పవన్ కళ్యాణ్‌కు డిప్యూటీ సీఎం బదులు ఆ శాఖ ఇస్తే బాగుండు : సీపీఐ రామకృష్ణ
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ షాకింగ్ కామెంట్స్ చేశారు

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి బదులు దేవదాయ శాఖ ఇస్తే బాగుంటుందని రామకృష్ణ అన్నారు. ఆయన మాట్లాడుతు పరిపాలన వదిలేసి గుళ్లు, గోపురాలు అంటూ తిరుగుతున్నరని ఎద్దేవా చేశారు. ప్రశ్నించడానికి పుట్టానని చెబుతున్న పవన్ కళ్యాణ్.. కాషాయ దుస్తులు వేసుకుని గుళ్లు, గోపురాల చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. డిప్యూటీ సీఎం అయ్యుండి పాలన చేయకుండా తిరుమల లడ్డూలో కల్తీ పేరుతో మౌన దీక్ష చేస్తా అనడం సబబు కాదన్నారు. ప్రశ్నించడం, పాలించడం మానేసి తిరిగే పవన్‌కు డిప్యూటీ సీఎం పదవి అవసరమా? అని ప్రశ్నించారు.
మంత్రిగా ఉన్న పవన్ ప్రశ్నించకుండా మౌనదీక్షలు,కాషాయం అంటూ తిరగడం వింతగా ఉందన్నారు. గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లో అదానీ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టులకు 2022లో ఏకంగా 2,500 ఎకరాలను కేటాయించారని, దీనిపై ప్రశ్నించరని విమర్శించారు. ప్రశ్నించడం, పాలించడం మానేసి తిరిగే పవన్ కల్యాణ్‌కు డిప్యూటీ సీఎం పదవి అవసరమా? అని ఆయన ప్రశ్నించారు. కేబినెట్‌లో ఉన్న పవన్ ప్రశ్నించకుండా మౌన దీక్షలు, కాషాయం అంటూ తిరగడం వింతగా ఉందని దుయ్యబట్టారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో దేశంలో ఎక్కడా జరగని దోపిడీ మన రాష్ట్రంలో జరిగిందని రామకృష్ణ ఆరోపించారు.