స్త్రీ గర్భం దాల్చడం, బిడ్డకు జన్మనివ్వటం, పిల్లలను పెంచడం… అనేవి మానవజాతిని ముందుకు తీసుకు వెళ్లే సహజమైన అంశాలే అయినా… అవి పూర్తిగా ఆమె వ్యక్తిగత విషయాలుగా భావించడం చాలా సందర్భాల్లో చూస్తున్నాం. ఆయా సమయాల్లో ఆమె ఎదుర్కొంటున్న వివక్షే ఇందుకు ఉదాహరణ. ఇటీవల ఇండియన్ బ్యాంక్ సైతం అలాంటి వివక్షని చూపిస్తూ ఒక నూతన రిక్రూట్ మెంట్ నిబంధనని విధించింది. ఆ నిబంధన మేరకు మూడు లేదా అంతకంటే ఎక్కువ నెలల గర్భవతులైన స్త్రీలను … […]
Author: Sarvi
కరోనా పాజిటీవ్ కేసులు మళ్ళీ పెరిగిపోతున్నాయి. తెలంగాణాలో యాక్టీవ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం మళ్లీ ఆంక్షలు విధించింది. వైద్య ఆరోగ్య శాఖ ప్రజలు తప్పని సరిగా పాటించవల్సిన కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. 10 ఏళ్ల లోపు వయసున్న చిన్నారులు, 60 ఏళ్లకు పైబడిన వృద్ధులు తప్పనిసరి అయితేనే బయటికి వెళ్లాలి. 20 నుంచి 50 ఏళ్ల లోపు వారికి కరోనా ఎక్కువ సోకుతుందని వెల్లడైంది కాబట్టి, ఆయా వ్యక్తులు ఉద్యోగాలకు, ఉపాధికి, ఇతర […]
పేదలు చదువుకుంటే చంద్రబాబుకి మనసొప్పదని, అందుకే ఆయన అన్ని పథకాలకు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు మంత్రి ఆదిమూలపు సురేష్. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు సీఎం జగన్ కృషి చేస్తుంటే.. చంద్రబాబు, టీడీపీ నాయకులు అడ్డంకులు సృష్టిస్తున్నారని అన్నారాయన. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకోసం బైజూస్ తో ఒప్పందం చేసుకుంటే.. బాబుకి కడుపుమంట ఎందుకని నిలదీశారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు కొమ్ము కాస్తూ.. ప్రభుత్వ స్కూళ్లను ఆయన చులకనగా చూస్తున్నారని మండిపడ్డారు. ధనవంతులకే సొంతమైన ‘ఎడ్యు టెక్’ను ప్రభుత్వ […]
టీఆరెస్ ఐటీ సెల్ కన్వీనర్ వై సతీష్ రెడ్డి(YSR), టీఆరెస్ ఎన్ ఆర్ ఐ సెల్ లండన్ విభాగం అధ్య క్షుడిగా ఉన్న అనీల్ కూర్మాచలం లను తెలంగాణ ప్రభుత్వం కార్పోరేషన్ పదవుల్లో నియమించింది. తెలంగాణ చలనచిత్ర,టెలివిజన్, థియేటర్ అభివృ ద్ధి సంస్థ (FDC) ఛైర్మన్ గా అనిల్ కుర్మా చలాన్ని, తెలంగాణ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (TS REDCO) ఛైర్మెన్ గా వై సతీష్ రెడ్డిని నియమించారు. ఈ మేరకు రాష్ట్ర […]
టాలీవుడ్ లో కార్మికులు సమ్మెకు నడుం బిగించారు రేపటి నుంచి(22జూన్) షూటింగులు బంద్ చేయనున్నారు. కరోనా కారణంగా ప్రతి వస్తువు రేటు పెరిగింది. కానీ సగటు మనిషి జీవన ప్రమాణం మాత్రం పెరగలేదు. దీంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత కొంత కాలంగా సినీ కార్మికులు కూడా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కనీస వేతనం అమలు చేయాలని వారు కొంతకాలంగా నిర్మాతలను డిమాండ్ చేస్తున్నారు. సినిమా బడ్జెట్లు పెరిగినా, నటులకు రెమ్యూనరేషన్లు పెరిగినా తమకు మాత్రం […]
దమ్ముంటే తన మీద కేసులు పెట్టాలని ఇంజినీర్లు, చిన్నా చితకా కార్మికులపై కాదంటూ రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. ప్రజల సౌకర్యంకోసం ఐడీపీఎల్ దగ్గర రోడ్డు వేస్తుంటే కేసులు పెట్టాలని కేంద్రమంత్రి ఆదేశాలిస్తున్నారు అని కేటీర్ మండిపడ్డారు. మంచి చేయరు చేస్తున్నవాళ్ళను అడ్డుకుంటారని బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. ఆ కేంద్రమంత్రికి చేతనైతే కంటోన్మెంట్ తో సహా హైదరాబాద్ నుండి కరీంనగర్, రామగుండం, ఆదిలాబాద్ వెళ్లే మార్గంలో రక్షణ రంగానికి […]
హైదరాబాద్ కి కూతవేటు దూరంలో.. మొయినాబాద్ లోని ఓ ఫామ్ హౌస్ లో 10మంది పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా కాంగ్రెస్ నాయకులని తేల్చారు. అందులో కీలకమైన వ్యక్తి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడు ఎలుగంటి మధుసూదన్ రెడ్డి. ఆయన టీపీసీసీ సెక్రటరీ కూడా. పట్టుబడింది కాంగ్రెస్ నేతలు కావడంతో ఈ వ్యవహారం స్థానికంగా కలకలం రేపింది. మొయినాబాద్ లో ఉన్న సురభి ఎన్ క్లేవ్ అనే ఫామ్ హౌస్ లోని ఓ […]
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ హైకమాండ్ భారీ కసరత్తు చేస్తోంది. అందులో భాగంగానే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ వేదిక కావడం ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం వ్యక్తమవడం సహజం. మోదీ, అమిత్ షా తదితర హేమాహేమీలు తరలిరానున్నారు. మూడురోజుల పాటు వాళ్ళు ఇక్కడే మకాం వేయనున్నారు. దేశవ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్లేందుకు బ్లూ ప్రింట్ సిద్ధం చేయడానికి పార్టీ ఉన్నతస్థాయి సమావేశం తలపెట్టారు. జాతీయ కార్యవర్గ సమావేశాలకు గాను తెలంగాణను వ్యూహాత్మకంగానే బీజేపీ ఎంపిక చేసింది. […]
నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికలో ప్రచార పర్వానికి తెరపడింది. సాయంత్రం 6 గంటలకు మైక్ లు మూగబోయాయి. స్థానికేతర నాయకులెవరూ నియోజకవర్గ పరిధిలో ఉండటానికి వీల్లేదంటూ అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో.. ఎక్కడివారక్కడ తమ సొంత ప్రాంతాలకు పయనమయ్యారు. ఉప ఎన్నికలో మొత్తం 14మంది బరిలో ఉండగా.. ఈనెల 23న పోలింగ్ జరగాల్సి ఉంది. 26వ తేదీన కౌంటింగ్, అదే రోజు ఫలితాలు వెలువడతాయి. లక్ష టార్గెట్..! ఆత్మకూరు ఉప ఎన్నికను అధికార వైసీపీ ప్రతిష్టాత్మకంగా […]
రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్‌ఎస్ స్పష్టమైన వైఖరి తీసుకుంది. బీజేపీతో ఢీ అంటే ఢీ అంటున్న కేసీఆర్.. రాష్ట్రపతి ఎన్నికల్లోనూ ఎన్‌డీఏకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం ఎవర్నీ సంప్రదించకుండా మమతా బెనర్జీ ఏర్పాటు చేసిన భేటీని గతంలో టీఆర్‌ఎస్ వ్యతిరేకించింది. నిర్ణయం తీసుకుని దాన్ని తమపై రుద్దుతామంటే అంగీకరించబోమంటూ ఆ భేటీని టీఆర్‌ఎస్ బహిష్కరించింది. కాంగ్రెస్‌తో వేదిక పంచుకునేందుకు టీఆర్‌ఎస్ అంగీకరించలేదు. దాంతో టీఆర్ఎస్ రాష్ట్రపతి ఎన్నికల్లో ఏ పక్షాన ఉంటుందన్న దానిపై […]