మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమే..జగన్ ధీమా
ఏపీలో కూటమిలో ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతున్నా బడ్జెట్ ప్రవేశపెట్టలేదని వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీలో కూటమిలో ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతున్నా బడ్జెట్ ప్రవేశపెట్టలేదని వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గురువారం గురువారం ఆయన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పార్టీ నేతలతో సమావేశమయ్యారు. రాబోయేది మన ప్రభుత్వమేనని కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని జగన్ తెలిపారు. వైసీపీ శ్రేణులు ప్రజల తరుపున పోరాటాలు చేయాలని, అక్రమ కేసులకు భయపడ్డవద్దని కార్యకర్తలకు జగన్ దిశానిర్దేశం చేశారు. పాలిటిక్స్‌లో విశ్వసనీయత, వ్యక్తత్వం చాలా ముఖ్యమని తెలిపారు. ప్రజలకు కష్టం వచ్చినప్పుడు అండగా నిలబడితే ప్రజలు ఆదరిస్తారని జగన్ తెలిపారు. సీఎం చంద్రబాబు అబద్ధాలు మోసాలపై క్రమంగా ప్రజలలో వ్యతిరేకత పెరుగుతుందని మాజీ సీఎం జగన్ తెలిపారు. గత వైసీపీ హయాంలో ప్రతి సంవత్సరం మనం సంక్షేమ క్యాలెండర్ విడుదల చేశామని అన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలనకూ, టీడీపీ పాలనకూ మధ్య తేడాను ప్రజలు గమనించారు.
రెండు ప్రభుత్వాల్లో ఎవరికి ఏం మంచి జరిగిందన్నదానిపై ప్రతి కుటుంబంలోనూ చర్చ జరుగుతోంది’’ అని వైఎస్ జగన్ వివరించారు. సూపర్ సిక్సూ లేదు సూపర్ సెవెనూ లేదు. విద్యాదీవెన లేదు.. వసతి దీవెనా.. లేదు. ఇంగ్లీషు మీడియం చదువులూ దెబ్బతిన్నాయి, టోఫెలూ పోయింది. గోరుముద్ద కూడా పోయింది. ప్రజారోగ్య రంగం తీవ్రంగా దెబ్బతింది. ఆరోగ్యశ్రీ అటకెక్కింది. వ్యవసాయం, పెట్టుబడి సాయం కూడా పోయిందన్నారు. నన్ను అక్రమంగా 16 నెలలు జైల్లో పెట్టారు. నున్న ఇబ్బంది పెట్టినట్లు ఎవరిని పెట్టలేదు. అయిన ప్రజల ఆశీస్సులతో అధికారంలోకి వచ్చామని జగన్ అన్నారు. కేసులు పెట్టడం మినహా వీళ్లు చేయగలిగింది ఏమీ లేదు. రెడ్‌బుక్ ఏదైనా పెద్ద విషయమా? అదేదో గొప్ప పని అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఇలా అయితే ప్రతి ఒక్కరూ ఒక బుక్ రాసుకుంటారు. న్యాయం, ధర్మం అనేవి ఉండాలి. అన్యాయమైన పరిపాలన ఇవాళ కొనసాగుతోంది. మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే’’ అని జగన్ ధీమా వ్యక్తం చేశారు.