తెలంగాణ రాష్ట్ర సమితి.. ఇకపై భారత్ రాష్ట్ర సమితి గా మారుతోందన్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన జాతీయ కార్యవర్గం ఏర్పాటుపై తెలంగాణ సీఎం కేసీఆర్ దృష్టిసారించారు. బీఆర్ఎస్ కోసం అధికార ప్రతినిధులు, సమన్వయకర్తలతో పాటు రాష్ట్రాల ప్రతినిధులను ముందుగా నియమించాలనే అంశంపై పార్టీ ముఖ్యనేతలతో ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా హాజరయ్యారు. ఇదే నెలలో కొత్త పార్టీపై ప్రకటన ఉంటుంది. దీనికోసం ఈనెల 19న జరిగే […]
Author: Sarvi
ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలంటూ వైసీపీ ఎంపీలు దాఖలు చేసిన పిటిషన్ ను లోక్ సభ స్పీకర్ కార్యాలయం తిరస్కరించిన విషయం తెలిసిందే. దీంతో రఘురామ వర్గం జోష్ లో ఉంది. ఇప్పటికీ వైసీపీ అధినేత జగన్, పార్టీ నేతలపై ఆయన విమర్శలు సంధిస్తున్నారు. అనర్హత పిటిషన్ తిరస్కరణకు గురి కావడంతో ఆయన మరింత రెచ్చిపోయే అవకాశముంది. ఈ దశలో.. రఘురామపై ఎంపీ విజయసాయి మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అనర్హత వేటు పడలేదని సంతోషించొద్దని, […]
ఉప్పు నిప్పుగా ఉండే వైసీపీ , తెలుగు దేశం నాయకులు ఒకరినొకరు పొగుడుకోవడం ఆశ్చర్యంగానే ఉంటుంది. కానీ అది జరిగింది. వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడిపై ప్రశంసల వర్షం కురిపించారు ఆయనకున్న పాటి జ్ఞానం బీజేపీ వాళ్లకు లేకుండా పోయిందని విరుచుకుపడ్డారు. ఆత్మకూరు ఉప ఎన్నికలో భాగంగా ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామితో కలిసి నిన్న సంగం మండలంలోని జంగాలకండ్రికలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో […]
”మరో 11 నెలల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరుతుంది. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే. దానికి నేనే నాయకత్వం వహిస్తా.”అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో దుమారం రేపుతున్నాయి. ”ముఖ్యమంత్రి కేసీఆర్ పుర్రెలో పురుగు తిరిగింది.. ఎన్నికలకు పోవాలనుకుంటుండు. డిసెంబర్‌లోనే ఎన్నికల నగారా మోగుతుంది” అని కూడా ఆయన జోస్యం చెప్పారు. ఇదివరకు కూడా పలు సందర్భాలలో రేవంత్ రెడ్డి ”నేను” అని వ్యాఖ్యలు చేశారు. ఈ వైఖరి పార్టీలో మిగతా నాయకులకు, ప్రముఖులకు […]
తెలంగాణకు ఇది చరిత్రాత్మక రోజంటే అతిశయోక్తి కాదు. రాష్ట్రాన్ని ఉజ్వల పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చి దిద్దెందుకు మంత్రి కేటీఆర్ చేస్తున్న కృషికి మరో అద్భుత నిదర్శనం ! ఫార్ట్యూన్ -500 కంపెనీ-రాజేష్ ఎక్స్ పోర్ట్స్ (ఎలెస్ట్) 24 వేల కోట్ల పెట్టుబడితో ఓ అమూల్యమైన డిస్ ప్లే ఫ్యాబ్ ను ఏర్పాటు చేయబోతోంది. అత్యంత అధునాతనమైన ‘అమోల్డ్’ డిస్ ప్లేస్ ను ఉత్పత్తి చేసేందుకు ఈ సంస్థ నడుం కట్టింది. ఇండియాలో ఈ తరహా హై టెక్ […]
దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి, తెలంగాణలో కూడా రోజువారీ కేసుల్లో పెరుగుదల నమోదవుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో స్కూల్ సెలవులపై ప్రభుత్వం పునరాలోచిస్తోందని, కరోనా కేసులు పెరుగుతుండటంతో సెలవులు కూడా పొడిగిస్తారని అనుకున్నారంతా. మధ్యాహ్నం వరకు దీనిపై పుకార్లు షికార్లు చేశాయి. ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు కూడా కాస్త ఆందోళన పడ్డాయి. అయితే ఎట్టకేలకు ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. రేపటినుంచి స్కూల్స్ యధావిధిగా ప్రారంభమవుతాయని చెప్పారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. కరోనా […]
తనను తాను తగ్గించుకునువారు హెచ్చింపబడుదురు అంటూ ఇటీవల పొత్తుల విషయంలో 3 ఆప్షన్లు చెప్పి చివర్లో ఈ బైబిల్ వాక్యం చెప్పారు పవన్ కల్యాణ్. 2014, 2019లో తనను తాను ప్రజల కోసం తగ్గించుకున్నానని గుర్తు చేశారు. ఇప్పుడు మరోసారి ఆయన తన ట్విట్టర్ హ్యాండిల్ లో ఇంకో బైబిల్ వాక్యాన్ని ప్రస్తావించారు. సామెతలు 12:22 “అబద్దమాడు పెదవులు యెహోవాకు హేయములు సత్యవర్తనులు ఆయనకిష్టులు.” అంటూ ఈసారి ఈ వాక్యాన్ని కోట్ చేస్తూ ఏపీ ప్రభుత్వంపై సెటైర్లు […]
“గవర్నర్ల నియామకాల్లో రాజకీయాలకు తావు లేదు, ప్రత్యేకించి కేంద్రంలో ఓ పార్టీ, రాష్ట్రంలో మరో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ రాష్ట్రానికి గవర్నర్ ని నియమించేటప్పుడు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి.” ఇవీ గతంలో మోదీ, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పిన సుభాషితాలు. కానీ ఇప్పుడవి తెలంగాణ విషయంలో పూర్తిగా రివర్స్ లో అమలవుతున్నాయి. గవర్నర్లు రాజకీయం చేయకూడదని అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ చెబితే, ఇప్పుడు తెలంగాణ గవర్నర్ పూర్తిగా రాజకీయాలే చేస్తున్నారని మండిపడ్డారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే […]
ఏపీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వైసీపీ నేతలపైనా పోరాటానికి వెనుకాడడం లేదు. మాజీ మంత్రిపేర్ని నాని సిఫార్సు మేరకు విక్టర్ ప్రసాద్‌ను జగన్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించారని చెబుతుంటారు. దళితుల పట్ల నిబద్దత ఉన్న వ్యక్తి కావడమూ ఆయనకు కలిసి వచ్చింది. అక్కడి వరకు బాగానే ఉన్నా పదవిలోకి వచ్చిన తర్వాత.. ఎస్సీలకు న్యాయం చేసే విషయంలో వైసీపీ పెద్దలనూ ఖాతరు చేయకుండా ముందుకెళ్తున్నారు. ఇది రాజ్యాంగ […]
బెజవాడ రాజకీయం రంజుగా మారుతుందా..? టీడీపీలో కుమ్ములాటలు ఇక పొలిటికల్ స్క్రీన్‌పైకి రాబోతున్నాయా? అంటే అవుననే అంటున్నాయి రాజకీయవర్గాలు. టీడీపీలో కేశినేని సునామీ రాబోతుంది అని ప్రచారం జరుగుతోంది. కేశినేని నాని, టీడీపీ అధినేత చంద్రబాబు మధ్య బాగా గ్యాప్ పెరిగిందని ప్రచారం జరుగుతోంది. ఇటీవల మహానాడుకు కూడా కేశినేని హాజరుకాలేదు. టీడీపీ బాదుడే బాదుడుకు కూడా దూరంగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు పెద్దగా హాజరు కావడం లేదు. ఇదే టైమ్‌లో ఎన్టీఆర్ శతజయంతి కార్యక్రమంలో కేశినేని […]