Author: Sarvi

సీనియర్ నటి మీనా కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. మీనా భర్త విద్యాసాగర్‌ కన్నుమూశారు. అతడి వయసు 48ఏళ్లు. 2009లో మీనా, విద్యాసాగర్ వివాహం చేసుకున్నారు. విద్యాసాగర్‌ది బెంగళూర్‌. కొన్నేళ్లుగా విద్యాసాగర్‌ ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు. క్రమం తప్పకుండా చికిత్స తీసుకుంటున్నారు. పావురాల రెట్ట వల్ల ఫంగస్, బాక్టీరియా వ్యాపిస్తుంటుంది. దాన్ని పీల్చిన వారిలో కొందరికి ఊపిరితిత్తుల వ్యాధులు వస్తుంటాయి. విద్యాసాగర్‌ది అలాంటి సమస్యేనని వైద్యులు గుర్తించారు. ఈ ఏడాది జనవరిలో కుటుంబసభ్యులంతా కోవిడ్ బారినపడ్డారు. అందరూ […]

Read More

తెలుగుదేశం పార్టీ ఇటీవలే ఒంగోలులో మహానాడును భారీ ఎత్తున నిర్వహించింది. అధికార వైసీపీపై మరింత దూకుడుగా వెళ్లాలని అధినేత చంద్రబాబు ఆ సమావేశంలో నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కానీ, మహానాడు పూర్తయిన తర్వాత కొంత మంది టీడీపీ నేతలు గడప కూడా దాటలేదు. మరోవైపు ‘గడప గడపకు’ పేరుతో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు చేరువ అవుతోంది. ఒకప్పుడు టీడీపీకి కంచుకోటలా ఉన్న ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపి తిరిగి పుంజుకోలేక పోతుంటే.. వైసీపీ ఎమ్మెల్యేలు దూకుడుగా […]

Read More

రఘురామకృష్ణంరాజును టీవీ చర్చలకు పిలవద్దని కోరుతూ పార్లమెంట్ వ్యవహారాలను ప్రసారం చేసే సంసద్‌ టీవీకి వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి లేఖ రాశారు. సంసద్‌ టీవీ చర్చలకు రఘురామకృష్ణంరాజును పిలుస్తూ ఆయన్ను వైసీపీ ఎంపీగా చూపుతున్నారని చానల్‌ సీఈవోకు రాసిన లేఖలో విజయసాయిరెడ్డి అభ్యంతరం తెలిపారు. రఘురామకృష్ణంరాజు ఏపీ ప్రభుత్వ అభిప్రాయాలకు, వ్యవహారాలకు ప్రాతినిధ్యం వహించడం లేదన్నారు. రఘురామపై అనర్హత వేటు పిటిషన్‌ స్పీకర్‌ వద్ద పెండింగ్‌లో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. కాబట్టి రఘురామ […]

Read More

వైసీపీ ప్లీనరీ సమావేశాల్లో టీడీపీపై విరుచుకుపడుతున్నారు నేతలు. తాజాగా సత్యసాయి జిల్లాలో జరిగిన ప్లీనరీ సమావేశంలో.. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నత్తోడు లోకేష్ పాదయాత్ర చేసినా, తిక్కలోడు పవన్ కళ్యాణ్ బస్ యాత్ర చేసినా, ముసలోడు చంద్రబాబు కాశీ యాత్ర చేసినా జగన్ జైత్ర యాత్రను ఎవరూ ఆపలేరని చెప్పారాయన. స్కూల్ లీడర్ గా కూడా గెలవలేని లోకేష్ ని, వార్డు మెంబర్ గా కూడా గెలవలేని లోకేష్ ని, మంత్రిని […]

Read More

కరోనా మహమ్మారితో అతలాకుతలమైన ప్రపంచంపై అంత కన్నా తీవ్రమైన మరో మహమ్మారి దాడి చేయబోతోందని బ్రిటన్ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. టెలిగ్రాఫ్ పత్రిక నివేదిక ప్రకారం బ్రిటన్ నిపుణులు ‘డిసీజ్ ఎక్స్’ మహమ్మారి గురించి హెచ్చరికలు జారీ చేశారు. లండన్‌లోని మురుగునీటి నమూనాలలో పోలియోవైరస్ కనుగొనబడిన నేపథ్యంలో ‘డిసీజ్ ఎక్స్’ గురించి ఆరోగ్య నిపుణుల హెచ్చరిక వచ్చినట్లు రాయిటర్స్ రిపోర్ట్ చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, డిసీజ్ X అనేది తీవ్రమైన వ్యాధికి కారణమవుతుందని ప్రస్తుతం […]

Read More

వైసీపీ అనుబంధ విభాగాల అధ్యక్ష పదవులను భర్తీ చేశారు సీఎం జగన్. మొత్తం 24 విభాగాలకు అధ్యక్షులను నియమించారు. కీలకమైన ఐటీ విభాగానికి పోశింరెడ్డి సునీల్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. నెల్లూరు జిల్లాకు చెందిన పోశింరెడ్డి సునీల్ కి జగన్ తో వ్యక్తిగతంగా మంచి అనుబంధం ఉంది. ఆ సన్నిహిత సంబంధాల వల్లే జగన్ ఆయనకు ఐటీ వంటి కీలక విభాగాన్ని అప్పగించారని తెలుస్తోంది. సోషల్ మీడియాలోయాక్టివ్ గా ఉంటూ, పార్టీ కార్యకలాపాలలో చురుగ్గా ఉండే సునీల్ ఇప్పుడు […]

Read More

సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై ఏపీ ప్రభుత్వం మరోసారి కొరడా ఝులిపించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇటీవలే ఆయనను ప్రింటింగ్ స్టేషనరీ, స్టోర్స్ విభాగం కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది. ఇలా నియమించిన 15 రోజులకే ఆయన్ను మరోసారి సర్వీస్ నుంచి సస్పెండ్ చేసింది ప్రభుత్వం. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్ కాలంలో అనుమతి లేకుండా విజయవాడ విడిచివెళ్లవద్దని ప్రభుత్వం ఆదేశించింది. తన ప్రస్తుత హోదా ద్వారా […]

Read More

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకం చాలా మంది జీవితాల్లో వెలుగులు నింపుతోంది. అర్హులైన దళితులు వ్యాపారం చేసుకోవడానికి పెట్టుబడి సాయంగా రూ. 10 లక్షలు ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. హుజూరాబాద్ ఎన్నికల సమయంలో పైలెట్ ప్రాజెక్టుగా మొదలైన ఈ పథకం సూపర్ సక్సెస్ కావడంతో ఇప్పుడు అన్ని నియోజకవర్గాల్లో అమలు చేస్తున్నారు. మొదటి విడతలో రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గంలో 100 యూనిట్ల చొప్పున లబ్దిదారులకు అందిస్తున్నారు. ఈ క్రమంలో నిన్నటి […]

Read More

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దిగజారిపోయాడని మాజీ మంత్రి, కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షుడు పేర్ని నాని ఆరోపించారు. ‘జగన్‌ను దించేస్తా.. నేను సీఎం అవుతా అంటూ చంద్రబాబు సవాళ్లు విసిరాడు. కానీ ఇప్పుడు దిగజారిపోయి .. గుడివాడలో కొడాలిని ఓడిస్తాననే స్థాయికి దిగజారాడు. ముందుకు ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలో పరిస్థితి చూసుకోవాలి. ఇప్పటికే అక్కడ పునాదులు కదిలాయి. అది మరిచిపోయి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఇక కొడాలి నాని పరిస్థితి గతంలోలా ఇప్పుడు లేదు. […]

Read More

కల్వకుంట్ల తారక రామారావు.. మీడియా, పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలందరూ కేటీఆర్‌గా పిలిచే నాయకుడు. తెలంగాణ ఉద్యమ సమయంలో తండ్రి వెనుక అడుగులు వేస్తూ వచ్చిన కేటీఆర్.. ఇవ్వాళ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, తెలంగాణ మంత్రిగా రెండు పాత్రలనూ సమర్థ‌వంతంగా పోషిస్తున్నారు. రాష్ట్రంలో కేసీఆర్ తర్వాత అంతటి క్రేజ్ ఉన్న నాయకుడిగా ఎదిగారు. ముఖ్యంగా యువతలో కేటీఆర్‌కు ఉన్న క్రేజ్, ఫాలోయింగ్ ఏ సినిమా హీరోకు కూడా తగ్గకుండా […]

Read More