వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు మూడు రోజుల పోలీసు కస్టడీకి అనుమతించింది. న్యాయవాది సమక్షంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించాలని పోలీసులకు న్యాయస్థానం సూచించింది. మరోవైపు వెన్ను నొప్పితో బాధపడుతున్నట్లు వంశీ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు స్పందించింది. అతడికి బెడ్ అనుమతి ఇచ్చింది. ఉదయం, సాయంత్రం సమయంలో మెడికల్ టెస్టులు చేయాలని సూచించింది. ముఖ్యంగా విజయవాడ పరిధిలోనే కస్టడీలోకి తీసుకొని విచారించాలని కోర్టు ఆదేశించింది. వంశీకి వెస్ట్రన్ టాయిలెట్, బెడ్ సౌకర్యాలు కల్పించాలని జైలు అధికారులను న్యాయస్థానం ఆదేశించింది.
Previous Articleతెలంగాణ తల్లికి అమరజ్యోతే నిలువెత్తు సాక్షి
Next Article అసెంబ్లీ సమావేశాల తొలిరోజే ఆప్ ఎమ్మెల్యేల నిరసన
Keep Reading
Add A Comment