ఈ రోజు తెల్లవారు జామున జరిగిన ఓ బస్సు ప్రమాదంలో ఎనిమిది మంది హైదరాబాద్ వాసులు సజీవ దహనం అయ్యారు. గోవా నుంచి హైదరాబాద్ వస్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ కు చెందిన స్లీపర్ బస్సు కర్నాటకలోని కలబురగి జిల్లా కమలాపురా పట్టణం శివార్లలో ఓ జీబును ఢీకొట్టి పక్కనున్న గుంతలో పడింది. దాంతో బస్సులో మంటలు చెలరేగాయి. ఆ బస్సులో 35 మంది ప్రయాణీకులు ఉండగా వారిలో 28 మంది ఒకే కుటుంబానికి చెందినవారుగా తెలుస్తోంది. కొంత మంది […]
Author: Sarvi
ఆన్‌లైన్‌లో వస్తువుల కొనుగోలు, డెలివరీ ఇప్పుడు సర్వసాధారణమైంది. ఫుడ్, గ్రోసరీ, ల్యాబ్ టెస్టులు వంటివి ఇంటికే వచ్చేస్తున్నాయి. ఆన్‌లైన్ డెలివరీ కంపెనీలు పెరిగిపోవడంతో చాలా కంపెనీలు ఫాస్టెస్ట్ డెలివరీ అంటూ ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ కంపెనీ ఒకటి 10 నిమిషాల్లో మద్యం ఇంటికి డెలివరీ చేస్తామని చెప్తోంది. ఆగండాగండి… అయితే ఈ సంస్థ సేవలు హైదరాబాద్‌లో మాత్రం కాదు. మద్యం డెలివరీకి బెంగాల్ ప్రభుత్వం అనుమతులు ఇస్తుండటంతో కోల్‌కతాలో తమ సేవలు […]
రాష్ట్రాలతో విదేశీ బొగ్గును కొనుగోలు చేయించేందుకు కేంద్రం అన్ని మార్గాల్లోనూ ఒత్తిడి తెస్తోంది. బెదిరింపుకు, హెచ్చరికలకు దిగుతోంది. విద్యుత్ ఉత్పత్తికి వాడుతున్న బొగ్గులో.. 10 శాతం మేర తప్పనిసరిగా విదేశీ బొగ్గును దిగుమతి చేసుకోవాలని కొద్దికాలంగా కేంద్రం ఒత్తిడి తెస్తోంది. తొలుత మే 31లోగా విదేశీ బొగ్గు దిగుమతులకు ఒప్పందాలు చేసుకోవాలని.. అలా చేయని పక్షంలో రాబోయే కాలంలో విదేశీ బొగ్గును మరింత ఎక్కువగా దిగుమతి చేసుకునేలా ఆంక్షలు విధిస్తామని హెచ్చరించింది. తాజాగా మరోసారి హెచ్చరికలు జారీ […]
ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అమ్మఒడి, వాహన మిత్ర పథకాలను ఆర్థిక ఇబ్బందుల కారణంగా రద్దు చేశారంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా వార్తలు వచ్చాయి. గత నెలలో ఇలాంటి ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో వ్యాపించడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. దీనిపై మే 30న సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. కాగా, ఇలా పోస్టు పెట్టిన వ్యక్తి అప్పిని వెంకటేశ్‌గా గుర్తించారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడి ముఖ్య అనుచరుడిగా ఉండటమే కాకుండా, టెక్కలి […]
ఆంధ్రప్రదేశ్ థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు బొగ్గు సరఫరా చేసే కాంట్రాక్టును అదానీ, చెట్టినాడు సంస్థలు దక్కించుకున్నాయి. ఒప్పందం ప్రకారం అదానీ సంస్థ 18 లక్షల టన్నులు, చెట్టినాడు సంస్థ 13 లక్షల టన్నుల బొగ్గును సరఫరా చేస్తాయి. టెండర్లలో ఈ రెండు సంస్థలు మాత్రమే బిడ్ దాఖలు చేశాయి. అదానీ సంస్థ సరఫరా చేసే బొగ్గును టన్నుకు రూ. 24,500, చెట్టినాడు సరఫరా చేసే బొగ్గుకు 19,500 రూపాయలను చెల్లించి ఏపీ జెన్‌కో కొనుగోలు చేస్తుంది. ఏడాదిలో […]
తెలంగాణ బీజేపీ నేత ఎ. చంద్రశేఖర్ సీఎం కేసీఆర్‌పై కొన్ని ఆరోపణలు చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన.. చంద్రబాబును సీఎం పదవి నుంచి దించేందుకు కేసీఆర్ 2001కి ముందు కుట్ర చేశారని ఆరోపించారు. 1999 ఎన్నికల తర్వాత కేసీఆర్‌కు మంత్రి పదవి రాలేదని.. దాంతో ఎమ్మెల్యేల్లో చీలిక తెచ్చేందుకు ప్రయత్నించారని చెప్పారు. చిత్తూరు జిల్లాకు చెందిన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, మరికొందరితో కలిసి, ఎమ్మెల్యేలను చీల్చి చంద్రబాబు స్థానంలో కేసీఆర్ సీఎం కావాలనుకున్నారని వెల్లడించారు. […]
ఆత్మకూరు ఉప ఎన్నికలో నామినేషన్ల సందడి మొదలైంది. గురువారం వైసీపీ అభ్యర్థిగా మేకపాటి విక్రమ్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ అభ్యర్థిగా ఎవరు బరిలోకి దిగుతారనేది ఇంకా సస్పెన్స్‌గా ఉంది. నెల్లూరు జిల్లా బీజేపీ అధ్యక్షుడు భరత్ కుమార్‌ను ఆత్మకూరు అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది. ఆత్మకూరు ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపిక ముగ్గురు సభ్యులతో ఓ కమిటీ ఏర్పాటు చేసింది. ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి నేతృత్వంలోని కమిటీ ముగ్గురు పేర్లును సూచించింది. అయితే వీరిలో […]
“టీడీపీలో నేనేం తప్పు చేశానని నన్ను దూరం పెట్టారు. పార్టీ లేదు బొక్కాలేదు అన్న అచ్చెన్నపై చర్యలెందుకు తీసుకోలేద”ని సూటిగా ప్రశ్నించారు దివ్యవాణి. అక్కడ ఆమె ఆవేదన కరెక్టే. కానీ ఇక్కడ వైసీపీనుంచి సస్పెండ్ అయిన మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు కూడా అదే లాజిక్ తీస్తున్నారు. “పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఎంపీ రఘురామ కృష్ణంరాజుని ఎందుకు భరిస్తున్నారు. నేనేం తప్పు చేశానని నన్ను సస్పెండ్ చేశారం”టూ ప్రశ్నిస్తున్నారు. తన సస్పెన్షన్ కి సరైన కారణం […]
టీడీపీలో దివ్యవాణి ఎపిసోడ్ దుమారాన్ని రేపింది. ఆమె రాజీనామా చేసిందా, చేయలేదా, వెనక్కి తీసుకుందా, మళ్లీ చేసిందా అనే గందరగోళాన్ని పక్కనపెడితే.. టీడీపీలో జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తి చూపింది. చంద్రబాబు దగ్గరకు వెళ్లాలంటే ఎన్ని గేట్లు అడ్డుగా ఉంటాయో వివరించి చెప్పింది, తనలాంటి సినిమా నటులు టీడీపీలో ఎందుకు ఇమడలేకపోతున్నారో ఉదాహరణలతో సహా వివరించింది. పార్టీ పరిస్థితి అధిష్టానానికి తెలియడంలేదని, వారు భ్రమల్లో ఉన్నారని, ఇంకా భ్రమల్లోనే బతుకుతున్నారని చురకలంటించింది. ఈ క్రమంలో వైసీపీ నేతలు కూడా […]
తెలంగాణలో ఇవాల్టి నుం చి 15 రోజుల పాటు జరగనున్న ఐదో విడత పల్లె ప్రగతి కార్య క్రమానికి సర్వం సిద్ధమైం ది. ఇప్ప టికే 4 విడతలుగా జరిగిన ఈ కార్య క్రమం లో పల్లెల్లో మౌలిక సదుపాయాల కల్ప న, పరిశుభ్ర, పచ్చ దనం తో వెల్లివిరిసేలా చేసేం దుకు చర్య లు చేపట్టారు. తాజాగా ఐదో విడతలో భాగం గా తొలి రోజు గ్రామ సభ నిర్వ హిం చి పల్లె ప్రగతి […]