Telugu Global
Andhra Pradesh

జేసీ, ఆది వర్గాల మధ్య వార్..సీఎం చంద్రబాబు సీరియస్

జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి వర్గాల మధ్య వార్‌ కొనసాగుతోంది.

జేసీ, ఆది వర్గాల మధ్య  వార్..సీఎం చంద్రబాబు సీరియస్
X

మాజీ మంత్రి జేసీ ప్రభాకర్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఆర్టీపీసీ వద్దకు జేసీ వాహనాలను ఆది వర్గం అనుమతించడం లేదు. దీంతో అనంతపురం జిల్లా తాడిపత్రి సిమెంట్ కంపెనీల వద్ద జమ్మలమడుగు వెహికల్స్ అడ్డుగించారు. జమ్మలమడుగు వాహనాలకు లోడింగ్‌ చేయొద్దని జేసీ వర్గం హుకుం జారీ చేసింది. ఆర్టీపీపీ వద్ద జేసీ వాహనాలకు లోడింగ్‌ చేయొద్దని ఆది వర్గం చెబుతోంది. ఇరువురి నేతల మధ్యలో ట్రాన్స్‌పోర్ట్‌ యాజమానులు నలిగిపోతున్నారు. జిల్లా సరిహద్దులో ఉద్రిక్తత నెలకొంది. ఆర్టీపీపీ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

వ్యవహారానికి సంబంధించి ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ,జేసీ ప్రభాకర్‌రెడ్డిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరించొద్దని హితవు పలికారు. ఏపీలో లా అండ్ ఆర్డర్‌ను విఘాతం కల్పిస్తే సహించను అని చంద్రబాబు హెచ్చారించారు. ఈ ఘటనపై అధికారులు పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలి ఆదేశించారు. ఈ విషయంలో ఉన్నధికారులు కఠినంగా వ్యవహరించాలని ఆయన ఆదేశించారు. ఈమేరకు జిల్లా ఎస్పీకి జేసీ లేఖ రాయడంతోపాటు స్వయంగా రంగంలోకి దిగడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. మంగళవారం కూడా తాడిపత్రి నుంచి ఆర్టీపీపీ వరకు మూడు చోట్ల చెక్‌ పోస్టుల్లో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు.

First Published:  27 Nov 2024 3:42 PM IST
Next Story