Author: Sarvi

నాడు కడప లోక్ సభ ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై పోటీ చేసిన కొండయ్య అనే వ్యక్తి ఇప్పుడు ఆత్మకూరు ఉప ఎన్నికల్లో మేకపాటి విక్రమ్ రెడ్డికి పోటీగా బరిలో దిగబోతున్నారు. నామినేషన్లకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఆయన పేరు రావులకొల్లు కొండయ్య. ఎప్పుడు ఎక్కడ ఎన్నికలు జరుగుతున్నా వెంటనే వెళ్లి నామినేషన్ వేయడం, పోటీ చేయడం ఆయనకు అలవాటు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో కుండలు చేయడం ఆయన వృత్తి.. ఎక్కడ ఎన్నికలు వచ్చినా వెంటనే వెళ్లి […]

Read More

కరోనా కాలంలో ప్రారంభమైన వర్క్ ఫ్రమ్ హోమ్, లెర్న్ ఫ్రమ్ హోమ్ లు తెలంగాణలో ల్యాప్‌టాప్‌ల వినియోగాన్ని పెంచింది. Amazon.in ఇటీవల విడుదల చేసిన‌ నివేదిక ప్రకారం, ల్యాప్‌టాప్‌ల డిమాండ్ విషయానికి వస్తే రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. ల్యాప్టాప్ ల‌ కొనుగోళ్ళ విషయంలో నగ‌రాల్లో హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, నల్గొండ, కరీంనగర్ అగ్రస్థానంలో ఉన్నాయని నివేదిక పేర్కొంది. వీటితో పాటు చిన్న పట్టణాలైన మెదక్, సిద్దిపేట, జనగాం, మహబూబ్‌నగర్, కోదాడ్ లాంటి చోట్ల కూడా ల్యాప్ […]

Read More

ఫోన్ పే, గూగుల్ పే.. అన్ని చోట్లా డిజిటల్ చెల్లింపులదే హవా. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్.. అన్ని అవసరాలకూ ప్లాస్టిక్ కార్డులే దిక్కు. ఆటోవాలాలు కూడా చిల్లర లేదు, ఫోన్ పే చేయండి అని అడిగేస్తున్నారు. క్యాబ్ బుక్ చేసుకున్నా డిజిటల్ మనీతో అన్నీ సర్దుబాటు అయిపోతాయి. అయితే ఆర్టీసీ టికెట్ల వ్యవహారంలో మాత్రం ఇంకా ఈ పద్ధతి అమలులోకి రాలేదు. తాజాగా ఏపీఎస్ఆర్టీసీ ఈ నూతన విధానానికి శ్రీకారం చుడుతోంది. బస్సుల్లో టికెట్ ఇష్యూయింగ్ […]

Read More

అసైన్డ్ భూములకూ పరిహారం చెల్లించాల్సిందేనని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. ప్రజోపయోగం కోసం వెనక్కు తీసుకున్న అసైన్డ్ భూములకు.. పట్టా భూములతో సమానంగా పరిహారం చెల్లించాల్సిందేనని తీర్పు తెచ్చింది. 2013 భూసేకరణ చట్టం కిందనైనా, రాష్ట్రంలో ఉన్న ఇతర చట్టాల కిందనైనా అసైన్డ్ భూములకు పరిహారం పొందేందుకు అర్హత ఉంటుందని హైకోర్టు వెల్లడించింది. ఇండస్ట్రియల్ పార్క్ కోసం అధికారులు వెనక్కు తీసుకున్న తమ అసైన్డ్ భూములకు ఎలాంటి పరిహారం ఇవ్వలేదని, తమకూ పట్టా భూములతో సమానంగా పరిహారం […]

Read More

సినీనటి, మాజీ ఎంపీ జయప్రద సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లోకి రావాలని ఆసక్తిగా ఉందని పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్ లో నిర్వహించిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న జయప్రద ఈ మేరకు వ్యాఖ్యానించారు. సినిమాల్లో అందాల తారగా, గొప్ప నటిగా ఓ వెలుగు వెలిగిన జయప్రద ఎన్టీఆర్ ప్రోద్బలంతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత చంద్రబాబు హయాంలోనూ టీడీపీలో కొనసాగారు. రాజ్యసభ సభ్యురాలయ్యారు. అయితే ఆ తర్వాత ఆమె ఉత్తరప్రదేశ్ రాష్ట్ర […]

Read More

రెడ్ల సింహగర్జన పేరిట మేడ్చల్ లో జరిగిన సభలో మంత్రి మల్లారెడ్డిపై దాడి జరిగిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పనుల గురించి మంత్రి మాట్లాడుతుండగా.. జనంలో ఉన్న కొందరు మల్లారెడ్డిపై తిరగబడ్డారు. ఆయన వేదిక నుంచి దిగాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆయన కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. కుర్చీలు విసిరేశారు. అయితే ఇదంతా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కుట్ర అని మల్లారెడ్డి ఆరోపించారు. ఆయన మనుషులే తనపై దాడి చేశారని […]

Read More

ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ సాఫ్ట్‌వేర్ జాబ్‌కు ఉన్న క్రేజే వేరు. తెలంగాణ, ఏపీకి చెందిన ఇంజినీర్లే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కూడా హైదరాబాద్ చేరుకొని ఇక్కడ శిక్షణ పొంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తుంటారు. అలాంటి కొంత మంది నిరుద్యోగులను ఉద్యోగాల పేరిట మోసం చేసిందో సాఫ్ట్‌వేర్ కంపెనీ. ఉద్యోగాలు ఇస్తామంటూ చెప్పి దాదాపు రూ. 20 కోట్ల వరకు వసూలు చేసిన తర్వాత బోర్డు తిప్పేసింది ఒక సంస్థ. హైదరాబాద్‌లోని మాదాపూర్‌కు చెందిన […]

Read More

పెద్దల సభగా చెప్పుకునే శాసనమండలి సభ్యులు కూడా చాలా వైలెంట్‌గానే రియాక్ట్‌ అవుతున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌.. టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంకుశం సినిమాలో విలన్‌ని రోడ్డు మీద కొట్టినట్టు.. తాను కూడా అచ్చెన్నాయుడిని రోడ్డుపై ఈడ్చిఈడ్చి కొడతానంటూ ప్రకటించారు. అచ్చెన్నాయుడి రాజకీయ పతనమే తన జీవిత ఆశయమని ఎమ్మెల్సీ ప్రకటించారు. జగన్‌ కోసం తాను ఆత్మాహుతిదళంగా మారేందుకు సిద్ధమని ప్రకటించారు. తనకు ప్రాణం మీద భయం లేదని, జీవితం […]

Read More

కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తమ ఫోకస్ దక్షిణాది రాష్ట్రాలపై పెట్టింది. ఇప్పటికే కర్ణాటకలో అధికారంలో ఉన్న ఆ పార్టీ.. తాజాగా తెలంగాణపై దృష్టి పెట్టింది. రాబోయే రోజుల్లో తెలంగాణలో విస్తృతంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తుంది. ఇటీవల వరుసగా ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణలో పర్యటనలు నిర్వహించారు. ఈ మధ్య కాలంలో ఏ రాష్ట్రంపై పెట్టనంత ఫోకస్ తెలంగాణపై బీజేపీ […]

Read More

విజయవాడలో చిరువ్యాపారం చేసుకుంటున్న శ్రీకాంత్ రెడ్డి అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు ఒక సెల్ఫీ వీడియోను విడుదల చేశాడు. గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన శ్రీకాంత్ రెడ్డి విజయవాడలో ఉంటుండగా కొన్ని నెలల క్రితం ఒక యువతితో పరిచయం ఏర్పడింది. సదరు యువతి మసాజ్ సెంటర్‌లో పనిచేస్తోంది. ఆ పరిచయం కాస్త శారీరక సంబంధం వరకు వెళ్లింది. పలుమార్లు సెంటర్‌కు తీసుకెళ్లి శ్రీకాంత్ రెడ్డికి సదరు యువతి మసాజ్ చేసేది. శ్రీకాంత్ రెడ్డి తనతో […]

Read More