Author: Sarvi

  ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయకుండా తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్ర‌భుత్వ వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయకుండా నిషేధం విధిస్తూ మంగళవారం తెలంగాణ మెడికల్ ఎడ్యుకేషన్ సర్వీస్ రూల్స్‌కు సవరణలు చేసింది. వివిధ అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల కోసం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో ఇకపై రిక్రూట్ అయిన వారికి ప్రైవేట్ ప్రాక్టీస్‌ను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. “ఇకపై డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా రిక్రూట్ చేయబడిన డాక్టర్లకు ప్రైవేట్ ప్రాక్టీస్‌పై పూర్తి నిషేధం […]

Read More

హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ అమ్నీషియా పబ్ గ్యాంగ్ రేప్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. కొందరు రాజకీయ నాయకుల పిల్లలను కాపాడేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారంటూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. బీజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు ఏకంగా కొన్ని ఫోటోలు రిలీజ్ చేసి ఒక ఎమ్మెల్యే కుమారుడు ఈ సంఘటన‌లో నిందితుడని ఆరోపించారు. మరో వైపు అత్యాచార ఘటన‌పై తెలంగాణ పోలీసులు సరి అయిన‌ చర్యలు చేపట్టడం లేదని ఆరోపిస్తూ ఆ పార్టీ నేతలు […]

Read More

టీడీపీకి కొత్త చిక్కు వచ్చి పడింది. నియోజకవర్గాల్లో పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఇటీవల టీడీపీ నాయకత్వం సర్వేలు చేయిస్తోంది. అది కూడా సైలెంట్‌గా. ఇక్కడే కొందరు సర్వేరాయుళ్లకు కొత్త ఐడియా వచ్చింది. వచ్చే ఎన్నికల్లో టికెట్‌ ఆశిస్తున్న టీడీపీ నేతలకు వల వేయడం మొదలుపెట్టారు. ” మీ నియోజకవర్గంలో సర్వే బాధ్యత మాకు అప్పగించారు. ముగ్గురు నలుగురు అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. మీరు మమ్మల్ని కాస్త చూసుకుంటే.. మేం సర్వేలో మీకు అనుకూలంగా ఉన్నట్టు మీ పార్టీ నాయకత్వానికి […]

Read More

శ్రీలంక ఎన్నడూ లేనంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో పోరాడుతోంది. అప్పులపాలై ఆ అప్పులు కట్టలేక పోతున్న శ్రీలంక మళ్ళీ అప్పులమీదనే ఆధారపడే దుస్థితికి చేరుకుంది. అక్కడ‌ విదేశీ మారక ద్రవ్యం సున్నాకు చేరుకుంది. ఈ సంక్షోభం మ‌ధ్యనే భారత్ లోని బ్యాంకులనుండి శ్రీలంక అప్పులు చేస్తోంది. శ్రీల‍ంక‌ ఇంధన శాఖ మంత్రి కాంచన విజేశేఖర విడుదల చేసిన ప్రకటన ప్రకారం, చమురు కొనుగోళ్ల కోసం శ్రీ‌లంక ఇప్పటికే ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి 500 మిలియన్ […]

Read More

టీడీపీ ఎంపీ కేశినేని నానికి వ్యతిరేకంగా ఆయన బాబాయి నాగయ్య ఆందోళనకు దిగారు. నాని తన ఆస్తులు కాజేసేందుకు కుట్ర చేస్తున్నారని నాగయ్య ఆరోపిస్తున్నారు. కేశినేని కార్యాలయం పక్కనే నాగయ్య స్థలం ఉంది. అక్కడ ఇంటి నిర్మాణాన్ని నాగయ్య మొదలు పెట్టారు. ఆ స్థలంపై కన్నేసిన కేశినేని నాని దాన్ని కాజేసేందుకు ఎత్తులు వేశారని నాగయ్య చెబుతున్నారు. తన ఇంటి నిర్మాణం అక్రమమంటూ కార్పొరేషన్‌ అధికారులకు ఫిర్యాదు చేసి నోటీసులు ఇప్పించారని చెబుతున్నారు. కేశినేని నాని దుర్మార్గంగా […]

Read More

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఆమ్నీషియా పబ్ రేప్ కేసులో మైనర్ బాధితురాలి వివరాలను బహిర్గతపరచడంపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై కేసు నమోదు అయ్యింది. మీడియా మీట్ పెట్టి బాధితురాలి ఫొటోలు, వీడియోలు రిలీజ్ చేశారు. అంతే కాకుండా నేరస్థుల వివరాలను కూడా ప్రకటించారు. అందులో కొంత మంది మైనర్లు ఉన్నారు. ఈ ఫొటోలు, వీడియోలు అవసరం అయితే డీజీపీ మహేందర్‌రెడ్డికి కూడా పంపుతానంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఆయనపై అబిడ్స్ పోలీస్‌స్టేషన్‌లో ఐపీసీ 228ఏ కింద కేసు నమోదు […]

Read More

దక్షిణాఫ్రికాలో భారీ అవినీతికి పాల్పడ్డ ఇద్దరు భారత సంతతికి చెందిన వ్యాపారవేత్తలను దుబాయ్ లో అరెస్టు చేశారు. సోదరులైన రాజేష్ గుప్తా,అతుల్ గుప్తాలను దుబాయ్ లో అరెస్టు చేసినట్టు దక్షిణాఫ్రికా ప్రభుత్వం సోమవారం తెలిపింది. అయితే వీరి మరో సోదరుడు అజయ్ గుప్తా అరెస్టయ్యాడా లేదా అనే విషయం ఇంకా తెలియరాలేదు గుప్తా బ్రదర్స్ గా పేరుగాంచిన ఈ ముగ్గురు సోదరులది ఉత్తరప్రదేశ్ లోని షహరాన్ పూర్. 1990 లో వీరు దక్షిణాఫ్రికా వెళ్ళి షూ వ్యాపారం […]

Read More

శ్రీ వెంకటేశ్వర ఆలయాల నిర్మాణం (SRIVANI) ట్రస్ట్ పై ఇటీవల సోషల్ మీడియాలో విపరీతమైన వ్యతిరేక ప్రచారం జరిగింది. ట్రస్ట్ కి వచ్చే విరాళాల సొమ్ము పక్కదారి పడుతోందంటూ.. ఇష్టం వచ్చినట్టు ఫేక్ పోస్ట్ లు వెలుగులోకి వచ్చాయి. అయితే ట్రస్ట్ విషయంలో ఇలాంటి తప్పుడు ప్రచారాలను సహించేది లేదని టీటీడీ స్పష్టం చేసింది. తప్పుడు ప్రచారం చేసినవారిపై కేసులు పెడతామని హెచ్చరించింది. ఈమేరకు ఓ లేఖను విడుదల చేశారు అధికారులు. మారుమూల ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాల […]

Read More

జూబ్లీహిల్స్ లో బాలికపై అత్యాచారం సంఘటన‌ మరవక ముందే సికింద్రాబాద్ లో మరో ఘోర సంఘటన జరిగింది. కార్ఖానా పరిధిలో బాలికపై ఐదుగురు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఐదుగురిలో ఒకరు బాలుడు. కార్ఖానా ప్రాంతంలో ఓ బాలికతో ధీరజ్, రితేశ్ ఇన్స్టాగ్రామ్ లో పరిచయం పెం చుకున్నా రు. అనం తరం ఆమెకు మాయమాటలు చెప్పి ఆమెను శారీరకం గా లోబర్చు కున్నా రు. ఆ వీడియోలు తీసి బాలికను బ్లాక్ మెయిల్ చేశారు. ఆమె […]

Read More

వైసీపీ నియోజకవర్గ సమన్వయ కర్త పోస్ట్ కి రాజీనామా చేసిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మెత్తబడ్డారు. అధిష్టానం ఆయనను బుజ్జగించడంతో రాజీనామా వెనక్కు తీసుకున్నారు. దీంతో వైసీపీలో విశాఖ సంక్షోభం ముగిసిపోయినట్టే అనుకోవాలి. వాసుపల్లి రాజీనామా అనంతరం వెంటనే అధిష్టానం రంగంలోకి దిగడం, నష్టనివారణ చర్యలు చేపట్టడం, ఇరు వర్గాలను పిలిపించి మాట్లాడటంతో సమస్య పెద్దది కాకముందే పరిష్కారం లభించింది. వాసుపల్లి లేఖ సారాంశం.. “ప్రజా నేతగా, ప్రజల కష్టాలనే పరమావధిగా భావించే మీరు, మరోసారి […]

Read More