ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ఆవిష్కరించనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న మోడీ సోమవారం ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఏపీకి వస్తారు. విగ్రహావిష్కరణ అనంతరం ప్రధాని భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అదే సమయంలో అల్లూరి సీతారామరాజు కుటుంబ సభ్యులలో ప్రధాని మోడీ […]
Author: Sarvi
పవన్ కల్యాణ్ ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉన్నారు. ప్రజలకు అనుమానాలు ఉండొచ్చు కానీ, ఆ రెండు పార్టీల నేతలు పొత్తులో ఉన్నామనే చెబుతుంటారు. అయితే అది బలంగా ఉందా, బలహీనంగా ఉందా అనేది ఎవరికి వారే అంచనా వేసుకోవచ్చు. ఈ దశలో పవన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీని తీసిపడేసినట్టు మాట్లాడుతూ.. ఆమ్ ఆద్మీ పార్టీని ఆకాశానికెత్తేశారు. అక్కడ ఆమ్ ఆద్మీతో మార్పు మొదలైందని, ఇక్కడ జనసేన ఆ మార్పుకి సిద్ధమైందని చెప్పారు. మంగళగిరి జనసేన […]
కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళితే.. తాము కూడా అందుకు సిద్దమేనని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. హైదరాబాద్ వచ్చిన ప్రధాని మోడీకి స్వాగతం పలికేందుకు ఆయన బేగంపేట విమానాశ్రయానికి వచ్చినప్పుడు విలేకరులతో మాట్లాడారు. తెలంగాణను కూడా మహారాష్ట్ర మోడల్‌గా చేస్తామంటే కుదరదని ఆయన అన్నారు. మేం ఎవరికీ భయపడటం లేదని.. వాళ్లు సై అంటే ముందస్తుకు రెడీ అని అన్నారు. దేశ ప్రజలందరూ మోడీ ప్రభుత్వం దిగిపోవాలని కోరుకుంటున్నారని.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా […]
బీజేపీ, ప్రధాని మోడీపై ఉమ్మడి ‘పోరు’ మొదలైంది. తెలంగాణ సీఎం కేసీఆర్, రాష్ట్రపతి ఎన్నికకు విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా.. ఒకే వేదిక మీద ఈ సమర శంఖారావాన్ని పూరించారు. ఈ ఎన్నికలో తనకు కేసీఆర్ నేతృత్వంలోని టీఆరెస్ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో శనివారం హైదరాబాద్ చేరుకున్న సిన్హాకు కేసీఆర్ నుంచి ఘన స్వాగతం లభించింది. జలవిహార్ సభలో జరిగిన సభలో మొదట మాట్లాడిన కేసీఆర్.. ప్రధాని మోడీని వ్యక్తిగతంగా విమర్శించనంటూనే విమర్శలతో చెలరేగిపోయారు. మేకిన్ […]
బీజేపీ ‘విజయసంకల్ప’సభ సంగతి ఏమో కానీ కేసీఆర్ కు కావలసినంత ‘మందుగుండు’ను బీజేపీ నాయకులే సమకూర్చారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళాలన్న ‘సంకల్పాని’కి అద్భుతమైన సరంజామా కేసీఆర్ కు లభించింది. టీఆర్ఎస్ నిర్మాత కేసీఆర్ లో ఒకప్పటి ఉద్యమకారుడు శనివారం మరలా జన్మించాడు. ప్రధాని మోడీపైన, బీజేపీ నాయకత్వంపైన, కేంద్రప్రభుత్వ విధానాలపైన ఆయన విరుచుకు పడ్డ తీరు, చెండాడిన వైనం, చెలరేగిన విధానం నాభూతో న భవిష్యత్తు వలె ఉంది. కేసీఆర్ కు ఆగ్రహం వచ్చినా, అనుగ్రహం వచ్చినా […]
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ పర్యటన కాంగ్రెస్ లో చిచ్చు రేపింది. టీఆరెస్ ఆహ్వానం మేరకు హైదరాబాద్ వచ్చిన యశ్వంత్ ను కాంగ్రెస్ నాయకులెవ్వరూ కలవొద్దని రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. ఆయన అక్కడితో ఆగలేదు. పార్టీ ఆదేశాలకు విరుద్దంగా ఎవరైనా వెళ్తే గోడకేసి కొడ్తా అని రెచ్చ గొట్టే విధంగా మాట్లాడారు. దాంతో ఆ పార్టీలో గొడవలు మొదలయ్యాయి. ఒక వైపు సీనియర్ కాంగ్రెస్ నాయకులు వీ. హన్మంతరావు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి లు […]
పార్లమెంటు సభ్యులు నామా నాగేశ్వర్ రావుకు చెందిన మధుకాన్ గ్రూపు ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) జప్తు చేసింది. రాంచీ ఎక్స్ ప్రెస్ హైవే కేసులో మధుకాన్ గ్రూపుకు చెందిన 96.21 కోట్ల రూపాయల ఆస్తులను ED ఈ రోజు అటాచ్ చేసింది. రాంచీ, జంషడ్ పూర్ రహదారి నిర్మాణం పేరిట బ్యాంకుల నుంచి మధుకాన్ గ్రూపు 1,030 కోట్ల రూపాయల రుణాలను పొంది ఆ తర్వాత ఆ నిధులను దారి మళ్ళించినట్టు ED […]
ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. నియోజకవర్గాల అభివృద్ధి పేరుతో ఎమ్మెల్యేలకు భారీగా నిధులు కేటాయించబోతున్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వం ఇటీవల ‘గడప గడపకు ప్రభుత్వం’ పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. అందరు ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను ఈ ప్రోగ్రాం ద్వారా పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ చోట్ల రోడ్లు, డ్రైనేజీల మీదే ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం జగన్ అమలు చేస్తున్న పథకాల ద్వారా లబ్ది పొందాం.. కానీ ఈ రోడ్లు, […]
భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం హైదరాబాద్ వచ్చిన ప్రధాని మోదీకి తెలంగాణలో నిరసనలు ఎదురయ్యాయి. ఒకవైపు సోషల్ మీడియాలో బైబై మోదీ అనే హ్యాష్ ట్యాగ్ వైరల్ అయిన నేపథ్యంలో మోదీకి వ్యతిరేకంగా పలు సంఘాలు రోడ్డెక్కాయి. అధికారంలోకి రాగానే వంద రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చిన బీజేపీ ఇప్పటి వరకు దాని గురించి పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తంచేస్తూ MRPS, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా […]
టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం హైదరాబాద్ లో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఓ వైపు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, మరోవైపు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా రాకతో ఇరు పార్టీల నేతలు పోటీపోటీగా ఫ్లెక్సీలు కట్టుకున్నారు. ర్యాలీలు నిర్వహించుకుంటున్నారు. దీంతో రాజకీయం వేడెక్కింది. కాగా, ఈ పరిస్థితులపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ […]