అగ్నిపథ్ పథకం పేరుతో సైన్యం నియామకాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు.. దేశవ్యాప్తంగా చిచ్చు పెట్టాయి. అటు బీహార్ సహా పలు రాష్ట్రాల్లో ఆందోళనలు మిన్నంటాయి. ఇటు తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రణరంగంగా మారింది. ఆందోళనకారులు రైళ్లను తగలబెట్టారు, పోలీస్ కాల్పుల్లో ఒకరు మృతిచెందారు. అయితే ఈ పాపమంతా ప్రధాని నరేంద్రమోదీదేనంటూ ట్విట్టర్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ మంత్రి కేటీఆర్. సైనిక ఉద్యోగాలకోసం సిద్ధమవుతున్న నిరుద్యోగుల జీవితాలతో మోదీ ఆటలు ఆడుకుంటున్నారని మండిపడ్డారు. […]
Author: Sarvi
ఆధార్ అందరికీ తప్పనిసరి, అయితే ఆధార్ కార్డ్ కావాలంటే.. ఆధార్ సెంటర్ల చుట్టూ తిరగాల్సిందే. దరఖాస్తు తీసుకుని ఆధార్ సెంటర్లకు వెళ్లి అక్కడ ఫొటో దిగి ఆ తర్వాత కార్డ్ కోసం వెయిట్ చేయాలి. నెలల చిన్నారులకు ఆధార్ తీసుకోవడం చాలామంది తల్లిదండ్రులకు ఇబ్బంది. కానీ ఏ పథకానికైనా ఆధార్ తప్పనిసరి కావడంతో చిన్నారులను తీసుకుని కూడా ఆధార్ సెంటర్లకు వస్తుంటారు తల్లిదండ్రులు. ఇప్పుడిలాంటి ఇబ్బందులకు ఫుల్ స్టాప్ పడబోతోంది. పుట్టిన ప్రతి బిడ్డకు ఆస్పత్రిలోనే ఆధార్ […]
”విలన్ ఎక్కడో దాక్కొని ఉంటాడు.. హీరో హెలీకాఫ్టర్‌లో సరిగ్గా విలన్ ఉండే ఇంటి మీదే దిగేసి.. నాలుగు తన్నులు తన్ని.. హెలీకాఫ్టర్‌లో ఎత్తుకపోతాడు”.. ఇవన్నీ మనం సినిమాల్లో చూస్తుంటాం. హాలీవుడ్ సినిమాల్లో యూఎస్ ఆర్మీ చేసే అద్భుతమైన పోరాటాలు చూసి.. నిజంగా అలా జరుగుతాయా అనుకుంటాం. బిన్ లాడెన్‌ను పట్టుకున్నప్పుడు ఇలాంటి కథనాలే వచ్చాయి. కానీ ప్రత్యక్షంగా చూసిన సాక్ష్యులెవరూ లేరు. కానీ తాజాగా జరిగిన ఒక కిడ్నాప్ మాత్రం, హాలీవుడ్ సినిమా స్క్రీన్ లాగానే ఉన్నది. […]
అధికారంలో ఉన్నప్పుడు ఎలక్షన్ మేనేజ్‌మెంట్ చేయడం ఎలా ?. ఓటర్లను లొంగదీసుకోవడం ఎలా అన్న దానిపై ఒక పుస్తకాన్నే ప్రచురించేందుకు సిద్ధమైన చంద్రబాబు మొన్నటి ఎన్నికల్లో బొక్కబోర్లా పడ్డా కూడా పద్దతి మార్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నట్టుగా లేదు. తాజాగా ఆయన మరోసారి ఓటర్లను మేనేజ్ చేయడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అనకాపల్లిలో జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలపై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు.. వచ్చే ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై స్పీచ్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల కోసం పెద్ద సెటప్ […]
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో 57 మంది ఎంపీలుగా ఎన్నికయ్యారు. వీరందరిలో ఏపీ, తెలంగాణకు చెందిన ఎంపీలే అత్యంత ఆస్తిపరులు, అప్పులు ఉన్నవారిగా తేలింది. ఈ మేరకు అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ఒక నివేదిక విడుదల చేసింది. ఎలాంటి పార్టీలతో సంబంధం లేని, పక్షపాతం లేని ఒక సలహా సంస్థనే ఏడీఆర్. కొత్తగా ఎన్నికైన ఎంపీల్లో 40 శాతం మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు […]
జాతీయ పార్టీ పెట్టడానికి రంగం సిద్దం చేసుకుంటున్న తెలంగాణ సీఎం కేసీఆర్.. అందుకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ పూర్తి చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో బరిలోకి దిగిన తర్వాత అలుపెరగకుండా, విరామం లేకుండా పోరాడిన కేసీఆర్.. జాతీయ పార్టీ పెట్టిన తర్వాత కూడా దేశమంతా విస్తృతంగా పర్యటించాలని భావిస్తున్నారు. జాతీయ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఆయన పక్కా ప్లానింగ్‌తో ఉన్నట్లు తెలుస్తున్నది. మరోవైపు బీజేపీ, కాంగ్రెస్‌లను జాతీయ స్థాయిలో దీటుగా ఎదుర్కోవలసిన అవసరం ఉన్నది. ఇప్పటికే జాతీయ పార్టీకి […]
మహ్మద్ ప్రవక్త పై బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై అమెరికా ఆలస్యంగా స్పందించింది. నూపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ విలేకరులతో అన్నారు. బీజేపీ కూడా వారి వ్యాఖ్యలను ఖండించినందుకు సంతోషిస్తున్నామని ఆయన తెలిపారు. “మేము మతమూ, విశ్వాసాల స్వేచ్ఛ గురించి, మానవ హక్కుల విషయంపై సీనియర్ స్థాయిలలో భారత ప్రభుత్వంతో క్రమం తప్పకుండా చర్చలు జరుపుతూ ఉంటాము. మానవ […]
నకిలీ ఫింగర్ ప్రింట్స్, బ్యాంక్ అకౌంట్స్ సృష్టించి ఏకంగా రూ. 14.64 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల ఆర్బీఐ తీసుకొచ్చిన ఒక పద్దతిని తమకు అనుకూలంగా మలుచుకున్న ఈ సైబర్ నేరగాళ్లు.. ఫేక్ ఫింగర్ ప్రింట్స్, ఫేక్ సిమ్ కార్డులు తయారు చేసి ఖాతాదారుల బ్యాంక్ అకౌంట్ల నుంచి భారీగా సొమ్మును మళ్లించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. డిజిటల్ లావాదేవీలను ప్రోత్రహించే క్రమంలో ఇటీవల ఆధార్ బేస్డ్ విత్‌డ్రాలను […]
తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆస్తులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు చేస్తోంది. తాడిపత్రిలోని జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసంపై తెల్లవారుజామునే ఈడీ రైడ్ చేసింది. ఇంటి పరిసరాలను తన అధీనంలోకి తీసుకుంది. రావడంతోనే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుటుంబసభ్యుల సెల్‌ఫోన్లను ఈడీ స్వాధీనం చేసుకుంది. లోపలివారు బయటకు, బయటి వారు లోపలికి రాకుండా కట్టుదిట్టం చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుటుంబసభ్యులకు బస్సులు,లారీల వ్యాపారమే కాకుండా విదేశాల్లోనూ వ్యాపారాలున్నాయి. […]
ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో పాస్ పర్సంటేజీ మరీ తక్కువగా ఉండటంతో.. ఫెయిలైన విద్యార్థులకోసం అడ్వాన్స్ సప్లిమెంటరీ నిర్వహిస్తోంది ప్రభుత్వం. వారికి కంపార్ట్ మెంటల్ గ్రేడ్ ఇవ్వబోమని భరోసా ఇచ్చింది. అదే సమయంలో మార్కులు తక్కువగా వచ్చిన విద్యార్థులకు బెటర్మెంట్ అనే ఆప్షన్ కూడా ఇచ్చింది. పదో తరగతి విద్యార్థులకు బెటర్మెంట్ పరీక్షలు నిర్వహించాలని పరీక్షల విభాగానికి పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. కండిషన్స్ అప్లై.. బెటర్మెంట్ అంటున్నారు కానీ ఇక్కడ కండిషన్లు చాలానే […]