Author: Sarvi

భార‌తీయ జ‌న‌తా పార్టీ (బిజెపి) ‘మిష‌న్‌-7’ లో భాగంగా రాష్ట్ర‌ల్లో ఆధిప‌త్యం చాటాల‌ని ల‌క్ష్యంగా ఎన్నుకున్నా ఒక్క‌దానిలో మిన‌హా ఎక్క‌డా నేటికీ పాగా వేయ‌లేక‌పోయింది. దేశంలోనే అతి చిన్న దక్షిణాది రాష్ట్రంగా ఉన్న తెలంగాణతో పాటు ఈ “మిషన్-7″లో అస్సాం, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ వంటి ఏడు రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలని 2014లోనే పార్టీ ప్లాన్ చేసింది. అయితే అస్సాం మినహా ఈ అన్ని రాష్ట్రాల్లో దాని పాచిక పార‌లేదు. హైదరాబాద్‌లో వ‌చ్చేనెల […]

Read More

విజయవాడ ఎంపీ కేశినేని నాని పరోక్షంగా టీడీపీ అధినాయకత్వానికి వార్నింగ్ ఇచ్చారు. కేశినేని నాని పదేపదే అలగటం, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని చెప్పడం, పరోక్షంగా పార్టీ నాయకత్వంపైనా విమర్శలు చేయడం వంటి పనులు చేస్తున్ననేపథ్యంలో ఇటీవల విజయవాడలో కేశినేని నాని సోదరుడు కేశినేని శివనాథ్ అలియాస్ కేశినేని చిన్నిని టీడీపీ నాయకత్వం ప్రోత్సహిస్తోంది. వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా కేశినేని చిన్నినే పోటీ చేస్తారన్న ప్రచారం ఊపందుకుంది. అందుకు తగ్గట్టుగానే కేశినేని నానితో సంబంధం లేకుండా […]

Read More

ముఖ్యమంత్రిగా పనిచేసిన 14 ఏళ్లలో.. 60 ప్రభుత్వ రంగ సంస్థలను మూసేసిన చరిత్ర చంద్రబాబుదని మండిపడ్డారు వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి. కొత్త ఉద్యోగాలు ఇవ్వకుండా, ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టిన అభినవ పులకేశి బాబు అని విమ‌ర్శించారాయన. వైసీపీ హయాంలో మూడేళ్లలోనే అన్ని రంగాలను అభివృద్ధి చేసి 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని, ఆ ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని అన్నారు విజయసాయి. వైసీపీ జాబ్ మేళాలకు విశేష స్పందన.. ప్రైవేటు కంపెనీల భాగస్వామ్యంతో వైఎస్ఆర్ […]

Read More

అమెరికాలో మహిళలు అబార్షన్‌ చేయించుకునేందుకు 50ఏళ్లుగా ఉన్న రాజ్యాంగపరమైన రక్షణకు ముగింపు పలుకుతూ అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై అమెరికా వ్యాప్తంగా నిరసనలు తీవ్రస్థాయిలో వ్యక్తమవుతున్నాయి. యూఎస్‌ ప్రెసిడెంట్ జో బైడెన్‌ కూడా ఈ తీర్పుపై తీవ్రంగా స్పందించారు. మాజీ అధ్యక్షుడు ఒబామా, ఆయన సతీమణి మిషెల్లి, ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ కూడా తీర్పుపై ఆందోళన వ్యక్తం చేశారు. ట్రంప్ మాత్రం స్వాగతించారు. అమెరికాలో మహిళలు ముఖ్యంగా యువతులు […]

Read More

హైదరాబాద్‌లో నాలుగు రోడ్ల కూడలిలో రెడ్ సిగ్నల్ పడిందంటే.. అప్పుడే సిగ్నల్ దగ్గరకు వచ్చిన వాహనం డ్రైవర్ మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ప్రయాణం 10 నిముషాలు ఆలస్యం అవుతుందని మెంటల్ గా ప్రిపేర్ అవుతారు. మిగతా మూడు రోడ్లపై వాహనాలు తక్కువగా ఉన్నా.. తన సమయం వచ్చే వరకు వేచి చూడాల్సిందే. వాహనాలు లేవు కదా అని పొరపాటున సిగ్నల్ జంప్ అయితే చలానా మోత మోగిపోతుంది. అందుకే తిట్టుకుంటూ జంక్షన్లో బండిపై […]

Read More

ఎస్వీబీసీ చైర్మన్ పదవి చేపట్టి ఒక మహిళతో అనుచితంగా ప్రవర్తించారన్న ఆరోపణలతో పదవి వదులుకున్న నటుడు ఫృథ్వీరాజ్ వైసీపీపై దాడి తీవ్రతరం చేశారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో వైసీపీ గురించి, అక్కడ తనకు ఎదురైన అనుభవాలను వివరించారు. ఒక వ్యక్తి తన బుర్రను పాడు చేశారని, అతడి మాటలు వినే వైసీపీలో చేరానని చెప్పారు. సదరు వ్యక్తి కూర్చోబెట్టుకుని, పాకిస్తాన్‌లో ఉగ్రవాదులకు నూరిపోసినట్టుగా తనకు నూరిపోశారన్నారు. వైసీపీ ఒక ఉగ్రవాద శిక్షణ కేంద్రం లాంటిదన్నారు. ఆ పార్టీలోకి […]

Read More

తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాష కోసం ఉద్యమాలు చేయాల్సిన దుస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌ వీ రమణ. అమెరికా న్యూజెర్సీలో తెలుగు కమ్యూనిటీ ఆఫ్ నార్త్ అమెరికా ఆధ్వర్యంలో జరిగిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ప్రసంగించిన సీజేఐ.. తెలుగుభాష అనేక అటుపోట్లను తట్టుకుని నిలబడిందన్నారు. మారుతున్న పరిస్థితుల్లో తెలుగుతో పాటు ఇతర భాషలను నేర్చుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. అప్పుడే ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడి ప్రజలతో కలిసి జీవించడం సాధ్యమవుతుందన్నారు. […]

Read More

ఈ ఏడాది నుంచి తెలంగాణలో ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం బోధన మొదలవుతోంది. ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుందనే అనుమానాలు మొదట్లో ఉన్నా.. అడ్మిషన్ల విషయంలో మాత్రం ఇంగ్లిష్ మీడియం ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా సర్కారు బడుల్లో అడ్మిషన్లు భారీగా పెరిగాయి. గతంలో విద్యార్థులు లేక మూతపడే స్థితిలో ఉన్న స్కూల్స్ కూడా ఇప్పుడు పిల్లలతో కళకళలాడుతున్నాయి. ఏ జిల్లాలో ఎలా..? తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్స్‌ భారీగా పెరిగాయి. ఈ ఏడాది ప్రభుత్వ […]

Read More

తమకు అనుకూలంగా రిపోర్ట్ లు ఇవ్వనప్పుడు కేంద్ర సంస్థల్ని తప్పుబట్టడం టీడీపీకి అలవాటేనన్నారు ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. టీడీపీ హయాంలో అప్పుడు సీబీఐని తప్పుబట్టారని, ఇప్పుడు కాగ్ రిపోర్ట్ ని కూడా తప్పు అంటున్నారని మండిపడ్డారు. టీడీపీ హయాంలోకంటే ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మిన్నగా ఉందని, అప్పుల విషయంలో గతంలో టీడీపీ చేసిన తప్పులన్నిటినీ సరిదిద్దుకుంటూ వస్తున్నామని చెప్పారు. ఎల్లో మీడియాని అడ్డు పెట్టుకుని టీడీపీ చేస్తున్న దుష్ప్రచారం సరికాదంటూ విమర్శించారు. కోవిడ్‌ […]

Read More

కులం, మతం గురించి తనకు తెలియదని.. అభివృద్ధి తన కులం, సంక్షేమం తన మతం అని చెప్పారు మంత్రి కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న జిల్లా రెడ్డి సంఘం భవనానికి భూమిపూజ చేశారు కేటీఆర్. రెడ్డి సంఘం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుకి కృషి చేస్తానని, వారి డిమాండ్ ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. వైశ్య, రెడ్డి కార్పొరేషన్ల ఏర్పాటు త్వరలోనే సాధ్యమవుతుందని […]

Read More