Author: Sarvi

వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. బుధవారం విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్నది ఆమంచిపై అభియోగం. ఇదివరకే ఒకసారి ఆమంచిని సీబీఐ విచారించింది. ఇప్పుడు మరోసారి నోటీసులు ఇచ్చి విచారణకు రావాల్సిందిగా ఆదేశించింది. డాక్టర్‌ సుధాకర్ కేసును హైకోర్టు సీబీఐకి అప్పగించిన సమయంలో ఆమంచి కృష్ణమోహన్‌ కోర్టు తీర్పుపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. సుధాకర్‌ కేసును సీబీఐకి అప్పగించడంతో ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని విమర్శించారు. […]

Read More

1998 డీఎస్సీ వివాదాన్ని పరిష్కరిస్తూ నాడు ఎంపికైన వారికి పోస్టింగ్ ఇచ్చేలా సీఎం జగన్ ఫైల్‌పై సంతకం చేయడంతో ఆఖరి దశలో అనేక మందికి టీచర్లు అయ్యే అవకాశం దక్కింది. వారిలో చాలా మంది 50ఏళ్లకు పైబడ్డారు. కొందరు నెల,రెండు నెలల్లో రిటైర్ అయ్యే వయసుకు వచ్చారు. 1998 డీఎస్సీ అర్హుల జాబితాలో వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మ శ్రీ పేరు కూడా ఉంది. అప్పట్లో ఆయన ఎంపికైనా వివాదం కారణంగా పోస్టింగ్ ఇవ్వలేదు. తన వయసు […]

Read More

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆందోళన విరమించారు. ఈరోజు నుంచి క్లాసులకు వెళ్లేందుకు సమ్మతించారు. వారం రోజులుగా ట్రిపుల్ ఐటీ విద్యార్థులు చేపట్టిన ఆందోళన కార్యక్రమాలకు గత అర్ధ‌రాత్రి జరిగిన చర్చలు సఫలం కావడంతో శుభం కార్డు పడింది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్వయంగా విద్యార్థులతో చర్చలు జరిపారు. ఒక్కొక్కటిగా సమస్యలన్నిటినీ త్వరితగతిన పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు. మంత్రి హామీతో ఆందోళన విరమిస్తున్నట్టు ప్రకటించారు విద్యార్థులు. అర్ధ‌రాత్రి 12.30నిముషాలకు చర్చలు పూర్తయ్యాయి. ఈరోజునుంచి విద్యార్థులంతా తరగతులకు […]

Read More

అగ్నిపథ్ ఆందోళనల తర్వాత ఆ పథకాన్ని సమర్థిస్తూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇటీలవ కలకలం రేపాయి. అగ్నివీర్ లకు హెయిర్ కటింగ్, బట్టలు ఉతకడం, ఎలక్ట్రికల్ పనులు కూడా నేర్పిస్తారని, సైన్యం నుంచి బయటకొచ్చిన తర్వాత ఆయా నైపుణ్యాలు వారికి ఉపాధిని చూపెడతాయని చెప్పారు కిషన్ రెడ్డి. నిరుద్యోగులను మరీ ఇంత కించపరిచేలా మాట్లాడాలా అంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా మరోసారి అగ్నిపథ్ విషయంలో బుక్కయ్యారు కిషన్ రెడ్డి. అగ్నిపథ్ పథకానికి […]

Read More

టీఆర్ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ తరపున పార్టీలో సంక్షోభ పరిష్కర్తగా కేటీఆర్ అవతరించారు. ఆయన టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేప‌ట్టిన‌నాటి నుంచి వివిధ నియోజకవర్గాల్లో పార్టీ నాయకుల మధ్య తలెత్తిన సమస్యలు, అభిప్రాయ భేదాలను పరిష్కారించడంలో తలమునకలయి ఉన్నారు. 2018 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిస్థితి గందరగోళంగా ఉంది. ఆయా ప్రాంతాల్లో గ్రూపు రాజకీయాలు సాగుతున్నాయి. ఆధిపత్య రాజకీయాలు నడుస్తున్నాయి. టీఆర్ఎస్ పాత నాయకులు, […]

Read More

పాలమూరు జిల్లాకు చెందిన కీలక నేత జూపల్లి కృష్ణారావు ఇంటికి ఇవాళ తెలంగాణ మంత్రి కేటీఆర్ వెళ్లారు. ఇది రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గత కొన్నాళ్లుగా జూపల్లి తన సొంత పార్టీ టీఆర్ఎస్‌తో అంటీముట్టనట్లు ఉన్నారు. తెలంగాణలో కీలకమైన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన జూపల్లి, గతంలో అధికార పార్టీలో మంత్రిగా కూడా పని చేశారు. ఇటీవల జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీకి జూపల్లి హాజరు కాకపోవడతో ఆయన పార్టీని వీడుతున్నారనే వార్తలు వచ్చాయి. టీఆర్ఎస్ అసంతృప్త నేతలైన […]

Read More

అమెరికాలో మళ్ళీ గన్ గర్జించింది. వాషింగ్టన్ లో ఆదివారం రాత్రి జరిగిన కాల్పుల్లో ఓ పోలీసు అధికారి సహా పలువురు గాయపడ్డారు. 15 ఏళ్ళ యువకుడు అక్కడికక్కడే మరణించగా.. ఇతరులను ఆసుపత్రికి తరలించారు.. నగరం నడిబొడ్డునగల జూన్ టీన్త్ మ్యూజిక్ కన్సర్ట్ ప్రాంతంలో హఠాత్తుగా కాల్పుల శబ్దాలు వినిపించాయి. వైట్ హౌస్ కి కేవలం 2 మైళ్ళ దూరంలో ఉందీ ప్రాంతం.. కాల్పులు జరిపిన అనుమానితుడికోసం పోలీసులు గాలింపు ప్రారంభించారు. ఈ ఘటనను డీసీ పోలీస్ యూనియన్ […]

Read More

దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థలను అడ్డుఅదుపు లేకుండా అమ్మేస్తున్న కేంద్రం ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణకు గర్వకారణమైన కంపెనీలపైనా కన్నేసింది. బహిరంగ మార్కెట్‌లో వేల కోట్ల విలువ చేసే భూములున్న సంస్థల ఆస్తులను తమకు ఇష్టులైన ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు కేంద్రం పావులు కదుపుతోందన్న వార్తలొస్తున్నాయి. ఈ ప్రయత్నాలను తెలంగాణ మంత్రి కేటీఆర్‌ తీవ్రంగా వ్యతిరేకించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మాల సీతారామన్‌కు లేఖ రాశారు. అందులో పలు కీలకమైన అంశాలను కేటీఆర్‌ ప్రస్తావించారు. తెలంగాణలో ప్రస్తుతం […]

Read More

ఇతిహాస క్రీడ చదరంగానికి, భారత్ కు అవినాభావ సంబంధమే ఉంది. వేల సంవత్సరాల క్రితమే భారతగడ్డపై రూపుదిద్దుకొన్న మేధో క్రీడ చదరంగం ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ప్రపంచ వ్యాప్తంగా 180కి పైగా దేశాలకు విస్తరించింది. అంతర్జాతీయ క్రీడాంశాలలో ఓ ప్రధాన క్రీడగా ఉన్న చదరంగం పురుషుల, మహిళల వ్యక్తిగత పోటీలతో పాటు… టీమ్ విభాగంలో సైతం అంతర్జాతీయ చదరంగ సమాఖ్య పోటీలు నిర్వహిస్తూ వస్తోంది. వివిధ దేశాలకు చెందిన జాతీయ జట్ల మధ్య రెండేళ్లకోమారు..చెస్ ఒలింపియాడ్ పేరుతో […]

Read More

ఎన్ కౌంటర్ లో నక్సలైట్లు మరణం , ఉగ్రవాదులు మరణం, పోలీసుల మరణం లాంటి వార్తలు మనం రోజూ చూస్తూనే ఉంటాం. అయితే ఎన్ కౌంటర్ లో కోతి మృతి చెందిన ఘటన ఆశ్చర్యకరంగానే ఉంది. అందులోనూ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ తొడుకున్న ఓ కోతి పోలీసు ఎన్ కౌంటర్ లో చనిపోయింది. మెక్సికోలో డ్రగ్స్ సాయుధ గ్యాంగులకు పోలీసులకు రోజూ ఎక్కడో ఓ చోట ఎన్ కౌంటర్లు జరుగుతూనే ఉంటాయి. అలాగే ఈ నెల 17న […]

Read More