బతుకమ్మ వీక్షిస్తున్నది (కవిత)
భాగ్యనగరం సొగసులు.....
కాకతీయులు ,నాటి నిజాం,
మనకు ప్రసాదించిన
వారసత్వ సంపద
నేటి క్షణ క్షణ క్షీణ అవరోహణ ఉత్పాతపయనం
ఈ పాపపంకిలం లో
ఎవరి పాత్ర ఎంతో
ఆ పరమేశ్వరుడు సాక్షి గా
బతుకమ్మ వీక్షిస్తున్నది
ఆ మధుర స్వప్నాల
భాగ్యనగరం గుర్తులు
హుష్ కాకీ చేస్తున్నారు
ఇప్పటి స్వార్ధపరులు
అల్లాప్రభు సాక్షి గా
బతుకమ్మ వీక్షిస్తున్నది
శారదా దేవి కటాక్షము కరువైన
మహా సామ్రాట్ అక్బర్
ఐదు దశాబ్దాలు ఏలిన..
ఆ అద్భుత చక్రవర్తి...
ఫతేపూర్, సిక్రీ నిర్మించి
తన తప్పు
తెలుసుకున్న వైనం
చరిత్ర పుటల్లో
చదువుకోలేదా!?యుద్ధప్రాతిపదికన ...
రాజధాని ఆగ్రా కు
బదిలీ చేయగల్గిన
అత్యంత అమోఘ శీఘ్ర
శాస్త్రీయ పరిశోధనా కౌశలం ....
దీనిల్లాహి సాక్షి గా
బతుకమ్మ వీక్షిస్తున్నది
అలనాటి చెరువులు,
నాలాలు మన పాలకులు
ఆక్రమణ, క్రయవిక్రయాలు
చేసి చేసి
హిందూ, ముస్లీం సంస్కృతి కి
చిహ్న మై విలసిల్లుతోన్న ...
మన భాగ్యనగరం...
మన తెలుగు జాతి...సిరి
నేడు కన్నీరు మున్నీరుగా
రోదిస్తున్నది
యజ్జయాగాలతో
వాల్మీకిమహర్షి ....
రామాయణంలో. ..
శ్రీ రాముడి ని ..
వేదవ్యాసుడు ..
మహాభారతంలో
ద్రౌపదిని సృష్ఠించినట్లు
మరొక
మోక్షగుండం
విశ్వేశ్వరయ్య ను
పుట్టించగలమా?!?
తరతరాలుగా తిరగలిలా తిరుగుతూన్న మన రక్తం
నాసిరకంగా మారి
చాలా కాలం
అయిపోయింది..కదా!?
సర్వత్రా ప్రతిభ,ప్రగతి ...
End Point..కి చేరుకోలేదా..?!
ఒక ఢీల్లీ, ఒక ముంబై,
ఒక హైదరాబాద్ ....
విశ్వనగరాలు......
చినుకు పడితే అలోలక్ష్మణా!?!...
అని అలమటించడం లేదా!?!
ఎవరు ఏ కలం తో గళంతో
చలించి, జ్వలించి రోదించి,ఆక్రోశించి ... మొరపెట్టుకున్నా .,.!?
మళ్ళీ వచ్చే వర్షా కాలంలో
ఇవే కవితలు ....
మార్చి మార్చి
రాసుకోవాలి...కదా!?!
అలానే ... జరుగుతోంది కదా!?
ఇప్పటికైనా పాలకులు
కళ్ళు తెరవక పోతే
ప్రపంచ పటం పై...బ్లా బ్లా బ్లా బ్లా ..భారత్ తథ్యం., కదా?!
తస్మాత్ జాగ్రత్త ..
ఓ భారతీయుడా..
- పత్తి సుమతి