Author: Sarvi

మన భూభాగంలో చైనా ఓ నూతన వంతెన నిర్మిస్తోందా ? కొంత కాలం క్రితం ఓ వంతెన నిర్మించిన చైనా మళ్ళీ మరో వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టిందా ? అవుననే అంటున్నాయి అధికార వర్గాలు. తూర్పు లడఖ్‌లోని పాంగోంగ్ త్సో మీదుగా చైనా రెండవ వంతెన నిర్మిస్తోందనే వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై స్పంధించిన విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి… భారతదేశ భద్రతపై ప్రభావం చూపే అన్ని పరిణామాలపై నిరంతరం నిఘా ఉంచుతున్నామని, […]

Read More

ఉదయం తీసుకునే ఆహారమే రోజు మొత్తంలో ముఖ్యమైన ఆహారం. బరువు తగ్గాలన్నా, మెటబాలిజం పెరగాలన్నా.. బ్రేక్‌ఫాస్ట్ సరిగ్గా తీసుకోవడం చాలా అవసరం. కానీ చాలామంది బ్రేక్‌ఫాస్ట్ విషయంలో కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారు. ఎంతో ముఖ్యమైన బ్రేక్‌ఫాస్ట్ విషయంలోనే చాలామంది మిస్టేక్స్ చేస్తుంటారు. బ్రేక్‌ఫాస్ట్ టైంలో శక్తినివ్వని జంక్ ఫుడ్స్ తింటుంటారు. బ్రేక్‌ఫాస్ట్ అంటే లైట్‌గా ఉండాలని తక్కువ మొత్తంలో తింటుంటారు.

Read More

నిజామాబాద్ ముద్దు బిడ్డ, తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ చరిత్ర సృష్టించింది. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో 52 కేజీల విభాగంలో స్వర్ణ పతకం గెలిచింది. ఇస్తాంబుల్‌ లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌ షిప్‌ లో నిఖత్‌ జరీన్‌ ఫైనల్స్ ఎంపిక కావడమే ఓ చరిత్ర అనుకుంటే.. ఏకంగా స్వర్ణం కైవసం చేసుకుని ఆనందాన్ని రెట్టింపు చేసింది. 52 కిలోల విభాగంలో ఫైనల్‌ లో జిట్‌ పాంగ్ (థాయ్‌ లాండ్‌)పై 5-0 తేడాతో అద్భుత […]

Read More

నిన్నటి వరకూ రాయలసీమ రౌడీయిజం, పులివెందుల పంచాయితీ అంటూ మాట్లాడిన చంద్రబాబు.. ఏ మొహం పెట్టుకుని సీమలో అడుగుపెట్టారో చెప్పాలంటూ నిలదీశారు వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి. చిత్తూరు జిల్లాలో పుట్టిన చంద్రబాబు రాయలసీమపై విషం చిమ్మే ప్రయత్నాలు చేశారని, తాను కూడా సీమవాసిననే విషయం మరచిపోయారని చెప్పారు. రాయలసీమంటే ఎందుకంత ద్వేషం, కించపరిచేలా, అవమానపరిచేలా ఎందుకు మాట్లాడతారని ప్రశ్నించారు. రాజ్యసభ సీట్లపై రాద్ధాంతం ఎందుకు..? ఏపీలో బీసీలు లేరా, కృష్ణయ్యకు ఎందుకు సీటిస్తున్నారంటూ ఇటీవల […]

Read More

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన మోటర్ వాహనాల చట్టం-2019ని నిరసిస్తూ.. ఆటో, క్యాబ్, లారీ డ్రైవర్స్ యూనియన్ ఒకరోజు బంద్ చేపట్టింది. అర్థరాత్రినుంచి బంద్ మొదలు కాగా.. ఇప్పటికే ప్రయాణికులకు అవస్థలు మొదలయ్యాయి. ప్రైవేటు వాహనాలు లేక ప్రయాణికులు గమ్యస్థానాలు చేరేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉన్నా.. రద్దీ పెరిగిపోవడంతో ప్రజలకు కష్టాలు తప్పడంలేదు. డ్రైవర్స్‌ జేఏసీ చేపట్టిన బంద్‌ అర్ధరాత్రి నుంచి మొదలైంది. ఆటోలు, క్యాబ్‌లు, లారీల సేవలు పూర్తిగా […]

Read More

ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్లు మానవ హక్కుల కమిషన్ ను రద్దు చేశారు. కరుడు గట్టిన మత మౌడ్యులైన తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ లో అధికారం చెజిక్కించునప్పటి నుండి ఎన్నికల సంఘం, మహిళా వ్యవహారాల మంత్రిత్వ శాఖతో సహా ఆఫ్ఘన్‌ల స్వేచ్ఛను రక్షించే అనేక సంస్థలను మూసివేశారు. “మానవ హక్కులకు సంబంధించిన కార్యకలాపాలను నిర్వహించడానికి మాకు న్యాయవ్యవస్థతో ముడిపడి ఉన్న కొన్ని ఇతర సంస్థలు ఉన్నాయి, ” అని డిప్యూటీ ప్రభుత్వ ప్రతినిధి ఇనాముల్లా సమంగాని మీడియాతో చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్ […]

Read More

30 ఏళ్ళుగా రష్యాలో వ్యాపారం చేస్తున్న మెక్‌డొనాల్డ్స్ ఆ దేశం నుండి నిష్క్రమించాలని నిర్ణయించింది. రష్యా, ఉక్రెయిన్ యుద్దం కారణంగా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. ఆ సంస్థ అత్యంత పేరెన్నికల గల పుష్కిన్ స్క్వేర్ రెస్టారెంట్ తో సహా దేశంలోని మొత్తం 850 రెస్టారెంట్లను మూసివేయాలని నిర్ణయించుకుంది. అమెరికన్ పెట్టుబడిదారీ విధానానికి చిహ్నమైన మెక్ డోనాల్డ్స్ 1990లో రష్యాలో తమ స్టోర్లను ప్రారంభించడం అప్పట్లో సంచలనమే. తమ మొదటి స్టోర్ ప్రారంభానికి […]

Read More

ఫ్రాన్స్ కొత్త ప్రధానమంత్రిగా ఎలిసబెత్ బోర్న్ ఎంపికయ్యారు, 30 ఏళ్లలో ఒక మహిళ ఈ పదవిని చేపట్టడం ఇదే తొలిసారి. ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్.. తన ప్రతిష్టాత్మక సంస్కరణ ప్రణాళికలకు నాయకత్వం వహించడానికి లేబర్ మంత్రి ఎలిసబెత్ బోర్న్‌ను ప్రధానమంత్రిగా నియమించారు. మే 1991 మరియు ఏప్రిల్ 1992 మధ్య పనిచేసిన ఎడిత్ క్రెస్సన్ దేశంలో మొదటి మహిళా ప్రధాని కాగా బోర్న్ రెండవ వారు. ఫ్రెంచ్ ప్రధాన మంత్రి జీన్ కాస్టెక్స్ తన పదవికి రాజీనామా చేయగా […]

Read More

తెలంగాణ ఆవిర్భవించి ఎనిమిదేళ్లవుతున్నా.. బీజేపీకి రాష్ట్రంపై కక్ష, వివక్ష అలాగే ఉందని అన్నారు మంత్రి కేటీఆర్. ప్రతీసారి నేతలు వచ్చి స్పీచులు దంచి.. విషం చిమ్మి పత్తా లేకుండా పోవటం అలవాటుగా మార్చుకున్నారని మండిపడ్డారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన నేపథ్యంలో ఆయనకు బహిరంగ లేఖ రాశారు కేటీఆర్. కేంద్రం కడుపు నింపుతున్న తెలంగాణ కడుపు కొట్టడం మంచిది కాదని హితవు పలికారు. తెలంగాణపై అమిత్ షా కి చిత్తశుద్ధి ఉంటే తన […]

Read More

ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ ట్విట్టర్ డీల్ ను తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్టు ప్రకటించారు. 44 బిలియన్ డాలర్ల(3.3 లక్షల కోట్ల రూపాయల‌ పైగా)) ఒప్పందాన్ని నిలుపుదల చేస్తున్నట్టు ట్వీట్ చేశారు. ట్విటర్ యూజర్లలో ఉన్న స్పామ్ లేదా ఫేక్ అకౌంట్లకు సంబంధించిన లెక్కలు అందాల్సి ఉందని, ఆ లెక్కలు తేలేదాకా ఈ ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్టు ఆయన తెలిపారు. డైలీ యాక్టివ్ యూజర్లలో స్పామ్ లేదా నకిలీ వినియోగదారులు 5 శాతం వరకు ఉండొచ్చని ట్విట్టర్ అంచనా […]

Read More