వైకుంఠ ఏకాదశి.. శ్రీవారి దర్శించుకున్న ప్రముఖులు
అభిషేక సేవ అనంతరం ఉదయం 3.45 గంటల నుంచే దర్శనాలకు అనుమతించిన అధికారులు
BY Raju Asari10 Jan 2025 7:36 AM IST
X
Raju Asari Updated On: 10 Jan 2025 7:36 AM IST
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. అభిషేక సేవ అనంతరం ఉదయం 3.45 గంటల నుంచే అధికారులు దర్శనాలకు అనుమతించారు. ప్రొటోకాల్ ప్రముఖులకు అనుకున్న సమయం కంటే ముందే దర్శనం కల్పించారు. శుక్రవారం తెల్లవారుజామునే పలువురు ప్రముఖులు శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తన కుటుంబంతో కలిసి దర్శనం చేసుకున్నారు.
ఏపీ స్పీకర్ అయన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏపీ మంత్రులు వంగలపూడి అనిత, పార్థసారథి, సవిత, నిమ్మల రామానాయుడు శ్రీవారిని దర్శించుకున్నారు. ఆధ్యాత్మిక గురువు రాందేవ్ బాబా వెంకన్న దర్శనానికి వచ్చారు. నందమూరి రామకృష్ణ, బాలకృష్ణ సతీమణి వసుంధర, సుహాసిని తదితరులు ఉత్తర ద్వారం నుంచి శ్రీవారిని దర్శించుకున్నారు.
Next Story