ఓ నిందితుడికి స్టేషన్ బెయిల్ ఇప్పించేందుకు మంత్రి గంగుల కమలాకర్ పీఆర్వో మల్లికార్జున్ డబ్బులు డిమాండ్ చేసిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో మంత్రి ఆ పీఆర్వో ను ఉద్యోగంలోంచి తొలగించారు. కరీంనగర్‌లో అనుమతులు లేని తాగునీటి శుద్ధి కేంద్రాలను తనిఖీ చేసిన అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన వాటిపై కేసులు నమోదు చేశారు. ఇలాంటి ఒక కేసులో అరెస్ట్ అయిన బాధితుడికి స్టేషన్ బెయిల్ ఇప్పిస్తానంటూ మల్లికార్జున్ అతనికి ఫోన్ చేశాడు. ఆ […]
Author: Sarvi
ఈరోజే ఆత్మకూరు ఉప ఎన్నిక. ఉదయం 6 గంటలనుంచి 7 గంటల వరకు మాక్ పోల్. ఉదయం 7 గంటలనుంచి సాయంత్రం 6 గంటల వరకు అసలైన పోలింగ్. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో అధికార పార్టీ తరపున మేకపాటి గౌతమ్ రెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డి బరిలో ఉన్నారు, ఆయనకు ప్రధాన ప్రత్యర్థిగా బీజేపీ తరపున భరత్ కుమార్ పోటీలో నిలిచారు. మొత్తం 14మంది అభ్యర్థులు ఈరోజు ఉప ఎన్నికల పోటీలో ఉన్నారు. 2,13,338 మంది […]
ఏపీలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ లకు సంబంధించి స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డు (SIPB) కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం జగన్ అధ్యక్షతన సమావేశమైన SIPB అదానీ గ్రీన్ ఎనర్జీ సంస్థ రూ.15,376 కోట్ల వ్యయంతో ప్రతిపాదించిన పంప్డ్ స్టోరేజ్ విద్యుదుత్పత్తి కేంద్రంతో పాటు పలు ఇతర ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఏపీలో గ్రీన్ ఎనర్జీ ద్వారా కాలుష్య రహిత ఇంధన వినియోగంతోపాటు, రైతులకు కూడా మేలు జరుగుతుందని చెప్పారు అధికారులు. భూములిచ్చే రైతులకు ఏడాదికి […]
కొడుకు తాగుబోతు అయినంత మాత్రాన మద్యనిషేధంపై ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు ఓ వృద్ద జంటకు తేల్చి చెప్పింది. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన రామచంద్రగౌడ్ దంపతుల కొడుకు శ్రీధర్ గౌడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. మద్యానికి భానిసైన ఆయన భార్యను వదిలేశాడని, వృద్దులమైన తమను కూడా రోజూ వేధిస్తున్నాడని అందువల్ల మద్య నిషేధం విధించాలని హైకోర్టు గడప తొక్కారు రామచంద్రగౌడ్ దంపతులు. ఈ పిల్ పై విచారణ జరిపిన హైకోర్టు మద్య నిషేధం పై ఉత్తర్వులు ఇవ్వడం కోర్టు […]
జహీరాబాద్ లో ఉన్న మహీంద్రా ట్రాక్ట్రర్ తయారీ కంపెనీ 3,00,001 ట్రాక్టర్లను తయారు చేసిన సందర్భంగా మూడు లక్షల ఒకటో ట్రాక్ట్రర్ ను తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌మెంట్, పరిశ్రమలు & వాణిజ్య శాఖల మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమలు & వాణిజ్యం మరియు ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, పార్లమెంటు సభ్యులు పాటిల్. ఎమ్మెల్యే మాణిక్ రావు, మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ ఫార్మ్ ఎక్విప్‌మెంట్ […]
ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించడానికి ముందే ఒక వర్గం తెలుగు మీడియా చానళ్లు.. వెంకయ్యనాయుడిని రేసులో ముందుంచే ప్రయత్నాలు చేశాయి. ఎన్‌డీఏ అభ్యర్థిగా వెంకయ్యనాయుడు రేసులో ముందున్నారని ప్రచారం చేసింది మీడియా. వెంకయ్యనాయుడిని అభ్యర్థిగా ప్రకటిస్తే టీఆర్‌ఎస్‌తో సహా అనేక పార్టీలు బేషరతుగా మద్దతు ఇస్తాయని.. అసలు పోటీనే లేకుండా గెలిచేస్తారని ఎన్‌డీఏ పెద్దలకు తెలుగు మీడియా తెలుగులో కథనాల ద్వారా తెలియజేసే ప్రయత్నం చేసింది. మంగళవారం వెంకయ్యనాయుడుని అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా […]
ఏపీలో అభివృద్ధి పనులు ముందుకు సాగనీయకుండా ప్రతిపక్షాలు రకరకాల కుట్రలు పన్నుతున్నాయని విమర్శించారు సీఎం జగన్. రాష్ట్ర ప్రభుత్వానికి రుణాలు లభించకూడదని, కేంద్రం నుంచి డబ్బులు రాకూడదని, కేసుల ద్వారా అడ్డుకోవాలని, తద్వారా అభివృద్ధి పనులు ఆగిపోవాలని ప్రతిపక్షాలు ఒకే అజెండాతో పనిచేస్తున్నాయని మండిపడ్డారు. అయినా కూడా పట్టువిడవకుండా.. అభివృద్ధి సంకల్పంతో అడుగులు వేస్తూ ముందుకెళ్తున్నామని చెప్పారాయన. ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకున్న రంగాల్లో అభివృద్ధి పనులకు ఎక్కడా నిధులకు లోటు రాకుండా, చెల్లింపుల సమస్యలేకుండా చూస్తున్నామని వివరించారు. […]
తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అందరూ సంతోషంగా ఉన్నారని చెప్పారు మంత్రి కేటీఆర్. జహీరాబాద్ లో పర్యటించిన ఆయన.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. జహీరాబాద్ లోని నిమ్జ్ లో వీఈఎం పరిశ్రమ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ భూమిపూజ చేశారు. వెమ్ టెక్నాలజీస్ రాష్ట్రానికి రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటుతో 2 వేల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. ప్రతి కుటుంబంలో సంతోషం.. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో ప్రతి కుటుంబంలో […]
రాష్ట్రపతి ఎన్నికల హడావుడి మొదలైన తొలిరోజుల్లో కాస్త నెమ్మదిగానే కదిలిన తెలుగు మీడియా చానళ్లు, టీడీపీ.. గత రెండు మూడు రోజుల నుంచి మాత్రం వెంకయ్యనాయుడు పక్షాన రంగంలోకి దిగాయి. వెంకయ్యనాయుడు రేస్‌లో ముందున్నారంటూ మీడియా ప్రచారం చేసింది. సోమిరెడ్డి లాంటి టీడీపీ నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. వెంకయ్యనాయుడునే రాష్ట్రపతి చేయాలని డిమాండ్ చేశారు. వెంకయ్యనాయుడు మచ్చలేని వ్యక్తి అని, ఆయన్ను బరిలోకి దింపితే ఇతర పార్టీలు పోటీకి అభ్యర్థిని కూడా నిలబెట్టవని, ఏకగ్రీవంగా […]
అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్బంగా నివాళులర్పించేందుకు ప్రధాని నరేంద్రమోడీ ఏపీ వస్తున్న సమయంలో తనను అరెస్ట్ చేయడం లాంటి చిల్లర వేషాలు వేయవద్దని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు ఎంపీ రఘురామకృష్ణంరాజు. ప్రధాని మోడీ అల్లూరికి నివాళులర్పించే ఏర్పాటు చేసిన కార్యక్రమం తన సొంత ఊరిలో, తన ఇంటికి 300 మీటర్ల దూరంలో జరుగుతుందని రఘురామ చెప్పారు. అలాంటి కార్యక్రమంలో స్థానిక ఎంపీగా పాల్గొనే హక్కు తనకుందన్నారు. కేసులు పెట్టాలనుకుంటే ముందే పెట్టాలని.. వాటిపై తాను కోర్టుకు […]