ఇకపై ఎన్నికల్లో ఒకటి కంటే మించి స్థానాల్లో పోటీ చేయాలనుకునే రాజకీయ నేతలకు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) చెక్ పెట్టనుంది. ఎక్కువ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్ధులను అనర్హులుగా ప్రకటించాలని లేదా భారీ జరిమానాలు విధించాలని సీఈసీ ప్రతిపాదించింది. ఈ మేరకు ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సవరణలు చేయాలని కేంద్రానికి సూచించింది. ఈ ప్రతిపాదనలపై ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఇటీవల కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ లెజిస్లేటివ్ కార్యదర్శితో చర్చించారు. రాజకీయ నాయకులు ఎన్నికల […]
Author: Sarvi
అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా.. సైనిక శిక్షణ పొందిన అభ్యర్థులు సృష్టించిన విధ్వంసంలో నష్టపోయిన ఆస్తుల విలువ సుమారు రూ.35 కోట్లకు పైగా ఉంటుందని రైల్వే అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. విధ్వంసం చోటు చేసుకున్న రోజున అప్పటికప్పుడే సుమారు రూ.20 కోట్లకు పైగా నష్టం వాటిల్లి ఉండొచ్చని భావించినా పరిశీలనలో నష్టం దాదాపు 35 కోట్లకు మించవచ్చని అధికారులు తెలిపారు. సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకుంటే ఈ నష్టం కూడా మరో నాలుగైదు కోట్ల రూపాయల వరకు […]
అగ్నిపథ్ పథకం కింద సైన్యంలో చేరి నాలుగేళ్ల తరువాత మళ్లీ ఇంటిముఖం పట్టనున్న అగ్నివీరులు టీచర్లుగా మారనున్నారు. ‘రిటైర్మెంట్’ తరువాత వీరిని స్కూళ్లలో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లుగా నియమించే అవకాశాలున్నాయని కేంద్రం ప్రకటించింది. ఈ పథకాన్ని నిరసిస్తూ దేశంలో అనేక చోట్ల యువత హింసాకాండకు దిగుతున్నారని, కానీ ముందుముందు వారి జీవితాన్ని ఉజ్వలంగా మార్చుకునేందుకు ఎన్నో అవకాశాలున్నాయని కేంద్ర యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ అంటున్నారు. నాలుగేళ్ళ అనంతరం అగ్నివీరులు సైన్యం నుంచి […]
అగ్నిపథ్ కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా చెలరేగిన ఆగ్రహ జ్వాలలు కొనసాగుతూనే ఉన్నాయి. సికింద్రాబాద్ లో జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే ఈ ఘటనలో రాకేష్ అనే యువకుడు మరణించగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ) స్పందించింది. మీడియా కథనాలను హెచ్ఆర్సీ సుమోటోగా స్వీకరించింది. ఈ సంఘటనలపై జులై 20 వ తేదీలోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆర్పీఎఫ్, జీఆర్పీ, డీజీపీలను ఆదేశించింది. అగ్నిపథ్ పథకాన్ని వెనక్కి తీసుకోవాలంటూ […]
ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మను తెలంగాణకు తీసుకువచ్చి అరెస్టు చేయాలని ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కోరారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ చొరవ తీసుకోవాలన్నారు. నూపుర్ ని బీజేపీ కాపాడుతోందని, ఆమెను అరెస్టు చేయాలని తాము ప్రధానిని కోరుతున్నా ఆయన ఒక్క మాట కూడా మాట్లాడడంలేదని ఒవైసీ అన్నారు. తమ పార్టీ ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేసిందని, ఎఫ్ఐఆర్ కూడా నమోదైందని ఆయన చెప్పారు. ఇక్కడి […]
ఇప్పటికే అగ్నిపథ్‌పై దేశ యువత రగిలిపోతుంటే కేంద్రమంత్రులు చేస్తున్న ప్రకటనలు మరింతగా వారిని హేళన చేసేలా, రెచ్చగొట్టేలా ఉంటున్నాయి. తమ స్కీంను సమర్థించుకునేందుకు రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. అగ్నిపథ్‌పై మీడియా సమావేశంలో మాట్లాడిన కిషన్ రెడ్డి.. నాలుగేళ్ల తర్వాత అగ్నివీరులకు అనేక అవకాశాలుంటాయని చెప్పారు. అందుకు అవసరమైన నైపుణ్యాన్ని కూడా నేర్పిస్తామన్నారు. అగ్నిపథ్‌లో చేరిన వారికి బట్టలుతకడం, క్షవరం చేయడం వంటి పనులు కూడా నేర్పుతారని.. సైన్యం నుంచి బయటకు వచ్చిన తర్వాత వారు బతకడానికి ఆ […]
”యుద్ధంలో ఎటువైపు ఉంటామో తెలుసుకోవడానికి పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు. యుద్ధంలో ఎటు వైపు ఉంటామో తేల్చుకోవడానికి యుద్ధం మన అనుభవం లోకి రావాలి” అని ఒక తత్వవేత్త అన్నాడు. ఎన్నికలు కూడా యుద్ధమే కనుక యుద్ధానికి బయలుదేరేముందే అసలు మన శత్రువు ఎవరో నిర్ధారించుకోవలసి ఉంది. శత్రువును నిర్ధారించుకోకుండా, అతని బలాబలాలను అంచనా వేయకుండా వెళితే ఓటమి ఎలాగూ తప్పదు. అంతకన్నా ఎక్కువగా పరాభవమూ తప్పదు. ఎవరు ఎవరితో యుద్ధం చేస్తున్నారో, ఎందుకు యుద్ధానికి దిగారో […]
నర్సీపట్నంలో శనివారం అర్ధరాత్రి నుంచి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి ఇంటి వెనక వైపుఉన్న గోడను మునిసిపల్ అధికారులు ఈ తెల్లవారుజామున జేసీబీతో కూల్చేశారు. పంట కాల్వకు సంబంధించిన ప్రభుత్వం భూమిలోని రెండు సెంట్ల భూమిని ఆక్రమించి గోడ నిర్మించారని పేర్కొంటూ మునిసిపల్ కమిషనర్ నోటీసులు ఇచ్చారు. అయితే, వాటిపై ఈ నెల 2వ తేదీన జారీ చేసినట్టు ఉంది. ఆ నోటీసులను ఇప్పుడు ఇచ్చి ఆ […]
మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. గతంలో పవన్ కల్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు.. అప్పట్లో మంత్రి హోదాలో ఉన్న వెల్లంపల్లిపై పవన్ కల్యాణ్ వేసిన సెటైర్లు అందరికీ తెలిసినవే. అయితే వెల్లంపల్లి మంత్రి పదవినుంచి దిగిపోయిన తర్వాత జనసేన వర్సెస్ వెల్లంపల్లి వార్ కాస్త తగ్గింది. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు కౌంటర్లు ఇచ్చే బాధ్యత తాజా మంత్రులు స్వీకరించడంతో వెల్లంపల్లి కాస్త వెనక్కి తగ్గిన పరిస్థితి. అయితే ఇప్పుడు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంతో మళ్లీ […]
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్‌పై దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆర్మీ ఉద్యోగాల కోసం రెండేళ్ల నుంచి సిద్ధమవుతున్న వారికి కేంద్రం తీసుకొచ్చిన స్కీమ్ ఒక్కసారిగా ఆశలు చిదిమేసింది. దీంతో శుక్రవారం దాదాపు వెయ్యి మంది ఆర్మీ ఉద్యోగార్థులు సికింద్రాబాద్ స్టేషన్ వద్దకు చేరుకొని ఆందోళన నిర్వహించారు. ఈ క్రమంలో రైలు బోగీలకు నిప్పంటించడం, పార్సిళ్లను దగ్ధం చేయడం వంటి ఘటనలు జరిగాయి. అంతే కాకుండా వీరిని అడ్డుకోవడానికి వచ్చిన పోలీసులను […]