Telugu Global
Andhra Pradesh

ఏపీ వ్యాప్తంగా ఈ నెల 14 నుంచి పల్లె పండుగ : పవన్

ఈ నెల 14వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘పల్లె పండుగ నిర్వహించనున్నట్లు ఏపీ డిప్యూటీ సీం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఉపాధి హామీ పథకం ద్వారా రూ.4500 కోట్లు నిధులను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మంజూరు చేసిందని వెంటనే పనులు చేపట్టాలని పవన్ అధికారులకు సూచించారు

ఏపీ వ్యాప్తంగా ఈ నెల 14 నుంచి పల్లె పండుగ : పవన్
X

ఏపీలో ఈనెల 14నుంచి పల్లె పండుగ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో పవన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామ సభల్లో ఆమోదించిన పనులను పల్లె పండుగ సందర్బంగా ప్రారంభించాలని అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రూ.4500 కోట్ల నిధులు కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి మంజురు చేసిందని గ్రామాల్లో అభివృద్ధి పనులు శరవేగంగా మొదలుపెట్టాలని ఆయన సూచించారు. ఆర్థిక సంఘం, కేంద్రం నుంచి వచ్చిన ఫండ్స్ చేపట్టాల్సిన పనులపై ఈ సమావేశంలో కలెక్టర్లు, అధికారులతో చర్చించారు.

ఇప్పటివరకూ 13,326 పంచాయతీల్లో ఉపాధి హామీ పనులకు తీర్మానాలు చేశామని అధికారులు పవన్‌కు వివరించారు. అక్టోబర్ 14వ తేదీ నుంచి వారంరోజుల పాటు పల్లె పండుగను ఘనంగా చేయాలని దిశానిర్దేశం చేశారు. గతంలోనే ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులకు గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 15వ ఆర్థిక సంఘం నుంచి రూ.1987 కోట్లు, NREGS ద్వారా మరో రూ.4500 కోట్ల నిధులు కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిందని, అభివృద్ధి పనులకు నిధుల కొరత ఉండబోదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

First Published:  8 Oct 2024 4:11 PM IST
Next Story