తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవ్వాళ్ళ మంత్రులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ప్రగతిభవన్ లో జరగబోయే ఈ సమావేశంలో రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు, పాలనాపరమైన అంశాలపై వారితో చర్చించనున్నారు. వచ్చే నెల 18న జరగబోయే రాష్ట్రపతి ఎన్నికలపైనా ప్రధానంగా చర్చించనున్నట్టు సమాచారం. కొంత కాలంగా కేంద్ర బీజేపీ సర్కార్ పై యుద్దం ప్రకటించిన కేసీఆర్ రాష్ట్రపతి ఎన్నికలపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిదాయకంగా మారింది. నరేంద్ర మోడీ సర్కార్ అన్ని రంగాల్లో విఫలమైందని, తెలంగాణ […]
Author: Sarvi
జూమ్ మీటింగ్‌లో పదో తరగతి విద్యార్థులను ప్రభుత్వంపై రెచ్చగొట్టేందుకు నారా లోకేష్ చేసిన ప్రయత్నాలు.. కొడాలి నాని, వల్లభనేని వంశీ ఎంట్రీలో ఒక్కసారిగా సైడ్ ట్రాక్ పట్టేశాయి. ఊహించని విధంగా వైసీపీ నేతలు జూమ్‌లోకి రావడం, మీడియా కూడా అసలు విషయాన్ని వదిలేసి ఈ విషయంపైకి ఫోకస్ మళ్లించడంతో టీడీపీ ఆగ్రహంగా ఉంది. ఇలాగైతే తమ జూమ్ మీటింగ్‌లు జరిగేది ఎలా అన్న ఆందోళన టీడీపీలో ఉంది. అది కూడా తమ పార్టీ తరపున గెలిచిన వల్లభనేని […]
ఏపీలో ఈ ఏడాది టెన్త్ క్లాస్ పరీక్ష ఫలితాల్లో పాస్ పర్సంటేజీ బాగా తగ్గిపోవడంతో ప్రభుత్వం విద్యార్థులు నష్టపోకుండా చర్యలు తీసుకుంటోంది. అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ కూడా ప్రకటించేసింది. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైతే కంపార్ట్ మెంటల్ పాస్ అనే ప్రస్తావన లేకుండా చేస్తామని చెప్పింది. సాధారణ విద్యార్థుల లాగే గ్రేడ్లు కేటాయిస్తామంది. అదే సమయంలో ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామని చెప్పింది. ఈనెల 13నుంచి స్పెషల్ క్లాస్ లు.. పదో తరగతి […]
అర్దరాత్రి హైదరాబాద్ లో భారతీయ జనతా పార్టీ నాయకుడిని అరెస్టు చేశారు పోలీసులు. వనస్థలిపురం పనామా గోడౌన్స్ దగ్గర గురువారం అర్ధరాత్రి బీజెపి నాయకుడు జిట్టా బాలకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. బీజేపీ నాయకుడి అరెస్టును ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఖండించారు. అతన్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. భువనగిరి వెళ్తుండగా పనామా గోడౌన్ల వద్ద జిట్టా బాలకృష్ణరెడ్డి, అతని అనుచరులను పోలీసులు ఆపి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి […]
జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ మైనర్ రేప్ కేసులో పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ కేసులో నిందితులైన మైనర్లను మేజర్లుగా పరిగణించాలని జువైనల్ జస్టిస్ బోర్డ్ ను పోలీసులు కోరారు. ట్రయల్ సమయంలో ఐదుగురు మైనర్లను మేజర్లుగా పరిగణించాలని జువైనల్ జస్టిస్‌కు హైదరాబాద్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. చార్జ్‌షీట్ దాఖలు సమయానికి నిందితులంతా మేజర్లు అవుతారని పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో విచారించి, శిక్షలు పడేలా చేయాలంటే నిందితులను మేజర్లుగా పరిగణించాలని జువైనల్ బోర్డుకు పోలీసులు లేఖ రాశారు. అయితే […]
జూబ్లీ హిల్స్ అమ్నీషియా పబ్ మైనర్ అత్యాచారం కేసు నేపథ్యంలో వక్ఫ్ బోర్డు చైర్మన్ ను పదవి నుండి తప్పుకోవాలని టీఆరెస్ అధిష్టానం ఆదేశించినట్టు సమాచారం. వక్ఫ్ బోర్డు చైర్మెన్ మసీవుల్లా మైనర్ కుమారుడు ఈ కేసులో ముద్దాయిగా ఉన్నాడు. అత్యాచారం కూడా వక్ఫ్ బోర్డు కారులోనే జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఈ విషయం పై టీఆరెస్ అధినేత సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. మసీవుల్లాతో రాజీనామా చేయించే బాధ్యత ఆయనకు సన్నిహితుడైన హోం మంత్రికి అప్పగించినట్టు […]
తెలంగాణ గవర్నర్ తమిళిసై పై సీపీఐ నేత నారాయణ విమర్షలు గుప్పించారు. ఆమె రాజకీయాలు చేస్తున్నారని, రాజకీయ కార్యకలాపాలకు రాజ్ భవన్ ను దుర్వినియోగం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రేపటి నుంచి గవర్నర్ ప్రారంభించనున్న మహిళల దర్బార్ లక్ష్మణరేఖను దాటడమే అని నారాయణ మండిపడ్డారు. ఒకవైపు బీజేపీ, తెలంగాణ రాష్ట్రంపై రాజకీయ దాడిని పెంచిందని, మరో వైపు గవర్నర్ ఆ దాడికి ఆజ్యం పోస్తోందని ఆయన విమర్షించారు. గవర్నర్ పాత్ర రాజకీయ పరంగా ఉంది. ఇది ఫెడరల్ […]
ఏపీలో పదో తరగతి పరీక్షా ఫలితాల విడుదల తర్వాత అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరుకుంది. గతంలో పరీక్ష ఫలితాల విషయంలో ఎప్పుడూ ఇంత రాద్ధాంతం, ఇంత చర్చ జరిగిన సందర్భాలు లేవు. కానీ ఈసారి మాత్రం ప్రభుత్వ వైఫల్యంతోనే ఫలితాలు తక్కువగా వచ్చాయని ప్రతిపక్షం దుమ్మెత్తి పోస్తోంది. దీనికి విరుగుడుగా.. వైసీపీ నేతలు కౌంటర్లు ఇవ్వడం మొదలు పెట్టారు. పరీక్ష పేపర్లు తయారు చేసింది, కరెక్షన్ చేసింది టీచర్లేనని, పవన్ కల్యాణ్ […]
తాజాగా పవన్ కల్యాణ్ పెట్టిన ఓ ట్వీట్ రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. జర భద్రం అంటూ ఆయన కార్యకర్తలను అలర్ట్ చేశారు. ‘అప్పటి వరకు మనల్ని తిట్టిన నాయకులు సడెన్‌గా మనల్ని పొగడటం ప్రారంభిస్తారు. పొగడ్తలను నిజమనుకుంటే ప్రమాదంలో పడ్డట్టే.. ఆ నాయకుడు మారిపోయాడు, పరివర్తన చెందాడని మనం భావించి చప్పట్లు, ఆనందకరమైన ఎమోజీలు పెడితే ప్రత్యర్థుల ట్రాప్ లో పడ్డట్టే’ అంటూ ఆయన ట్వీట్. దీంతో అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల సడెన్ […]
వైసీపీ ఎమ్మెల్యేలకు సీఎం వైఎస్ జగన్ మరోసారి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. తాడేపల్లిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లతో సీఎం వైఎస్ జగన్ వర్క్ షాప్ నిర్వహించారు. కొందరు ఎమ్మెల్యేలు ఇప్పటికీ గడప గడపకు కార్యక్రమాన్ని మొదలుపెట్టకపోవడంపై సీఎం జగన్ తీవ్రంగా స్పందించారు. ప్రతి ఎమ్మెల్యే నెలలో 20 రోజుల పాటు కార్యక్రమానికి వెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ సమావేశానికి ఐ-ప్యాక్ సంస్థ డైరెక్టర్ రుషి రాజ్ సింగ్ కూడా వచ్చారు. ప్రశాంత్ కిషోర్ […]