Telugu Global
Andhra Pradesh

సీఎం చంద్రబాబును కలిసిన యువ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి

యంగ్ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డికి రూ.25 లక్షల చెక్‌ను సీఎం చంద్రబాబు అందించారు.

సీఎం చంద్రబాబును కలిసిన యువ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి
X

టీమిండియా యువ క్రికెటర్ ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మర్యాద పూర్వకంగా కలిశాడు. తండ్రి ముత్యాలరెడ్డితో కలిసి నితీశ్ నేడు ఉండవల్లి వచ్చాడు. చంద్రబాబు చేతుల మీదుగా రూ.25 లక్షల చెక్ అందుకున్నాడు. ఈ సందర్భంగా నితీష్‌‌ను చంద్రబాబు ప్రశంసించారు. మరింతగా రాణించి రాష్ట్రానికి పేరు తీసుకురావాలని నితీష్‌తో ముఖ్యమంత్రి అన్నారు. ఎంపీ కేశనేని చిన్ని, ఆంధ్ర క్రికెట్ అసోషియేషన్ సభ్యులు అందరూ నితీష్‌తో పాటు సీఎంను కలిశారు. నితీశ్ కెరీర్ ను తీర్చిదిద్దడంలో మద్దతుగా నిలుస్తున్న అతడి తల్లిదండ్రులను అభినందించాను. రాబోయే సంవత్సరాల్లో మరిన్ని సెంచరీలు సాధించాలని, మరింత విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను" అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

అంతేకాదు, నితీశ్ తనను కలిసిన ఫొటోలు కూడా పంచుకున్నారు. ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌లో గతేడాది రాష్ట్రానికి చెందిన ఐదుగురు ఎంపికయ్యారని, వచ్చే ఏడాది 15 మంది ఎంపిక అయ్యేలా కృషి చేస్తామని ఈ సందర్భంగా ఎంపీ కేశనేని చిన్ని అన్నారు. రాజకీయాలకు అతీతంగా క్రీడలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఇక, ఈ సందర్భంగా క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టెస్ట్‌లో సెంచరీ చేసినా మ్యాచ్ కోల్పోవడం బాధ అనిపించింది. క్రికెట్ అనేది ఒక టీమ్ గేమ్. అందరూ రాణిస్తేనే విజయం సాధ్యం అవుతుంద``ని నితీష్ కుమార్ రెడ్డి అన్నాడు.

First Published:  16 Jan 2025 8:13 PM IST
Next Story