డయాబెటిస్ ఉన్నవారు రోజువారీ పనులు, తీసుకునే ఆహారం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండడం అవసరం. అందులోనూ ప్రయాణాలు చేసేటప్పుడు వీరు మరింత కేర్ తీసుకోవాలి. డయాబెటిస్, బీపీ, థైరాయిడ్ లాంటి సమస్యలున్నవారు ప్రయాణాలు చేసే ముందు ఒకసారి డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. డాక్టర్ సలహా మేరకు తగిన జాగ్రత్తలు పాటించడం ద్వారా ప్రయాణాల్లో సేఫ్‌గా ఉండవచ్చు. ఇలా చేయడం వల్ల ప్రయాణాల సమయంలో కొత్త సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. అలాగే రోజువారీ ఆహారంలో కొద్దిపాటి మార్పులు చేసుకోవాడం […]
Author: Sarvi
తెలంగాణ ఏర్పాటు తర్వాత.. ఇప్పటి వరకు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలలో లక్షా 32 వేల ఉద్యోగాలు భర్తీ చేసింది ప్రభుత్వం. కొత్తగా ఇప్పుడు 80 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రైవేట్ సెక్టార్ లో అయితే ఉద్యోగాల భర్తీ భారీ స్థాయిలో జరిగింది. కొత్తగా వచ్చిన పరిశ్రమలు, జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో.. తెలంగాణలో కొత్తగా 16 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. అయితే ఈ కొలువుల జాతర ఇక్కడితో ఆగిపోలేదు, […]
ఆర్మీ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై మంత్రి కేటీఆర్ మరోసారి విరుచుకుపడ్డారు. అగ్నిపథ్ స్కీంకు వ్యతిరేకంగా నరేంద్రమోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో వేల మంది యువకులు కర్రలు చేతబట్టి ర్యాలీ చేస్తున్న వీడియోను కేటీఆర్ రీట్వీట్ చేశారు. రైతులను సంప్రదించకుండా నల్ల చట్టాలు, వ్యాపారులను సంప్రదించకుండా జీఎస్టీ, దేశపౌరుల బాధలను పరిగణలోకి తీసుకోకుండా డిమానిటైజేషన్, మైనార్టీలతో చర్చించకుండా సిఎఎ వంటి నిర్ణయాలను బీజేపీ నియంతృత్వ ప్రభుత్వం తీసుకుని దేశాన్ని సంక్షోభంలోకి నెట్టేసిందని విమర్శించారు. దేశ వ్యాప్తంగా యువత […]
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. శాంతిభద్రతల అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఉంటుందన్నారు. రాష్ట్ర రాజధానిలో కీలకమైన రైల్వేస్టేషన్ వద్దకు అంత మంది వచ్చి విధ్వంసం చేయడాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. విధ్వంసమే పరిష్కారం అయితే ఇక ప్రపంచమే ఉండదన్నారు. రైల్వే పోలీసులు శాంతిభద్రతలను పర్యవేక్షించే అవకాశం ఉండదని, ఇది పూర్తి రాష్ట్ర పరిధిలోని శాంతిభద్రతల అంశమని.. ఈ ఘటనకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. […]
ఆ యువకుడికి మొదటి నుంచి ఆర్మీలో చేరాలనేదే లక్ష్యం. ఊహ తెలిసిన దగ్గర నుంచి స్నేహితులతో కూడా నేను సైనికుడిని అవుతా.. దేశానికి సేవ చేస్తా అనేవాడు. వాళ్ల అక్కకు కూడా జవానుగా ఉద్యోగం రావడంతో అతడికి ఆర్మీ ఉద్యోగం అంటే మరింత ఇష్టంగా మారిపోయింది. రేయింబవళ్లు దాని జపమే చేసేవాడు. కేవలం మాటలతో ఊరుకోలేదు. అందుకు తగ్గట్లుగా శరీరధారుడ్యాన్ని పెంచుకున్నాడు. అవసరమైన విద్యార్హతలు సాధించాడు. కానీ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకం అతడి […]
అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో నిరుద్యోగుల ఆందోళన రణరంగంగా మారింది. రైల్వే స్టేషన్లోకి చొచ్చుకొచ్చిన వేలాది మంది ఆర్మీ ఉద్యోగ అభ్యర్థులు రైళ్లకు నిప్పుపెట్టి అక్కడి ఆస్తులను ధ్వంసం చేశారు. పోలీసులు నిరసనకారులపై లాఠీ చార్జ్ చేసి కాల్పులు జరిపారు. పోలీసుల చర్య వల్ల ఒకరు మృతి చెందినట్టు వార్తలు వస్తున్నాయి. 20 మందికిపైగా తీవ్రగాయాలతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఉదయం 8.30 గంటలకు మొదలైన ఆందోళన ఇంకా కొనసాగుతోంది. ఆందోళనకారుల […]
అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో యువకులు చేపట్టిన ఆందోళన కార్యక్రమం హింసాత్మకంగా మారింది. ఆందోళనలను అణచివేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒక యువకుడు మృతిచెందగా సుమారు 13 మంది గాయపడ్డారు. వీరిలో ఒకరికి బుల్లెట్ గాయాలయ్యాయి. గాయపడినవారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, ఈ ఘటనలకు తమకు ఎలాంటి సంబంధం లేదని ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ స్పష్టంచేశారు. ఆర్మీ నియామక పరీక్షలు రద్దు కావడం వల్ల గత 48 గంటల్లో చాలా […]
కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ పథకం దేశవ్యాప్తంగా అగ్గి రాజేసింది. నిరసనల మంటల్లో పలు రైళ్ళు దగ్ధమై రైల్వేకు తీవ్ర నష్టం వాటిల్లింది. సికింద్రాబాద్ స్టేషన్‌కు సుమారు రూ.20 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లినట్టు ప్రాథమిక అంచనాలు తెలుపుతున్నాయి. స్టేషన్ ప్రాంగణం, పరిసరాలన్నీ రక్తసిక్తమయ్యాయి. ఆందోళనలు తీవ్రమవ్వడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పులో ఒక యువకుడు మరణించగా, డజన్ మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ముందు జాగ్రత్తగా […]
ఏపీలో సినిమా టికెట్ల అమ్మకాలను పూర్తిగా ఆన్ లైన్ చేయాలని భావిస్తున్న ప్రభుత్వం, థియేటర్ల యాజమాన్యాలతో ఒప్పందం కుదుర్చుకోడానికి సిద్ధమైంది. జులై-2 ఎంఓయూ కుదుర్చుకోడానికి ఆఖరు తేదీ. అయితే ఈ ఎంఓయూలో పొందుపరిచిన నియమనిబంధనలు చూసి ఎగ్జిబిటర్లు షాకవుతున్నారు. ఇది ఏమాత్రం తమకు గిట్టుబాటు కాదని వాపోతున్నారు. ఎంఓయూకి ససేమిరా అంటున్నారు. ఒప్పందం కుదుర్చుకోకపోతే థియేటర్ల లైసెన్స్ లు రద్దు చేస్తామంటూ పరోక్ష హెచ్చరికలు చేస్తున్నా యాజమాన్యాలు మెట్టు దిగడంలేదు. ఎందుకీ ఒప్పందం..? ఏపీలో సినిమా టికెట్ […]
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో బాలికపై సామూహిక అత్యాచార ఘటన మరవక ముందే నగరంలో ఒక యువతిపై అత్యాచారం జరగడం కలకలం సృష్టిస్తోంది. పుట్టిన రోజు పార్టీకి రమ్మని ఆ యువతిపై స్నేహితుడే దారుణానికి ఒడిగట్టాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. పోలీసుల కథనం ప్రకారం.. గుజరాత్ కు చెందిన 28 ఏళ్ల యువతి కంటెంట్ రైటర్ గా పనిచేస్తూ ప్రగతినగర్ లోని అపార్ట్ మెంట్ లో ఒంటరిగా నివసిస్తోంది. క్రాంతి అలియాస్ మ్యాక్స్వెల్ […]