిపాటి శ్రద్ద… ఇంకొంచెం అవగాహన… ఒకింత ఓపిక ఉంటే చాలు… అందానికి అందం, ఆరోగ్యానికి ఆరోగ్యం మన సొంతం కాకపోతుందా..? ఒకే ఫలంలో రెండు గుణాలున్న ఫలమే కమలా పండు. ఇది సిట్రిక్ జాతికి చెందిన పండు. దీన్ని చూడగానే నోరూరుతుంది. కమలాలను తిన్నా, జ్యూస్ తాగినా…. వాటి తొక్కలను సున్నిపిండిలా నలుగు పెట్టుకున్నా ఎంతో ఆరోగ్యం. కమలాపండులో పోషకాలే కాదు…. ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. దీనిలో ఉన్న విటమిన్ ‘సి’ రోగనిరోధక శక్తిని […]
ఉసిరి…. దీనినే ఆమ్లా అని కూడా అంటారు. ఉసిరి ఆరోగ్యాల సిరి. రుచిలో ఇది పుల్లగా, వగరుగా ఉంటుంది. ఉసిరి బెరడు, కాయ, పండు, ఉసిరి కాయ రసం ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా ఇస్తాయి. ఉసిరి ఆకు లేదా బెరడు నుంచి తీసిన కషాయం త్రిదోషాల నుంచి ఉపశమనం ఇస్తుంది. ఉసిరి ఉపయోగాలు తెలుసుకుందాం. ఉసిరి ఆకు రసం ఉగాది పచ్చడిలా అన్ని రుచులతో మేళవించి ఉంటుంది. అంటే కొద్దిగా పుల్లగా, చేదుగా, వగరుగా, కారంగా ఉంటుంది. […]