ఇంగ్లాండ్‌లో ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత జట్టు మెరగైన స్కోర్ సాధించింది. రెండో రోజు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సెంచరీతో చెలరేగడంతో టీమ్ ఇండియా 416 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. తొలి రోజు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత జట్టు 95 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే వైస్ కెప్టెన్ రిషబ్ పంత్, రవీంద్ర జడేజా జట్టును ఆదుకున్నారు. రిషబ్ పంత్ తన సహజ శైలిలో వేగంగా […]
Author: Sarvi
రాష్ట్రపతి ఎన్నికల్లో యశ్వంత్ సిన్హా గెలవబోతున్నారని టీఆరెస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఆత్మప్రభోదానుసారం ఓటు వేయాలని ఆయన కోరారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్ధతుగా కేసీఆర్ అధ్యక్షతన హైదరాబాద్ లోని జలవిహార్‌లో శనివారం సభ జరిగింది. ఆసభలో కేసీఆర్ మాట్లాడుతూ…. భారత రాజకీయాలను మార్చాల్సిన అవసరం ఉందని అన్నారు. ”ప్రధాన మంత్రి మోదీ ఈరోజు రాష్ట్రానికి వస్తున్నారు. రెండు రోజుల పాటు ఉండి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు. ఈ […]
ఒక పారిశ్రామిక వేత్త.. ఆపై ఈ సంఘంలో ఒక పెద్ద మనిషి.. ఆ పై ఒక నాయకుడు.. రకరకాల పార్టీల్లో మార్పులు.. చివరికి ఒక ప్రజా ప్రతినిధి.. ఆ ప్రజా ప్రతినిధికి పార్టీతో గ్యాప్ వచ్చింది.. ఆ గ్యాప్ పెద్దదయింది.. సవాళ్లు, కేసులు, అరెస్టులు, కోర్టులు, బెయిల్లు, భయాలు వరకు వెళ్ళింది.. కానీ ఆ పెద్ద మనిషి నాయకుడిగా ఫెయిల్, ప్రజా ప్రతినిధి బాధ్యతల్లో పూర్తిగా ఫెయిల్.. రాజ్యాంగమిచ్చిన ఎంపీ పదవికి ఏ మాత్రం న్యాయం చేయలేదు […]
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకోసం హైదరాబాద్ వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీపై నటుడు ప్రకాష్ రాజ్ సెటైర్లు వేశారు. హైదరాబాద్ కు వస్తున్న అత్యుత్తమ నాయకుడికి స్వాగతం అంటూనే పాలన ఎలా ఉండాలో తెలంగాణను చూసి నేర్చుకోవాలని ట్వీట్ చేశారు ప్రకాష్ రాజ్. ”బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మోదీ పర్యటించినప్పుడు ప్రజల సొమ్మును ఖర్చు చేసి ఆయన కోసం రోడ్లు వేస్తుంటారు. తెలంగాణలో మాత్రం ప్రజల సొమ్మును ప్రజల అభివృద్ది కోసం మాత్రమే ఖర్చు చేస్తారు. ఈ […]
అక్రమ కట్టడాలు కూల్చడం కూడా తప్పేనా? అని వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ప్రశ్నించారు. ఏ రాష్ట్రంలోనైనా సరే అక్రమ కట్టడాలు ఉంటే నిబంధనల ప్రకారం కూల్చేయడం సహజమేనని పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని రాజకీయం చేయడం సరికాదన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు అధికారంలో ఉన్నప్పుడు నిబంధనలకు విరుద్ధంగా అక్రమ కట్టడాలు నిర్మించుకున్నారని ఆరోపించారు. వాటిని కచ్చితంగా ధ్వంసం చేస్తామని పునరుద్ఘాటించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబుకు మతి […]
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ఈ రోజు హైదరాబాద్ వచ్చారు. ఆయనకు టీఆరెస్ భారీగా స్వాగతం పలికింది. ఆయన టీఆరెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలతో సహా ఎం ఐ ఎం ఏంపీ, ఎమ్మెల్యేలను కూడా కలవబోతున్నారు. అయితే యశ్వంత్ సిన్హాకు ప్రధాన మద్దతుదారైన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నేతలు మాత్రం ఆయనను కలవడానికి నిరాకరించారు. ఈ వ్యవహారమే ఆ పార్టీలో గొడవకు దారి తీసింది. యశ్వంత్ సిన్హాను టీఆరెస్ ఆహ్వానించినందున తాము ఆయనను కలవబోమని పీసీసీ అధ్యక్షుడు […]
ఇటీవలే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో కేంద్రం ర్యాంకులు ప్రకటించింది. మొదటి స్థానంలో ఏపీ ఉండగా, టాప్ లిస్ట్ లో తెలంగాణ కూడా చోటు సంపాదించుకుంది. ఈ లిస్ట్ పై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. తమ రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లోనే కాదు, పీస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో కూడా టాప్ ప్లేస్ లో ఉందని చెప్పారు. ఇక ఏపీ ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందన బీజేపీకి […]
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ ఈ రోజు హైదరాబాద్ రానున్నారు. ఈ సందర్భంగా టీఆరెస్ ఆయనకు పెద్ద ఎత్తున స్వాగతం చెప్పేందుకు ఏర్పాట్లు చేసింది. ఉదయం 11 గంటలకు ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న యశ్వంత్ సిన్హాకు సీఎం కేసీఆర్ స్వయంగా వెళ్లి ఘన స్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి జలవిహార్ విహార్ వరకు టీఆరెస్ కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీతో యశ్వంత్ సిన్హాను తీసుకెళ్తారు. జలవిహార్ లో ఆయన టీఆరెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశమవుతారు. తనకు మద్దతు […]
హైదరాబాద్ లో శని, ఆదివారాల్లో .. రెండు రోజులపాటు బీజేపీ ‘సంబరాలు’ జరగనున్నాయి. పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, చర్చా గోష్టులు, ఎగ్జిబిషన్లతో నగరమంతా కాషాయమయం కానుంది. ఇప్పటికే సిటీలో అనేకచోట్ల మోడీ, ఇతర బీజేపీ నేతల భారీ కటౌట్లు, పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. పార్టీ పతాకాలతో రోడ్లపక్కన పరిసరాలన్నీ నిండిపోయాయి. ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ తదితర ప్రముఖులంతా నగరంలో అడుగుపెట్టనున్నారు. 340 మందికి పైగా […]
ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. విజయనగరం జిల్లాస్థాయి ప్లీనరీలో మాట్లాడిన ఆయన.. వైసీపీ నాయకుల్లో, కార్యకర్తల్లో ఈ మధ్య రెండో ఆలోచన మొదలైందన్నారు. అదే జరిగితే అందరం నష్టపోతామని హెచ్చరించారు. ” మేం చెప్పేది చాగంటి ప్రవచనలు అనుకోవద్దు. వైసీపీ నాయకులు, కార్యకర్తల్లో ఈ మధ్య రెండో ఆలోచన మొదలైంది. మైండ్ ఈ మధ్య కాస్త డైవర్షన్‌కు గురవుతోంది. అదే నిజమైతే అందరం నష్టపోతాం” అని వ్యాఖ్యానించారు. పక్క చూపులు చూడవద్దని […]