ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగులకు సీఎం జగన్ కానుక ఇవ్వబోతున్నారు. రెండేళ్ల ప్రొబేషన్ పూర్తి చేసుకున్న ఉద్యోగుల డిక్లరేషన్ ఫైలుపై ముఖ్యమంత్రి గురువారం సంతకం చేశారు. దీంతో వీరికి కొత్త జీతాలు అందనున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేసే ఉద్యోగులు రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న తర్వాత డిపార్ట్‌మెంటల్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. అందులో ఉత్తీర్ణులు అయితే వారికి కొత్త వేతనాలు అందుతాయి. ఈ క్రమంలో ఇటీవల గ్రామ, వార్డు […]
Author: Sarvi
ఏపీలో ఐదుగురు ఐపీఎస్ లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కోనసీమ జిల్లా ఎస్పీగా ఉన్న సుబ్బారెడ్డిని మంగళగిరిలోని ఆరో బెటాలియన్ కమాండెంట్ గా బదిలీ చేశారు. కోనసీమకు కొత్త ఎస్పీగా సిహెచ్.సుధీర్ కుమార్ రెడ్డిని నియమించారు. ఆయన ఇప్పటి వరకు కర్నూరు జిల్లా ఎస్పీగా పనిచేశారు. సుధీర్ కుమార్ రెడ్డి స్థానంలో కర్నూలు జిల్లాకు ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ని కృష్ణా జిల్లా నుంచి బదిలీ చేశారు. కౌశల్ స్థానంలో కృష్ణా జిల్లాకు […]
ఏపీ ప్రభుత్వ పాఠశాల్లో నాణ్యమైన విద్య అందించేందుకు ఏపీ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు కలిగిన ఎడ్యుకేషనల్ టెక్ కంపెనీ బైజూస్‌తో ఒప్పందం చేసుకుంది. సీఎం సమక్షంలో కంపెనీ ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు ఒప్పందంపై సంతకాలు చేశారు. బైజూస్ వ్యవస్థాపకుడు రవీందర్ అమెరికా నుంచి వర్చువల్ విధానంలో కార్యక్రమంలో పాల్గొన్నారు. వచ్చే ఏడాది నుంచి బైజూస్ కంటెంట్‌తో విద్యను అందిస్తామని సీఎం జగన్ వెల్లడించారు. ప్రపంచ స్థాయిలో పిల్లలు పోటీ పడేలా సన్నద్దం […]
రాహుల్ గాంధీని రోజుల తరబడి ఈడీ విచారిస్తుండడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు చేపట్టిన రాజ్‌భవన్ ముట్టడి హైదరాబాద్‌లో ఉద్రిక్తతకు దారి తీసింది. కాంగ్రెస్ శ్రేణులకు,పోలీసులు మధ్య తీవ్ర స్థాయిలో తోపులాట జరిగింది. కొందరు ఆందోళన కారులు ఖైరతాబాద్ జంక్షన్‌లో బస్సుల అద్దాలను పగులగొట్టారు. బస్సులపైకి ఎక్కి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోడ్లుపై ఒక స్కూటీని తగలబెట్టారు. రాజ్‌భవన్ వైపు వెళ్తున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఆసమయంలో నేతలకు, పోలీసులకు మధ్య […]
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌కు జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (NCLT) హైదరాబాద్ బెంచ్ షాకిచ్చింది. రవి ప్రకాష్ పెట్టుకున్న పిటిషన్‌ను కొట్టేసి ట్రైబ్యునల్ రూ. 10 లక్షల జరిమానా విధించింది. టీవీ9కు చెందిన ఏబీసీ ప్రైవేటు లిమిటెడ్ వాటాల కొనుగోలులో అక్రమాలు జరిగాయని, సంస్థను స్వాధీనం చేసుకున్న వారిని నియంత్రించాలంటూ రవిప్రకాష్, కేవీఎన్ మూర్తి పిటిషన్ దాఖలు చేశారు. కాగా, పిటిషన్‌పై సుదీర్ఘ వాదనల విన్న లా ట్రైబ్యునల్ నిన్న తీర్పు వెలువరించింది. టీవీ9 వాటాల […]
దేశవ్యాప్తంగా కరోనా కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకూ 8వేల చుట్టూ తిరుగుతున్న కేసులు.. అమాంతం 12వేలకు చేరుకున్నాయి. దీంతో ఫోర్త్ వేవ్ పై ఉన్న అనుమానాలు పటాపంచలయ్యేలా ఉన్నాయి. అపోహలకు బలం చేకురేలా ఉంది. 8 తర్వాత 9, 10, 11 క్రాస్ చేసుకుని ఒకేసారి కరోనా కేసులు 12వేలకు చేరడంతో భయాందోళనలు పెరిగిపోతున్నాయి. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా కరోనా కేసులు 12,213 నమోదయ్యాయి. ముందు రోజుకంటే కేసుల సంఖ్య 38.4 శాతం అధికంగా […]
”కేసీఆర్ తో మాట్లాడిన తర్వాత నా సందేహాలు తొలగిపోయాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని నాకు నమ్మకం కలుగుతోంది” అని ఆంధ్రప్రదేశ్ విభజనకు బద్ధ వ్యతిరేకి, తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని నిరంతరం చులకనగా, అవహేళనగా మాట్లాడుతూ వచ్చిన, మూడు దశాబ్దాలకు పైగా హైదరాబాద్ కేంద్రంగానే పనిచేస్తున్న కరుడుగట్టిన సమైక్యవాది, కోస్తాఆంధ్ర కమ్మ సామాజికవర్గానికి చెందిన సీనియర్ జర్నలిస్టు అప్పట్లో అన్నాడు. ఆయనే కాదు, ఆ కాలంలో చాలామంది ‘సెటిలర్లు’ తెలంగాణ ఏర్పాటు సాధ్యం కాదని బల్ల గుద్ది వాదిస్తూ […]
పంట బీమా పరిహారం చెల్లింపుపై ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాసిందని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి విమర్శించారు. కథనాలు రాసిన విధానం చూస్తుంటే రాసిన వారికి సరైన శిక్షణ కల్పించాల్సిన అవసరం కనిపిస్తోందన్నారు. లబ్దిదారులు 30 లక్షల మంది ఉంటే పరిహారం 15 లక్షల మందికి ఇచ్చారని రాయడం బట్టే వారి అవగాహన ఏపాటిదో అర్ధమవుతోందన్నారు. ఎల్లో మీడియా తీరుచూస్తుంటే మొత్తం రైతులంతా నష్టపోవాలని కోరుకుంటున్నట్టుగా ఉందన్నారు. 31 పంటలకు 30 […]
ఎంపీ రఘురామకృష్ణంరాజుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మద్యం ద్వారా వస్తున్న ఆదాయాన్ని ప్రత్యేక మార్జిన్ పేరుతో ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్‌కు మళ్లించి, దాన్ని పూచీగా చూపి రుణాలు పొందడాన్ని సవాల్ చేస్తూ రఘురామకృష్ణంరాజు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆదాయాన్ని కన్సాలిడేటెడ్ ఫండ్‌కు జమ చేయకుండా నేరుగా బేవరేజెస్ కార్పొరేషన్‌కు మళ్లించి రుణం తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధమని ఎంపీ తరఫు న్యాయవాది వాదించారు. ఈ సమయంలో జోక్యం చేసుకున్న న్యాయస్థానం.. అసలు ఫలానా విధానంలోనే రుణాలు […]
2019 ఎన్నికల ఏడాదిలో ఎన్టీఆర్ జీవిత చరిత్రను సినిమాగా తెరకెక్కించారు. కథానాయకుడు, మహానాయకుడు అనే పేర్లతో ఎన్టీఆర్ బయోపిక్స్ వచ్చాయి. ఆ సినిమాలకు ఎలాంటి స్పందన వచ్చిందో.. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీకి కూడా అలాంటి ఆదరణే దక్కింది. అక్కడ సినిమాలు ఫ్లాప్, ఇక్కడ పొలిటికల్ సీన్ లో టీడీపీ చరిత్రలో ఎరుగని ఘోర పరాభవం చవిచూసింది. ఇక 2024 ఎన్నికల టైమ్ కి టీడీపీ అలాంటి మరో సాహసం చేస్తుందని ఎవరూ అంచనా వేయట్లేదు. […]