తెలంగాణలో ఇంటర్నల్ పాలిటిక్స్ వేడెక్కాయి. బీజేపీ సభలతో హడావుడి పెంచితే..కాంగ్రెస్ కండువాల మార్పిడితో దూకుడుగా వెళుతోంది. కండువాల మార్పిడిలో కమలం వెనుకపడింది. దీంతో ఇప్పుడు ఆ పార్టీ చేరికలపై ఫోకస్ పెట్టింది. తెలంగాణలో కమలం నేతల హడావుడి పెరిగింది. కానీ ఆ పార్టీ వైపు చూసే నేతలు కనపడడం లేదు. ఈటల రాజేందర్ తర్వాత టీఆర్‌ఎస్ నుంచి భారీగా వలసలు ఉంటాయని అంతా అనుకున్నారు. కానీ నాంపల్లి బీజేపీ ఆఫీస్ వైపు ఎవరూ అడుగులు వేయలేదు. జిట్టా […]
Author: Sarvi
ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించారు. తెలంగాణలో బీజేపీ నేతలంతా టీఆర్ఎస్ పై విమర్శల దాడి చేస్తే, మోదీ మాత్రం ఆ జోలికి పోలేదు. దీంతో కాంగ్రెస్ కి కోపమొచ్చింది. టీఆర్ఎస్ పై మోదీ ప్రేమ చాటుకున్నారని, మోదీ-కేసీఆర్ మధ్య స్నేహానికి ఇదే నిదర్శనం అని కొత్త లాజిక్ తీశారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. ఇక ఏపీ విషయానికొద్దాం.. ఏపీలో కూడా మోదీ ఎక్కడా రాజకీయ వ్యాఖ్యలు చేయలేదు. దీంతో ఇక్కడ ప్రతిపక్ష పార్టీ […]
తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చొరవ, అధికారుల కఠిన నిర్ణయాలు.. వెరసి తెలంగాణలో ప్రభుత్వ ఇంటర్మీడియట్ కాలేజీల సంఖ్య ప్రైవేటు కాలేజీలను దాటేసింది. ఊరికో ప్రైవేటు కాలేజీ కొత్తగా పుట్టుకొస్తున్న ఈరోజుల్లో తెలంగాణలో మాత్రం ఆ పరిస్థితి మారిపోయింది. ఏడాది కేడాది ప్రైవేటు కాలేజీల సంఖ్య తగ్గిపోతుండగా.. ప్రభుత్వ కాలేజీల సంఖ్య పెరిగింది. ఈ ఏడాదికి తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేటు కాలేజీల సంఖ్య 1516 కాగా, ప్రభుత్వ జూనియర్ కాలేజీల సంఖ్య 1560కి చేరింది. విద్యా వ్యవస్థలో టీఆర్ఎస్ […]
ప్లీనరీ సమావేశాలు అంటే కేవలం పార్టీ నాయకులు మాత్రమే ఉంటారనుకుంటున్నారో, లేక ఈలలు, చప్పట్లతో కాస్త ఉత్సాహం ఎక్కువై మనసులో మాట బయటపెడుతున్నారో తెలియదు కానీ.. ఇటీవల కాలంలో గ్రామ, వార్డు వలంటీర్లపై మంత్రులు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. తాజాగా కాకినాడలో జరిగిన ప్లీనరీ సమావేశంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. వలంటీర్లు కొంతమంది తమ మాట వినడంలేదంటూ వైసీపీ కార్యకర్తలు, నాయకులు చేసిన […]
కేసీఆర్ జీవితం తెరిచిన పుస్తకం. కానీ ఆయనలోని మరిన్ని కోణాలను తన పుస్తకంలో ఆవిష్కరించానని చెబుతున్నారు రచయిత మనోహర్ చిమ్మని. ‘కేసీఆర్ – ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్’ పేరిట ఆయన రాసిన పుస్తకాన్ని మంత్రి కేటీఆర్ ప్రగతి భవన్ లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ రంజిత్ రెడ్డి, స్వర్ణసుధ పబ్లికేషన్స్ అధినేత పరమేశ్వర్ రెడ్డి, తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొణతం పాల్గొన్నారు. ట్విట్టర్లో రివ్యూ రాస్తా.. మనోహర్ […]
పెగాసస్ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. అప్పట్లో ఏపీ ప్రభుత్వం.. పెగాసస్ స్పైవేర్ ను కొనుగోలు చేసి ప్రత్యర్థులపై నిఘా పెట్టిందని ఆరోపణలు వచ్చాయి. ఇందుకు కొందరు అధికారులు సహకరించినట్టు కూడా వైసీపీ ఆరోపించింది. ఈ వ్యవహారంలో అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరావు హస్తం ఉందని వైసీపీ ఆరోపించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం ఈ వ్యవహారంపై నిగ్గు తేల్చేందుకు తిరుపతి ఎమ్మెల్యే […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ విద్యావ్యవస్థలో పెను మార్పులు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ‘నాడు -నేడు’ కార్యక్రమంతో పాఠశాలల రూపురేఖలు మార్చారు. అంతేకాక ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోకుండా ఇంగ్లిష్ మాధ్యమాన్ని తీసుకొచ్చారు. దీంతో సామాన్య ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు విద్యార్థుల కోసం అమ్మఒడి, జగనన్న విద్యాదీవెన, గోరుముద్ద లాంటి అనేక పథకాలు అమలు చేస్తున్నారు. సీఎం జగన్ నిర్ణయంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి. కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ విద్య అందుతుండటంతో అంతా సంతోషిస్తున్నారు. […]
నిన్న భీమవరంలో జరిగిన మీటింగ్ అనేక రాజకీయ చర్చలకు దారితీసింది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే వివిధ కారణాల వల్ల స్థానిక ఎంపీ రఘురామ కృష్ణ రాజు హాజరుకాలేదు. దీంతో ఆయన మీడియాలో తెగ గగ్గోలు పెట్టారు. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ కనిపించకపోగా.. ఆయన సోదరుడు, ప్రముఖ నటుడు చిరంజీవి వేదిక మీద దర్శనమిచ్చారు. దీంతో రకరకాల ఊహాగానాలు తెరమీదకు వచ్చాయి. జనసేన, బీజేపీ […]
వైసీపీ రాష్ట్రస్థాయి ప్లీనరీకోసం ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్న వేళ.. రాజోలు నియోజకవర్గంలో రాజీనామాలు మళ్లీ జోరందుకున్నాయి. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున రాజోలు నియోజకవర్గంలో పోటీ చేసిన బొంతు రాజేశ్వరరావు రాష్ట్ర సలహాదారు పదవికి రాజీనామా చేశారు. త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారాయన. అయితే ఆయన పార్టీకి రాజీనామా చేయకపోవడం విశేషం. కేవలం రాష్ట్ర సలహాదారు పదవికి మాత్రమే బొంతు రాజేశ్వరరావు రాజీనామా చేశారు. ఆ పదవితో తాను కార్యకర్తలకు ఉపయోగపడలేకపోతున్నానని చెప్పారు. ఇప్పటి […]
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలగా ఉన్న భారతీయ జనతా పార్టీ రోజుకో ఎత్తుగడ వేస్తోంది. ఆ పార్టీకి బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడయ్యాక మతపరమైన విషయాలపైనే కేంద్రీకరిస్తూ రాష్ట్రంలో మతపరమైన చీలికను తీసుకొచ్చి ఎన్నికల్లో లాభపడాలని సీరియస్ గానే ప్రయత్నిస్తోంది. నిన్న గాక మొన్న ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలను ఏర్పాటు చేసి అగ్రనేతలంతా హైదరాబాద్ లో వాలిపోయారు. కొందరు నాయకులు జిల్లాలు కూడా పర్యటించారు. వాళ్ళు ఊహించినంత జనసమీకరణ […]