Telugu Global
Andhra Pradesh

వాల్తేరు రైల్వే డివిజన్‌ను విశాఖగా పేరు మార్పు

విశాఖపట్నం రైల్వే డివిజన్, విశాఖ కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ పరిధిలను కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.

వాల్తేరు రైల్వే డివిజన్‌ను విశాఖగా పేరు మార్పు
X

విశాఖ కేంద్రంగా ఏర్పాటైన సౌత్ కోస్టల్ రైల్వే జోన్ పరిధిలను 410 కిలోమీటర్లు చేర్చుతు ఇండియన్ రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. వాల్తేరు డివిజన్ పేరును విశాఖగా మార్చింది. గతంలో వాల్తేరులో ఉన్న ఏపీ రైల్వే స్టేషన్లను విశాఖకు బదిలీ చేసింది.కొండపల్లి - మొటుమర్రి సెక్షన్‌ను సికింద్రాబాద్ డివిజన్ నుంచి విజయవాడ డివిజన్‌గా మారుస్తూ రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. సౌత్ కోస్టల్ రైల్వే జోన్ పరిధిలోకి విశాఖ, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు రానున్నాయి.రాయగడ రైల్వే డివిజన్ పరిధిని కూడా ఖరారు చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.

విశాఖ డివిజన్‌లో 410 కిలోమీటర్లు పరిధిని చేర్చారు రైల్వే అధికారులు. రాయగడ రైల్వే డివిజన్‌లోని కొన్ని మార్గాలను విశాఖపట్నం రైల్వే డివిజన్ పరిధిలోకి తీసుకొచ్చారు. రెండు డివిజన్ల పరిధిని ఖరారు చేశారు. విశాఖ రైల్వే డివిజన్‌ను కొత్తగా ఏర్పాటు చేయడంతో సౌత్ కోస్టల్ రైల్వే జోన్ పరిధిలోకి దాన్ని మార్చేశారు. ఇంతకు ముందు గుంటూరు, గుంతకల్లు, విజయవాడ రైల్వే డివిజన్‌లు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉండేవి.. ఇప్పుడు వీటన్నింటినీ సౌత్ కోస్టల్ రైల్వే పరిధిలోకి తీసుకొస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కేంద్రం.

First Published:  5 Feb 2025 1:41 PM IST
Next Story