మాజీ మంత్రి కొడాలి నాని చంద్రబాబు, లోకేష్ పై తీవ్ర విమర్శలు చేస్తుంటారు కానీ, అదే పార్టీలో ఉన్న ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల్ని ఎప్పుడూ ఆయన పల్లెత్తు మాట అనలేదు. నందమూరి కుటుంబంపై తనకు గౌరవం ఉందని ఆయన చాలా సార్లు బహిరంగంగా చెప్పుకున్నారు కూడా. కానీ తొలిసారిగా ఎన్టీఆర్ కుమార్తె పురంద్రీశ్వరిపై సంచలన ఆరోపణలు చేశారు కొడాలి నాని. గుడివాడ అభివృద్ధిని ఆమె అడ్డుకుంటోందని మండిపడ్డారు. ఎన్టీఆర్ కుమార్తెగా ప్రజలందరికోసం ఆలోచించాలి కానీ, కేవలం 10మంది […]
Author: Sarvi
అమరావతికి అనుకూలంగా తీర్పు ఇచ్చిన త్రిసభ్య ధర్మాసనంలో ఒకరైన జస్టిస్ సత్యనారాయణమూర్తి పదవి విరమణ చేసి వెళ్తున్న సమయంలో అమరావతివాదులు పూల వర్షం కురిపించారు. రోడ్లుకు ఇరువైపుల నిలబడి ఘనంగా వీడ్కోలు పలికారు. వారికి జస్టిస్ సత్యనారాయణమూర్తి అభివాదం చేశారు. గతంలో ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు కఠినమైన తీర్పులు ఇచ్చిన జస్టిస్ రాకేష్ కుమార్ రిటైర్ అయి వెళ్తున్న సమయంలోనూ అమరావతివాదులు ఇదే తరహాలో పూల వర్షం కురిపిస్తూ వీడ్కోలు పలికారు. జస్టిస్ సత్యనారాయణ మూర్తి […]
ప్రత్యేక హోదా, పోలవరం, విశాఖ స్టీల్, విభజన హామీల సాధనలో ఏపీ సీఎం జగన్‌కు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా రాష్ట్రపతి ఎన్నికలను బహిష్కరించాలని కాంగ్రెస్ మాజీ ఎంపీ హర్షకుమార్ సూచించారు. 25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వచ్చి హోదా సాధిస్తానని చెప్పిన జగన్.. ఇప్పుడేం చేస్తున్నారని ప్రశ్నించారు. హోదా, పోలవరం నిధుల సాధనకు రాష్ట్రపతి ఎన్నికలు మంచి అవకాశం అన్నారు. విభజన హామీలను నెరవేర్చకపోతే మద్దతు ఇచ్చేది లేదని జగన్ ఒక్క ప్రకటన చేస్తే […]
తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ భేటీ పెద్ద చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ సీఎం, ఏపీకి చెందిన కాంగ్రెస్ మాజీ ఎంపీ ఎందుకు భేటీ అయ్యారు. అసలు వీరిద్దరి మధ్య చర్చకు వచ్చిన అంశాలేంటి అనే విషయంలో చాలా ఊహాగానాలు వినిపించాయి. భారత్ రాష్ట్రీయ సమితి గురించి చర్చలు జరిగి ఉంటాయని, ఏపీకి ఉండవల్లిని ఇన్ చార్జిగా ప్రకటించే అవకాశముందని కూడా వార్తలు వినిపించాయి. అయితే కేసీఆర్ తో జరిగిన చర్చల్లో అసలు […]
ప్రత్యర్థులపై మాటల తూటాలతో విరుచుకుపడే జోగి రమేశ్ .. ఈసారి నేరుగా ఓ పత్రికాధిపతినే టార్గెట్ చేశాడు. ఏకంగా రామోజీరావునూ విమర్శించారు. రాష్ట్రంలోని రెండు పత్రికల్లో నిత్యం ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు వస్తున్న విషయం తెలిసిందే. విషయం ఏమీ లేకపోయినా.. చిన్న అంశాలను కూడా పెద్దవిగా చేసి బ్యానర్ స్టోరీలుగా వండి వారుస్తున్నారు. ఇదిలా ఉంటే ‘పునాది దాటని పేదిళ్లు’ అంటూ ఈనాడు పత్రిక ఓ కథనం రాసింది. పేదలకు సొంతిళ్లు కట్టడం ప్రభుత్వానికి ఇష్టం లేదని.. […]
కొండా సురేఖ.. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌కు అత్యంత సన్నిహితురాలు. ఆయన మరణానంతరం మంత్రి పదవినే త్యాగం చేసిన సురేఖ.. ఆ తర్వాత ఎందుకో వైసీపీ అధినేత జగన్‌తో పొసగలేకపోయారు. పలు పార్టీలు మారి.. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. ఆమె భర్త మురళి మాజీ నక్సలైట్. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత. ఇదిలా ఉంటే కొండా దంపతుల జీవితం ఆధారంగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘కొండా’ […]
అమ్నీషియా పబ్ మైనర్ అత్యాచారం కేసులో జువైనల్ హోంలో ఉన్న నిందితులు గొడవకు దిగారని తెలుస్తోంది. ఈ పరిస్థితికి నువ్వంటే నువ్వే కారణమంటూ ఒకరిని ఒకరు బూతులు తిట్టుకున్నారని, ఒకరిపై ఒకరు చేయిచేసుకున్నారని తెలుస్తోంది. నువ్వు పబ్ కు తీసుకెళ్ళడంవల్లనే ఇదంతా జరిగిందని ఓ మైనర్ పై మిగతావాళ్ళు ఆరోపణలు చేయగా బాలికను ట్రాప్ చేసింది మీరేనంటూ ఆమైనర్ కౌంటర్ ఇచ్చాడు. వీళ్ళ మధ్య గొడవ తారాస్థాయికి స్థాయికి చేరగా పోలీసులు జోక్యం చేసుకొని సర్ది చెప్పినట్టు […]
పోలీసులు వైసీపీ నేతల బానిసలు అని కొంతమంది కామెంట్ చేస్తున్నారని.. అలాంటి వ్యాఖ్యలతో తమ మనోభావాలను దెబ్బతీయొద్దని అన్నారు గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ వర్మ. అన్ని రాజకీయ పార్టీలు తమకు సమానమే అని ఆయన స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి ఇంటి దగ్గర 150 మందితో సెక్యూరిటీ ఇస్తున్నామని.. మరి వాళ్ళను టీడీపీ బానిసలు అనాలా అని ప్రశ్నించారు. పోలీసులపై అనవసరమైన కామెంట్స్ చేసి తమ మనోభావాలు దెబ్బతీయొద్దన్నారు త్రివిక్రమ వర్మ. కంతేరులో వ్యక్తిగత గొడవ.. […]
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గతంలో చాలాసార్లు నిరసన కార్యక్రమాలు చేపట్టింది. అయితే ఆ నిరసనలు, ఆందోళనలు.. ఎప్పుడూ సజావుగా సాగలేదు. పోలీసులు అనుమతిచ్చేవారు కాదు, అనుమతిచ్చినా ఆంక్షలు పెట్టేవారు. అరెస్ట్ లు, ఆందోళనలు, రేవంత్ రెడ్డి సవాళ్లు.. ఇలా జరిగేవి కాంగ్రెస్ నిరసనలు. అయితే తొలిసారిగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో తలపెట్టిన ఆందోళన కార్యక్రమానికి తెలంగాణ పోలీసులు అనుమతి ఇచ్చారు. నెక్లెస్ రోడ్డు లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ఈడీ కార్యాలయం వరకు కాంగ్రెస్ పార్టీ నిరసన ప్రదర్శనకు […]
తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశ వ్యాప్తంగా అమలు కావాలని వేంకటేశ్వర స్వామిని ప్రార్ధించినట్లు తెలిపారు తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్. అమెరికాతో సమానంగా చైనా అభివృద్ది చెందిందని, చైనాతో సమానంగా జనాభా ఉన్న భారతదేశం మాత్రం అభివృద్దిలో వెనుకబడి ఉందని, దీనికి కారణం పాలకులేనన్నారాయన. సహజ వనరులతో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన కేసీఆర్, ఇప్పుడు దేశం మొత్తం అలాంటి అభివృద్ధికోసం జాతీయ రాజకీయాల్లోకి వస్తున్నారని అన్నారు. ప్రధాని పదవి కోసం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి […]