బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కి ప్రభుత్వం షాకిచ్చింది. జమున హ్యాచరీస్ పేరుతో ఆక్రమించుకున్నారని ఆరోపణలున్న భూముల్ని ప్రభుత్వం రైతులకు పంపిణీ చేసింది. అసలు ఈ కబ్జా ఆరోపణలతోనే ఈటలకు టీఆర్ఎస్ కు మధ్య గ్యాప్ పెరిగింది. ఆయన్ను మంత్రి పదవినుంచి తొలగించారు. అప్పట్లో తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ ఈటల ఎదురు తిరిగారు, కోర్టుమెట్లెక్కారు. చివరకు ఇప్పుడు విచారణ అంతా పూర్తి చేసి ఆ భూముల్ని రైతులకు పంపిణీ చేశారు అధికారులు. మాసాయిపేట మండలం హకీంపేట, అచ్చంపేటలో […]
Author: Sarvi
ఏపీలో అమ్ముతున్న లిక్కర్ లో విష పదార్థాలు ఉన్నాయంటూ ఇటీవల టీడీపీ నేతలు రాద్ధాంతం చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై మంత్రి అంబటి రాంబాబు ఇదివరకే దీటుగా బదులిచ్చారు. టీడీపీ నేతల మెదళ్లే విషపూరితంగా మారాయని విమర్శించారు అంబటి. గతంలో చంద్రబాబు అనుమతి ఇచ్చిన డిస్టిలరీలే ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయని, అప్పటి అమృతం ఇప్పుడు విషమైపోయిందా అంటూ మండిపడ్డారు. ఇప్పుడు ఏపీ లిక్కర్ అసోసియేషన్ ప్రతినిధులు కూడా ఈ విషయంపై వివరణ ఇచ్చారు. డిస్టిలరీలు సరఫరా చేసే […]
మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి బీజేపీలో చేరడం ఖాయమైనట్టు సమాచారం. ఈ రోజు ఆయనతో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ తరుణ్ చుగ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌లు భేటీ అయ్యారు. విశ్వేశ్వర రెడ్డి ఇంట్లోనే జరిగిన ఈ భేటీ దాదాపు గంటకు పైగా జరిగింది. విశ్వేశ్వర రెడ్డిని బీజేపీలో చేరవలసిందిగా తరుణ్ చుగ్ ఆహ్వానించగా ఆయన సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ లో జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు జూలై […]
ఏపీ ప్రభుత్వం తనపై రెండోసారి సస్పెన్షన్ వేటు వేయడం పట్ల సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు తీవ్రంగా స్పందించారు. విజయవాడలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఒకే అంశంపై ప్రభుత్వం రెండుసార్లు ఎలా చర్యలు తీసుకుంటుందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలు న్యాయ సమీక్షలో చెల్లుబాటు కావు అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. తనను సస్పెండ్ చేసినట్లు మీడియాలో వచ్చిందని.. తనకైతే ఇంకా ఎటువంటి ఆదేశాలు అందలేదన్నారు. తనపై ఇప్పటివరకు చార్జిషీట్ కూడా […]
షర్మిల తెలంగాణలో వైఎస్సార్టీపీ అనే పార్టీ పెట్టిన తర్వాత విజయమ్మ దాదాపుగా కుమార్తెతోపాటే ఉంటున్నారు. జగన్ తో విభేదాలున్నాయనే పుకార్లు కూడా బలంగా వినిపిస్తున్నాయి. వైసీపీ నాయకులు ఎప్పటికప్పుడు వాటిని కొట్టిపారేస్తున్నా.. ఇటీవల కాలంలో జగన్, విజయమ్మ కలసి కనిపించిన సందర్భాలు అరుదు. అయితే ఈ అపోహలకు చెక్ పెడుతూ ఇప్పుడు విజయమ్మ వైసీపీ ప్లీనరీ సమావేశానికి హాజరు కాబోతున్నారని తెలుస్తోంది. జూలై 8, 9 తేదీల్లో గుంటూరు జిల్లాలో జరిగే వైసీపీ రాష్ట్ర స్థాయి ప్లీనరీ […]
హైదరాబాద్‌లో వచ్చే వారం జరుగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల విజయం కోసం ఒకవైపు బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తుండగా మరో వైపు ఆ పార్టీకి వ్యతిరేకంగా కూడా ప్రచారం ఊపందుకుంది. హైదరాబాద్ నగరంలో ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ది కార్యక్రమాలపై ఫ్లెక్సీలు, పోస్టర్లు, బ్యానర్లు దర్శనమిస్తుండగా… మరో వైపు మోడీ, అమిత్ షా, జేపీ నడ్డాల ఫోటోలతో బీజేపీ ఫ్లెక్సీలు, పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. ఇలా పోటా పోటీ ప్రచారం నడుస్తుండగానే సికిందరాబాద్ పరిసర ప్రాంతాల్లో మోదీకి […]
తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో మంది విద్యార్థులు చక్కని మార్కులతో పాసై ఆనందంలో మునిగిపోయారు. అయితే యూసుఫ్‌గూడలోని స్టేట్ హోంలో ఈ రిజల్ట్స్ పండగ వాతావరణాన్ని తీసుకొని వచ్చాయి. అవిభక్త కవలలు వీణా-వాణి ఇంటర్ సెకెండ్ ఇయర్ ఫస్ట్ క్లాస్‌లో పాసయ్యారు. వీణా 70 శాతం, వాణి 71 శాతం మార్కులతో పాసవడంతో స్టేట్ హోంలో సంబరాలు అంబరాన్నంటాయి. ప్రభుత్వ అనుమతితో హోంలోనే వీరిద్దరికీ పరీక్షలు నిర్వహించారు. వీరి పరిస్థితి చూసి ఇన్విజిలేటర్ […]
ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయంపై ఏపీ హైకోర్టులో సుదీర్ఘంగా వాదనలు నడిచాయి. ఇటు ప్రభుత్వం, అటు బుక్ మై షో మధ్య గట్టిగా వాదనలు నడిచాయి. ప్రేక్షకులను బుక్ మై షో లాంటి సంస్థలు దోచేస్తున్నాయని ప్రభుత్వం ఆరోపించగా.. ప్రభుత్వం గుత్తాధిపత్యానికి తెరలేపుతోందని బుక్ మై షో ఆరోపించింది. ప్రభుత్వం తెస్తున్న పోర్టల్ ద్వారానే ఆన్‌లైన్‌లో టికెట్లు విక్రయించాలన్న నిబంధనను బుక్ మై షో తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రభుత్వం నేరుగా తనకు తాను ఆన్‌లైన్‌లో టికెట్లు విక్రయిస్తే […]
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాలనుంచి సడన్ గా 800కోట్ల రూపాయలు మాయం అయ్యాయి. 90వేల మంది ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాలనుంచి ఈ నగదు విత్ డ్రా అయినట్టు తెలుస్తోంది. ఉద్యోగులు జీపీఎఫ్ స్లిప్ లు డౌన్ లోడ్ చేసి చూసుకుని షాకయ్యారు. కొంతమంది ఉద్యోగుల జీపీఎఫ్ అకౌంట్ నుంచి దాదాపు 80వేల రూపాయలు కూడా విత్ డ్రా అయినట్టు తెలుస్తోంది. జీపీఎఫ్ ఖాతాల నిర్వహణ బాధ్యత ప్రభుత్వానిదే అయినా.. గతంలో ఎప్పుడూ ఇలా విత్ డ్రా […]
ప్రజా స్పందన చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 175 సీట్లు ఖాయమనిపిస్తోందని శ్రీశైలం వైసీపీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి వ్యాఖ్యానించారు. నియోజకవర్గ ప్లీనరీలో ప్రసంగించిన ఆయన.. వచ్చే ఎన్నికల్లో ఆడవారి ఓట్లు వైసీపీకే పడుతాయన్నారు. మొగుళ్లు వద్దన్నా సరే వారి పెళ్లాలు వైసీపీకి ఓటేస్తారన్నారు. తనకు వచ్చే ఎన్నికల్లో 50వేలకు పైగా మెజారిటీ వస్తుందని చక్రపాణిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.సంక్షేమ పథకాల అమలులో జగన్ నడి సముద్రంలో చిక్కుకుని ఈదుతున్నారని.. ఆయనకు ప్రజలే అండగా ఉండాలన్నారు. సోషల్ […]