దేశవ్యాప్తంగా జూబ్లీహిల్స్‌లో బాలికపై గ్యాంగ్ రేప్ కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన ఒక వ్యక్తితో పాటు ఐదుగురు మైనర్లను పోలీసులు అరెస్టు చేసినట్లు మంగళవారం ప్రకటించారు. కాగా, తొలి సారిగా దీనిపై తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ స్పందించారు. మైనర్ బాలిక రేప్ కేసులో తన మనమడు ఉన్నాడంటూ కొందరు అనవసరపు ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పబ్ వ్యవహారంతో తన మనుమడికి సంబంధం లేకపోయినా రాద్దాంతం […]
Author: Sarvi
వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన విమర్శలకు మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఏపీ బీజేపీ నేతలు పేర్ని నానిపై అటాక్ మొదలు పెట్టారు. అడ్డంగా బలిశావంటూ నడ్డాను వ్యక్తిగతంగా విమర్శిస్తారా అంటూ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలవి ఒళ్లు బలిసిన మాటలంటూ విరుచుకుపడ్డారు. గతంలో బీజేపీ జాతీయ నాయకులెవరూ ఏపీ ప్రభుత్వంపై ఈ స్థాయిలో విమర్శలు చేయలేదు. […]
టీమ్ ఇండియా మహిళా జట్టు వన్డే, టెస్ట్ కెప్టెన్ మిథాలీ రాజ్ 23 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలికారు. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు బుధవారం ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. తన వీడ్కోలుకు సంబంధించి ఒక సుదీర్ఘ ప్రకటనను సోషల్ మీడియాలో పెట్టడంతో క్రికెట్ అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. కోవిడ్‌కు ముందే తాను న్యూజిలాండ్‌లో జరిగే వన్డే వరల్డ్ కప్ అనంతరం క్రికెట్ నుంచి తప్పుకుంటానని చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన […]
ఏపీలో టెన్త్ పరీక్షలు ఫెయిలైన విద్యార్థులకోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ విచిత్ర, వినూత్న ప్రదిపాదన చేశారు. ఫెయిలైనవారికి ఆయా సబ్జెక్టుల్లో 10 గ్రేస్ మార్కులు కలిపి పాస్ చేయించాలన్నారు. అంతే కాదు, పదో తరగతి ఫలితాలు సరిగా లేకపోవడానికి కారణం ప్రభుత్వమేనని విరుచుకుపడ్డారు పవన్ కల్యాణ్. ఉపాధ్యాయులకు సంబంధం లేని డ్యూటీలు వేశారని, బోధన కాకుండా ఇతర పనులు వారితో బలవంతంగా చేయించారని, అందుకే పాఠశాలల్లో విద్యా బోధన సరిగా సాగలేదని చెప్పారు పవన్. […]
ప్రపంచదేశాల్లో మంకీపాక్స్ కేసులు తామరతంపరగా పెరుగుతున్నాయి. ఇది ప్రాణాంతకం కానప్పటికీ ఈ వైరస్ ఆందోళన కలిగిస్తోంది. అయితే ఇప్పటివరకు ఎవరూ ఊహించని వింత ఒకటి బయట పడింది. ఈ వైరస్ మనిషి వీర్యం (సెమెన్) లో ఉంటోందని తాజా అధ్యయనం వెల్లడించింది. ఇందుకు తగినన్ని ఆధారాలు లభించనప్పటికీ మంకీపాక్స్ లైంగికంగా సంక్రమించే వ్యాధి అని ధృవీకరించలేమని, ప్రాథమికంగా ఈ అంచనాకు వచ్చామని నిపుణులు అంటున్నారు. హోమో సెక్స్యువల్ కేసుల్లో.. సెమినల్ ఫ్లూయిడ్ ద్వారా ఈ వైరస్ ట్రాన్స్ […]
‘గడప గడపకు మన ప్రభుత్వం’ అనేది నిరంతర కార్యక్రమమని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. గడప గడపకు మనం కార్యక్రమంపై బుధవారం ఆయన ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారికి కీలక సూచనలు చేశారు. ‘వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో మనమే గెలవాలి. ఇదే మన టార్గెట్. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అన్ని స్థానాలు గెలుస్తామని ఊహించామా? కుప్పం మున్సిపాలిటీని కైవసం చేసుకోగలమనుకున్నామా? కానీ ప్రణాళికా బద్ధంగా పనిచేశాం. అందుకే గెలుపు సాధ్యమైంది. వచ్చే […]
”ప్లీజ్ అంకుల్ మా నాన్న నుంచి మా అమ్మను కాపాడండి…” ఓ ముగ్గురు చిన్నారులు ఈ విధంగా వేడుకున్న తీరు పోలీసుల హృదయాలను కూడా కరిగించింది. రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీసు స్టేషన్ లో జరిగిన ఈ ఘటన ప్రతి ఒక్కరినీ కంట తడి పెట్టించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే… నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన పంతంగి రాజీవ్ అతని భార్య పద్మ, ముగ్గురు పిల్లలు దీపు(10), శివరామకృష్ణ (7), మరియు లక్షీకాంత్ (6)లతో కలిసి రంగారెడ్డి […]
ఏపీలో టెన్త్ పరీక్షలు రాసి ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇటీవల పదవ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల చేయగా.. 67.26 శాతం మంది పాస్ అయ్యారు. గత 20 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఈ సారి విద్యార్థులు పరీక్ష తప్పారు. ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం నెల రోజుల్లోపు సప్లిమెంటరీ పరీక్ష నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అంతే, కాకుండా వారికి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. తాజాగా […]
వర్షాకాలం వచ్చిందంటే హైదరాబాద్‌లో వరద ముంపు ప్రమాదం ఏర్పడుతుంది. గత కొన్నేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం ముంపు ముప్పును తప్పించేందుకు పలు అభివృద్ధి పనులు చేపట్టింది. అదే సమయంలో వరద సాయం అందించాలని కేంద్రాన్ని కోరుతున్నా.. ఒక్క పైసా విదిల్చడం లేదు. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రధాని మోడీని నిలదీశారు. ‘మోడీ గారూ.. మీరు సామాజిక సేవ చేయడానికి ప్రయత్నిస్తున్నారా? ప్రభుత్వం నడుపుతున్నారా? లేదా స్వచ్చంద సేవా సంస్థనా?’ అని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌కు […]
రాజమండ్రి నా జన్మభూమి, ఉత్తర ప్రదేశ్ నా కర్మ భూమి అంటూ బీజేపీ సభలో వ్యాఖ్యానించారు జయప్రద. ఇటీవల తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై ఫోకస్ పెడతానంటూ తన సన్నిహితుల దగ్గర మాట్లాడిన జయప్రద.. ఏపీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో కలసి బీజేపీ గోదావరి గర్జన సభకు హాజరయ్యారు. చాన్నాళ్లుగా ఆమె బీజేపీలోనే ఉన్నా కూడా తెలుగు రాష్ట్రాల్లో జరిగిన సభలు, సమావేశాలకు పెద్దగా హాజరు కాలేదు. ఇప్పుడు గోదావరి గర్జనతో తాను బీజేపీలోనే ఉన్నట్టు క్లారిటీ […]