బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ అంగరంగ వైభవంగా ముస్తాబయ్యింది. మాదాపూర్‌లోని హైటెక్స్ ప్రాంగణంలో శని, ఆదివారాల్లో (జూలై 2, 3న) జరుగనున్న ఈ సమావేశానికి ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు, బీజేపీ ముఖ్యమంత్రులతో సహా పలు రాష్ట్రాలకు చెందిన బీజేపీ కార్యకర్తలు హాజరుకానున్నారు. ప్రధాని సహా కేంద్ర ప్రభుత్వంలోని కీలక నాయకులంతా హైదరాబాద్‌కు రానుండటంతో ఎస్పీజీతో పాటు తెలంగాణ పోలీస్ భారీ భద్రత ఏర్పాట్లు […]
Author: Sarvi
భారతదేశంలో సామూహిక హత్యలు జరిగే ప్రమాదం ఎక్కువగా ఉందని అమెరికా సంయుక్త రాష్ట్రాల సీనియర్ అధికారి ఒకరు గురువారం ఆందోళన వెలిబుచ్చారని హిందుస్తాన్ టైమ్స్ నివేదించింది. భారతదేశంలో మత స్వేచ్ఛపై జరిగిన చర్చా కార్యక్రమంలో అంతర్జాతీయ మత స్వేచ్ఛ రాయబారి ఈ వ్యాఖ్యలు చేశారు. సామూహిక హత్యలకు గురయ్యే దేశాలలో భారతదేశం రెండవ స్థానంలో ఉందని జర్మనీ హోలోకాస్ట్ మ్యూజియంలోని ఎర్లీ వార్నింగ్ ప్రాజెక్ట్ పరిశోధన తెలియజేసిందని ఆయన అన్నారు. 2022లో భారతదేశంలో సామూహిక హత్యలు ప్రారంభమయ్యే […]
తెలంగాణ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. కేవలం ప్రభుత్వ, రాజకీయ పరమైన ట్వీట్లే కాకుండా.. అప్పుడప్పుడు తనకు వచ్చే రిక్వెస్ట్‌లకు స్పందిస్తుంటారు. ఎవరైనా పేద వాళ్లు ఆసుపత్రుల్లో ఉన్నా, చదువుకు ఆర్థిక సాయం కావాలన్నా ఆయనను సంప్రదిస్తుంటారు. ఒక్కోసారి ఎవరైనా బాధితుల తరపున సాయం కోరినా చేస్తుంటారు. తాజాగా బీహార్ విద్యార్థిని కష్టానికి కేటీఆర్ చలించిపోయారు. ఆమె బాధను ఎవరూ ఆయనకు చెప్పలేదు. కానీ సోషల్ మీడియాలో వీడియో చూసి సాయం చేయడానికి ముందుకు […]
జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం తెలంగాణకు వస్తున్న బీజేపీ నేతలు హైదరాబాద్ బిర్యానీ తిని, ఇరానీ చాయ్ తాగి వెళ్లాలంటూ సెటైర్లు వేశారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ కి ఎవరైనా రావొచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, ఎవ్వరూ అడ్డుచెప్పరు, అలా వచ్చిన వారు మంచిగా బిర్యానీ తిని, ఇరానీ చాయ్ తాగి సంతోషంగా తిరిగెళ్లొచ్చు దానికి కూడా అభ్యంతరం లేదని అన్నారు కేటీఆర్. అదే సమయంలో తెలంగాణలోని అన్ని నియోజకవర్గాలకు బీజేపీ సిపాయ్ లు వస్తున్నారని వారిని ఊరూరా […]
దేశాన్ని అభివృద్ధి చేయడం చేతగాని బీజేపీ, చివరకు ఫ్లెక్సీలు చించుకుంటూ కాలం గడుపుతోందని మండిపడ్డారు టీఆర్ఎస్ నేతలు. హైదరాబాద్ లో తెలంగాణ అభివృద్ధిని చాటుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, హోర్డింగ్ లను బీజేపీ నేతలు కావాలనే చించేస్తున్నారని, వారి విధ్వంస రాజకీయాలకు ఇదో నిదర్శనం అని చెబుతున్నారు. హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల వేళ.. టీఆర్ఎస్-బీజేపీ మధ్య ఫ్లెక్సీ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. మోదీని పొగుడుతూ బీజేపీ వాళ్లు కూడా ఫ్లెక్సీలు వేసుకున్నారు. […]
10,000 కంటే ఎక్కువ మందిని 300 కోట్ల రూపాయల మేర మోసగించిన భారత సంతతికి చెందిన వ్యక్తి అమెరికాలో అరెస్టయ్యాడు. నెవాడాలోని లాస్ వెగాస్‌కు చెందిన నీల్ చంద్రన్‌ను లాస్ ఏంజెల్స్‌లో బుధవారం అరెస్టు చేసినట్లు న్యాయ శాఖ తెలిపింది. పోలీసుల సమాచారం ప్రకారం నీల్ చంద్రన్ ‘ViRSE’ అనే బ్యానర్‌తో ఓ ఇన్వేస్ట్‌మెంట్ సంస్థను నిర్వహిస్తున్నాడు. ఈ కంపెనీకి అనుబంధంగా Free Vi Lab, Studio Vi Inc., ViDelivery Inc, ViMarket Inc, Skalex […]
హైదరాబాద్ నగరంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగబోతున్న వేళ బీజెపి నాయకులకు నిద్రలేకుండా చేస్తున్నది టీఆరెస్. ఒక వైపు నగరమంతా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన పోస్టర్లు, కొన్ని చోట్ల గుర్తు తెలియని వ్యక్తులు మోడీ ఫేల్యూర్స్ తో కూడిన వివరాలతో బై బై మోదీ అంటూ ఫ్లెక్సీలతో నగరంలో హల్ చల్ చేస్తున్నారు. కార్యవర్గ సమావేశాలకు వస్తున్న తమ అగ్రనాయకత్వాన్ని ఆహ్వానిస్తూ ఫ్లెక్సీలు ప్ట్టడానికి, పోస్టర్లు వేయడానికి బీజేపీ నాయకులకు స్థలం దొరకని స్థితి. […]
పార్లమెంటులో , బైట తెలంగాణకు వ్యతిరేకంగా మోదీ మాట్లాడిన మాటలు తెలంగాణ ప్రజలు మర్చిపోగలరా ? తల్లిని చంపి బిడ్డను బతికించారని మోదీ అన్న మాటలు తెలంగాణ ప్రజలకు గుర్తులేవా ? అప్రజాస్వామికంగా, పార్లమెంటు తలుపులు మూసి, బలవంతంగా విభజన బిల్లు పాస్ చేశారని మోదీ పార్లమెంటు సాక్షిగా చేసిన ప్రసంగం ఆయన మర్చిపోవచ్చేమో గానీ తెలంగాణ ప్రజల చెవుల్లో ఇంకా మారుమోగుతూనే ఉన్నాయి. అలాంటి తెలంగాణ వ్యతిరేకి మోదీ ఇప్పుడు హైదరాబాద్ వస్తున్నారు. రెండు రోజులు […]
హైదరాబాద్ కంటోన్మెంట్ లో జీవిస్తున్న ప్రజలు, మల్కాజిగిరి నుంచి నగరంలోకి వచ్చే ప్రజలు నడిచే, ప్రయాణించే దారిలేక అనేక ఏళ్ళుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్మీ వాళ్ళు తమ రోడ్ల మీద ప్రజలు ప్రయాణించకుండా అనేక ఇబ్బందులు కలిగిస్తున్నారు. గేట్లను మూసి వేస్తున్నారు. ఈ విషయంపై ప్రజలు, తెలంగాణ ప్రభుత్వం అనేక సార్లు ఆర్మీ అధికారులను కలిసి విజ్ఞప్తులు చేశారు. టీఆరెస్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం ఇక్కడి ప్రజల ఇబ్బందులను తొలగించడానికి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సంప్రదించింది. […]
భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా ఇతర రాష్ట్రాల నుండి వస్తున్న పలువురు బీజెపి నేతలు తెలంగాణలోని కొన్ని నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే అలా నియోజకవర్గాలకు వచ్చే నేతలపై ఈ ప్రశ్నలు ఎక్కుపెట్టండి అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. ఆ పోస్ట్ లో 19 ప్రశ్నలు సంధించారు. ఆ పోస్టు వివరాలు… ”తెలంగాణ ప్రజలారా తస్మాత్ జాగ్రత్త […]